- Home
- Telangana
- హైదరాబాద్ నడిబొడ్డున 50 అంతస్తుల బిల్డింగ్.. ఒక్కరోజులోనే రూ. 800 కోట్ల అమ్మకాలు
హైదరాబాద్ నడిబొడ్డున 50 అంతస్తుల బిల్డింగ్.. ఒక్కరోజులోనే రూ. 800 కోట్ల అమ్మకాలు
Hyderabad: ఓవైపు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం నగరశివారులకు విస్తరిస్తోంది. మరోవైపు నగరం నడి బొడ్డున కూడా విలాసవంతమైన నివాస ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్డీసీ క్రాస్ రోడ్డులో భారీ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భారీ నివాస ప్రాజెక్టు
సెంట్రల్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతంలో ఏఎస్బీఎల్ సంస్థ తన తొలి నివాస ప్రాజెక్టుగా లెగసీని తీసుకొచ్చింది. ప్రారంభమైన మొదటి రోజే రూ.800 కోట్ల అమ్మకాలు జరగడం ఈ ప్రాజెక్టుపై కొనుగోలుదారుల్లో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నివాస సముదాయంగా, పూర్తి స్థాయి గేటెడ్ కమ్యూనిటీగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటైన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఇలాంటి భారీ ప్రాజెక్టు రావడం ప్రత్యేకతగా మారింది. ఇప్పటివరకు నగరంలోని పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించిన విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ తరహా నివాసాలను ఇప్పుడు సెంట్రల్ హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలని ఏఎస్బీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంటి అప్పగింత వరకు జీరో ఈఎంఐ సదుపాయం
ఈ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సంస్థ ప్రకటించిన ‘హ్యాండోవర్ వరకు జీరో ఈఎంఐ’ ఆఫర్ కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. సాధారణంగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ను బ్యాంకు రుణంతో కొనుగోలు చేస్తే, నిర్మాణ పురోగతిని బట్టి బ్యాంకులు విడతల వారీగా రుణాన్ని విడుదల చేస్తాయి. విడుదలైన మొత్తంపై కొనుగోలుదారులు ప్రీ-ఈఎంఐ రూపంలో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు పూర్తయ్యేలోపు ఈ వడ్డీ భారం క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే అద్దె ఇంట్లో ఉంటున్నవారికి ఇది అదనపు ఆర్థిక భారంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో పాత ఇంటి రుణంతో పాటు కొత్త ఇంటి ప్రీ-ఈఎంఐ కూడా చెల్లించాల్సి వస్తుంది.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏఎస్బీఎల్ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కొనుగోలుదారులు ముందుగా బుకింగ్ మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. ఇంటిని అధికారికంగా అప్పగించే వరకు నిర్మాణ దశలో వర్తించే వడ్డీని సంస్థే భరిస్తుంది.
జీ+50 అంతస్తులు.. 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు
ఏఎస్బీఎల్ లెగసీ ప్రాజెక్టును సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో మూడు భారీ నివాస టవర్లు ఉండనున్నాయి. ఒక్కో టవర్ జీ+50 అంతస్తుల ఎత్తుతో రూపుదిద్దుకోనుంది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా 3, 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్లను అందిస్తున్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల వరకు ఉంటుంది. వీటి ప్రారంభ ధర రూ.1.99 కోట్లుగా సంస్థ ప్రకటించింది. విశాలమైన నివాస స్థలంతో పాటు ఆధునిక వసతులు కోరుకునే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాజెక్టును రూపొందించారు. మొత్తం ప్రాజెక్టులో 73.25 శాతం స్థలాన్ని ఖాళీ ప్రదేశాలుగా ఉంచుతున్నారు. సుమారు 74 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు దాదాపు 1.70 లక్షల చదరపు అడుగుల మేర ఇతర సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 50కి పైగా ఆధునిక సదుపాయాలను కల్పించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఆధునిక సదుపాయాలు.. ప్రత్యేక డిజైన్‌తో నిర్మాణం
నివాసితులకు సౌకర్యవంతమైన జీవనశైలిని అందించేలా ఏఎస్బీఎల్ లెగసీని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రాజెక్టులోకి ప్రవేశించగానే ఆకట్టుకునేలా డబుల్ హైట్ లాబీని ఏర్పాటు చేస్తున్నారు. అంతస్తుల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా రెండు మీటర్ల వెడల్పుతో కారిడార్లు నిర్మించనున్నారు. ప్రతి అంతస్తులో ఒక్కో యూనిట్‌కు ఒక లిఫ్ట్ సదుపాయం కల్పించడం మరో ప్రత్యేకత. అపార్ట్మెంట్లలో డ్యూయల్ సింక్ స్పేస్, అవుట్డోర్ లివింగ్ ఏరియాలు, విశాలమైన మాస్టర్ బెడ్రూమ్లు, సౌకర్యవంతమైన వంటగదులు ఏర్పాటు చేయనున్నారు. యుటిలిటీ అవసరాలకు కూడా ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తున్నారు.
మెట్రో, రైల్వే స్టేషన్లకు దగ్గర..
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతానికి ఇప్పటికే మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మెట్రో స్టేషన్‌కు సుమారు రెండు నిమిషాలు, కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఎనిమిది నిమిషాలు, ఎంజీబీఎస్‌కు 15 నిమిషాల ప్రయాణ దూరం ఉంటుంది. సమీపంలో పాఠశాలలు, వాణిజ్య కేంద్రాలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి.















