వాట్సాప్ అప్ డేట్: ఈ మూడు కొత్త ఫీచర్లు మీకు గొప్ప చాటింగ్ అనుభవాన్ని అందిస్తాయి..
ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న యాప్స్ లో ఒకటి ఫేస్ బుక్ యజమాన్యంలోని వాట్సాప్ యాప్. ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీస్‌ను అందించే ఈ యాప్ కి నేటికీ 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అయితే ఈ యాప్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చే లక్ష్యంతో వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది.
WhatsApp Web
దీంతో వినియోగదారులు వాట్సాప్ ఉపయోగించడంలో గొప్ప అనుభవాన్ని పొందుతారు. తాజాగా వాట్సాప్ మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అవేంటంటే ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాట్సాప్ యూజర్లు ఎంతో లాభపడనున్నారు. ఈ ఫీచర్లతో వినియోగదారులు వాట్సాప్‌లో అత్యుత్తమ చాటింగ్ అనుభవాన్ని పొందుతారు. ఈ కొత్త ఫీచర్లు వాయిస్ రికార్డింగ్, మెసేజింగ్ అండ్ ప్రొఫైల్ ఫోటో నోటిఫికేషన్ కు సంబంధించినవి. ఫేస్ బుక్ కంపెనీ చాలా కాలంగా ఈ ఫీచర్ల కోసం బీటా టెస్టింగ్‌పై పని చేస్తోంది. ప్రతుత్తం ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు, ఈ ఫీచర్ల కోసం ఆండ్రాయిడ్ వినియోగదారులు మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ల గురించి ఎంటో తెలుసుకుందాం -
వాయిస్ రికార్డింగ్ కొత్త ఫీచర్
వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ తో యూజర్లు వాయిస్ రికార్డింగ్‌లను పాస్ అండ్ రీ-రికార్డింగ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు వాయిస్ మెసేజ్ పంపే ముందు వినవచ్చు. ఒకవేళ యూజర్ తన రికార్డింగ్ సరైనది కాదని భావిస్తే దానిని వెంటనే తొలగించవచ్చు.
మీ అనుమతి లేకుండా వాట్సాప్ మెసేజ్
ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు తమకు ఎవరు మెసేజ్ చేయవచ్చో ఇంకా ఎవరు చేయకూడదో నిర్ణయించుకోవచ్చు. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ iOS 15లో ఉన్న ఫోకస్ మోడ్‌ను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం, వాట్సాప్ ఈ ఫీచర్‌ను ఐఫోన్ iOS 15 వినియోగదారులు తీసుకురావొచ్చు.
ప్రొఫైల్ ఫోటో నోటిఫికేషన్
ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత వాట్సాప్‌లో మెసేజ్ పంపిన యూజర్ ఫోటో నోటిఫికేషన్లో కనిపిస్తుంది. అయితే, అంతకుముందు నోటిఫికేషన్లో మెసేజ్ పంపిన వినియోగదారు పేరు మాత్రమే కనిపిస్తుంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత మెసేజ్ తో పాటు ఫోటో కూడా చూపిస్తుంది. ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్‌కు ఈ ఫీచర్‌ను జోడించడానికి iOS 15కి అప్డేట్ చేయాల్సి ఉంటుంది.