MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌ కళ్యాణ్‌ వదిలేసిన సినిమాతో హిట్‌ కొట్టి లవర్‌ బాయ్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ వదిలేసిన సినిమాతో హిట్‌ కొట్టి లవర్‌ బాయ్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించాల్సిన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని మరో హీరోతో చేయగా, ఆయన ఫస్ట్ మూవీతోనే బ్రేక్‌ అందుకుని లవర్‌ బాయ్‌గా స్థిరపడిపోయాడు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 26 2024, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవన్‌ కళ్యాణ్‌ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 28 సినిమాలు చేశారు. మరో మూడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. అయితే ఆయన చేయాలనుకుని ఆగిపోయిన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. వాటి లిస్ట్ తీస్తే పదికిపైగానే ఉంటాయి. అయితే ఓ సినిమాతో మాత్రం మరో హీరో ఫస్ట్ బ్రేక్‌ అందుకున్నాడు. ఇండస్ట్రీలో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో స్టార్‌ హీరోగా ఎదిగాడు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

26

పవన్‌ కళ్యాణ్‌ చేయాలనుకున్న సినిమాల్లో `చెప్పాలని ఉంది`. పవన్‌ కళ్యాణ్‌, అమీషా పటేల్‌ జంటగా ఈ మూవీని ప్లాన్‌ చేశారు ఏఎం రత్నం. సినిమాని కూడా ప్రారంభించారు. కానీ మధ్యలోనే ఆగిపోయింది. కారణాలు తెలియవు కానీ, ఈ మూవీ మొత్తంగానే పక్కన పెట్టారు. 
 

36

దీంతో ఇదే కథతో సినిమా మళ్లీ తెరకెక్కింది. అయితే టైటిల్‌ మారింది. కానీ కథ సేమ్‌. అప్పట్లో సక్సెస్‌లో ఉన్న దర్శకుడు కె విజయ్‌ భాస్కర్‌ ఈ మూవీని రూపొందించారు. అది తరుణ్‌ హీరోగా పరిచయం చేస్తూ చేయడం విశేషం. అప్పటి వరకు బాలనటుడిగా రాణించిన తరుణ్‌.. `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఇందులో రిచా పల్లోడ్‌ హీరోయిన్‌. సాయి కిరణ్‌ మరో హీరోగా నటించాడు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కింది. 2000లో విడుదలైంది. పెద్ద హిట్‌ అయ్యింది. 
 

46

తరుణ్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ రావడంలో ఈ సినిమా ముఖ్య పాత్ర పోషించింది. తరుణ్‌ హీరోగా పరిచయం అవుతూ నటించిన తొలి సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్‌ కావడంతో ఆయనకు సినిమాలు క్యూ కట్టాయి. ఇలా వరుసగా లవ్‌ స్టోరీస్‌ చేసి విజయాలు అందుకుని తక్కువ టైమ్‌లోనే లవర్ బాయ్‌గా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు తరుణ్‌.

తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. కానీ ఆ తర్వాత ఆయన డౌన్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. మొత్తంగా పవన్‌ వదిలేసిన సినిమా చేసి హీరోగా ఫస్ట్ బ్రేక్‌ అందుకోవడమే కాదు, లవర్‌ బాయ్‌గా స్టార్‌గా ఎదిగాడు తరుణ్‌. 
 

56

అదే సమయంలో పవన్‌కి వరుస విజయాలు ఉన్నాయి. 1998లో `సుస్వాగతం` పెద్ద హిట్‌. ఆ తర్వాత అదే ఏడాది `తొలి ప్రేమ`తో ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలచింది. నెక్ట్స్ ఇయర్‌ `తమ్ముడు`తో మరో బ్లాక్‌ బస్టర్‌. నెక్ట్స్ ఇయర్‌ `బద్రి`తో హిట్‌.  

2001లో `ఖుషీ`తో సంచలన హిట్‌ని అందుకున్నారు పవన్‌. దీంతో ఆయన స్టార్‌ డమ్‌ ఎవరికీ అందనంత స్థాయికి చేరుకుంది. యూత్‌లో ఫాలోయింగ్‌ పెరగడానికి టాలీవుడ్‌లో అత్యంత యూత్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా పవన్‌ ఎదిగారు. ఆ తర్వాత ఆయనకు వరుసగా పరాజయాలు వెంటాడాయి. 

66

ఇదిలా ఉంటే `చెప్పాలని ఉంది` పేరుతో కూడా సినిమా వచ్చింది. ఇందులో వడ్డే నవీన్‌ హీరోగా నటించగా, రాశీ హీరోయిన్‌గా చేసింది. చంద్ర మహేష్‌ దర్శకుడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. వడ్డే నవీన్‌కి హిట్‌ మూవీనే అని చెప్పొచ్చు. అయితే ఈ కథ కంప్లీట్‌గా వేరు కావడం విశేషం. 

read more:నెట్‌ ఫ్లిక్స్ చేతిలో నాగచైతన్య, శోభితా మ్యారేజ్‌ ఓటీటీ రైట్స్, ఎంతనో తెలిస్తే మతిపోవాల్సిందే

also read: అమీర్‌ ఖాన్‌ టాలీవుడ్‌ ఎంట్రీ?.. బాక్సాఫీసుకు పూనకాలు తెప్పించే కాంబినేషన్‌
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Viroshi Wedding: గ్రాండ్‌గా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్‌, హాజరైన గెస్ట్ లు వీరే.. సాయంత్రం మరో పెళ్లి
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాశీని పాముతో పోల్చిన స్వప్న- జ్యోతో ఆడుకున్న దాసు- పారు టెన్షన్
Recommended image3
Chiru-Charan: టాలీవుడ్‌లో అరుదైన రికార్డులు సెట్‌ చేసిన చిరంజీవి, రామ్‌ చరణ్‌.. పవన్‌, అల్లు అర్జున్‌ కూడా తర్వాతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved