ఫేస్‌బుక్ సర్వర్ డౌన్: గంటల్లో 700 కోట్లకు పైగా నష్టపోయిన సిఈఓ.. కంపెనీ ఇచ్చిన కారణం ఏంటంటే..?
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యజమాన్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లు సోమవారం రాత్రి నుండి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు గంటలపాటు స్తంభించిపోయాయి. ఈ కారణంగా కోట్ల మంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
అయితే ఈ సమస్య సోమవారం రాత్రి 9.15 గంటల సమయంలో తెరపైకి వచ్చింది. దీని తర్వాత ప్రజలు వెంటనే ట్విట్టర్‌లో స్పందించడం ప్రారంభించారు. వినియోగదారులు ఈ మూడు ప్లాట్‌ఫారమ్‌లను సుమారు ఆరు గంటల పాటు ఉపయోగించలేకపోయారు. అయితే మంగళవారం ఉదయం 4.30 గంటలకు ఫేస్‌బుక్ సేవల పునరుద్ధరణ గురించి ట్వీట్ ద్వారా తెలియజేసింది. దీనితో పాటు, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ క్షమాపణ కూడా చెప్పింది. ఈ సమస్య తలెత్తినప్పుడు ప్రజలు మెసేజ్స్ పంపలేకపోవడం లేదా పొందలేకపోవడం లో ఇబ్బందులు ఎదురుకొన్నారు.
రౌటర్ కాన్ఫిగరేషన్ మార్పులు కారణంగా సర్వర్ డౌన్
ఫేస్‌బుక్ డేటా సెంటర్‌ల మధ్య నెట్‌వర్క్ కమ్యూనికేషన్‌ను సమన్వయం చేసే రౌటర్ కాన్ఫిగరేషన్‌లో మార్పు కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. ఫేస్‌బుక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ జనార్దన్ మాట్లాడుతూ ఒక పోస్ట్‌లో నెట్‌వర్క్ ట్రాఫిక్‌లో ఈ అంతరాయం మా డేటా సెంటర్‌లు కమ్యూనికేట్ చేసే విధానంపై భారీ ప్రభావాన్ని చూపింది, దీంతో మా సేవలు నిలిచిపోవడానికి దారి తీసింది. ఆ సమయంలో చాలా మంది సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫేస్‌బుక్ కుప్పకూలిపోవడానికి సాంకేతిక లోపంగా భావించారు.
డొమైన్ నేమ్ సిస్టమ్ (DNS) ఫేస్ బుక్ వెబ్‌పేజీలో లోపం చూపుతోంది. డిఎన్‌ఎస్ ద్వారా వెబ్ అడ్రస్ వారి వినియోగదారులకు వారి సెర్చ్ కి అక్సెస్ అందిస్తాయి. ఒక నివేదిక ప్రకారం డిఎన్‌ఎస్ రికార్డులో లోపం కూడా ఒక కారణం కావచ్చు.
అంతరాయం తర్వాత పడిపోయిన ఫేస్‌బుక్ షేర్లు
సర్వర్ డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల వల్ల ఫేస్‌బుక్ ఆర్థికంగా నష్టపోయింది. ఇందుకు కంపెనీ ఇంటర్నల్ మెమోను కూడా జారీ చేసింది. ఇందులో సర్వర్ డౌన్ ప్రజలకు చాలా పెద్ద సమస్య, ఆస్తులకు కూడా భారీ ప్రమాదం, కంపెనీ ప్రతిష్టకు కూడా ప్రమాదం కలిగిస్తుంది అని పేర్కొంది. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఆస్తులు 7 బిలియన్ డాలర్లకు పైగా లేదా దాదాపు రూ. 52190 కోట్లకు పైగా పడిపోయాయని ఫేస్‌బుక్ పేర్కొంది, అయితే ఫేస్‌బుక్ ఆదాయంలో 80 మిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని అంచనా వేసింది అంటే దాదాపు రూ .596 కోట్లు. ఇంటర్నెట్ గ్లోబల్ అబ్జర్వేటరీ 'నెట్‌బ్లాక్స్' అంచనాల ప్రకారం, ఈ అంతరాయం కారణంగా ప్రతి గంటకు ప్రపంచం మొత్తం ఆర్ధిక వ్యవస్థ 160 మిలియన్ల డాలర్లకు పైగా అంటే దాదాపు రూ .1192.9 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
వెబ్ అండ్ స్మార్ట్‌ఫోన్ రెండింటిలోనూ సమస్య
వెబ్, స్మార్ట్‌ఫోన్ రెండింటిలోనూ వాట్సప్, ఇన్స్తగ్రామ్ పనిచేయ లేదు. ఈ సమస్య అన్ని అండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ ప్లాట్‌ఫారమ్‌లలో సంభవిస్తోంది. ప్రజలు కొత్త మెసేజులు పొందలేదు లేదా ఎవరికీ పంపలేకపోయారు. అదేవిధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ న్యూస్‌ఫీడ్ రిఫ్రెష్‌లో 'కాంట్ రిఫ్రెష్' అనే మెసేజ్ కూడా చూపించింది.
DownDetectorలో ప్రజలు వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పనిచేయకపోవడంపై భారీగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మెసేజులు పంపలేకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నాట్లు తెలిపారు. Downdetector.com ప్రకారం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. సర్వర్ డౌన్ కావడంతో సుమారు 50వేల మంది ఫిర్యాదులు చేశారు.
ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఎదుర్కొంటున్న సమస్య గురించి ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు డౌన్ అయ్యాయని 8.5 లక్షల ట్వీట్లు చేశారు. వాట్సాప్ ట్విట్టర్ హ్యాండిల్‌లో మా ఐటి బృందం సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోందని తెలిపింది. అయితే, ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
ఫేస్‌బుక్ క్షమాపణ
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 6 గంటలకు పైగా, వాట్సాప్ 7 గంటలకు పైగా నిలిచిపోయి తీరిగి పున:ప్రారంభంమైన తర్వాత ఫేస్‌బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో మా వల్ల ప్రజలకు, వారి వ్యాపారానికి జరిగిన నష్టానికి క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పింది.