MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ ఎఫెక్ట్: ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT సహా అనేక యాప్స్ బంద్

క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ ఎఫెక్ట్: ప్రపంచవ్యాప్తంగా X, ChatGPT సహా అనేక యాప్స్ బంద్

Cloudflare Outage : ప్రముఖ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా X , చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, పేపాల్ వంటి అనేక అంతర్జాతీయ వెబ్‌సైట్ల సేవల్లో అంతరాయం ఏర్పడింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 18 2025, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రముఖ ఇంటర్నేట్ సేవలు
Image Credit : Cloudflare

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ప్రముఖ ఇంటర్నేట్ సేవలు

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేస్తూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్), AI సేవలు అందించే ఓపెన్ఏఐ (OpenAI) సంస్థకు చెందిన చాట్ జీపీటీ సహా అనేక అంతర్జాతీయ వెబ్‌సైట్లు, యాప్‌ల సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. అంతర్జాల మౌలిక సదుపాయాలను అందించే (Internet Infrastructure Service Provider) దిగ్గజ సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) లో తలెత్తిన సాంకేతిక సమస్యే ఈ ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ అంతరాయం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందించే అనేక సంస్థలను, కోట్లాది మంది వినియోగదారులను షాక్ కు గురిచేసింది.

25
ఏ ఏ సేవలకు అంతరాయం ఏర్పడింది? వినియోగదారుల ఫిర్యాదులు
Image Credit : TATA Website

ఏ ఏ సేవలకు అంతరాయం ఏర్పడింది? వినియోగదారుల ఫిర్యాదులు

క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా X, OpenAIతో పాటు, ఆన్‌లైన్ చెల్లింపుల దిగ్గజం పేపాల్ (PayPal), రవాణా సేవలు అందించే ఉబెర్ (Uber) వంటి సంస్థల డిజిటల్ సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వినియోగదారులు తమ వెబ్‌సైట్లు లేదా యాప్‌లను తెరవడానికి ప్రయత్నించగా, స్క్రీన్‌పై 'ఎర్రర్ కోడ్ 500' లేదా 'ఎర్రర్ 522' (కనెక్షన్ టైమ్డ్ అవుట్) వంటి సందేశాలు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా X (ట్విట్టర్) వినియోగదారులకు ఫీడ్ లోడ్ కాకపోవడం, పోస్ట్‌లు చేయలేకపోవడం, స్క్రీన్ ఖాళీగా కనిపించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.

వేలాది మంది యూజర్లు తమ సమస్యలను, ఆందోళనను డౌన్‌డిటెక్టర్ వంటి ఔట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లలో నివేదించారు. ఈ అంతరాయం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:37 గంటల ప్రాంతంలో మొదలైనట్లుగా డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. కొన్ని నివేదికల ప్రకారం, AWS (అమెజాన్ వెబ్ సర్వీసెస్) సేవలు కూడా కొంత మేర ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
సూపర్ ఫీచర్లతో Oppo Find X9 సిరీస్ లాంచ్ : స్పెక్స్, ధర, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవే
Related image2
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5 ఫోన్లు ఇవే
35
క్లౌడ్‌ఫ్లేర్ అంటే ఏమిటి? ఎందుకంత కీలకం?
Image Credit : Gemini

క్లౌడ్‌ఫ్లేర్ అంటే ఏమిటి? ఎందుకంత కీలకం?

క్లౌడ్‌ఫ్లేర్ అనేది ఇంటర్నెట్ కు వెన్నెముక వంటిది. ఇది వెబ్‌సైట్లకు కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (CDN), సెక్యూరిటీ రక్షణలు, పెర్ఫార్మెన్స్ టూల్స్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాల సేవలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల ద్వారా ఇది కంటెంట్‌ను వేగంగా యూజర్‌కు చేరుస్తుంది. 

సైబర్ దాడులు జరిగినప్పుడు వెబ్‌సైట్లను రక్షించడంలోనూ, అధిక ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా సేవలు నిరంతరంగా కొనసాగేలా చేయడంలోనూ క్లౌడ్‌ఫ్లేర్ కీలక పాత్ర పోషిస్తుంది. అనేక పెద్ద పెద్ద వెబ్‌సైట్లు, ప్లాట్‌ఫామ్‌లు తమ సేవలను ఆన్‌లైన్‌లో ఉంచడానికి క్లౌడ్‌ఫ్లేర్ మౌలిక సదుపాయాలపై ఆధారపడతాయి. అందుకే ఈ సంస్థ వ్యవస్థల్లో చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తినా, దాని ప్రభావం కేవలం ఒకే సేవకు కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వేలాది వెబ్‌సైట్‌లపై పడుతుంది.

45
సమస్యకు కారణం ఏంటి?
Image Credit : Getty

సమస్యకు కారణం ఏంటి?

ఈ భారీ అంతరాయంపై క్లౌడ్‌ఫ్లేర్ బృందం తక్షణమే స్పందించింది. "చాలా మంది కస్టమర్‌లపై ప్రభావం చూపే సమస్యను గుర్తించాం. ప్రస్తుతం మా బృందం సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమై ఉంది" అని తమ అధికారిక స్టేటస్ పేజీలో ప్రకటించింది. ప్రారంభ విశ్లేషణ ప్రకారం, క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్‌లోని "మెష్ లేయర్" లోని రూటింగ్ (Routing) ప్రక్రియలో మార్పు (Change) కారణంగా ఈ సాంకేతిక లోపం తలెత్తినట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ సమస్యపై X ప్లాట్‌ఫామ్ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయనప్పటికీ, నెటిజన్లు మాత్రం తమ అభిప్రాయాలను ఇతర సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్నారు. "X తో పాటు డౌన్‌డిటెక్టర్ కూడా పనిచేయడం లేదంటే క్లౌడ్‌ఫ్లేర్ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, మరొకరు "క్లౌడ్‌ఫ్లేర్ లోపం వల్లే X స్తంభించింది, ఇది ప్రధాన సర్వర్ సమస్య" అని పేర్కొన్నాడు.

55
క్లౌడ్‌ఫ్లేర్ ఇంజనీర్ల చర్యలు
Image Credit : stockphoto

క్లౌడ్‌ఫ్లేర్ ఇంజనీర్ల చర్యలు

ఈ సాంకేతిక అంతరాయం కేవలం కొద్ది గంటల్లోనే పరిష్కారమై, చాలా వరకు సేవలు తిరిగి పునరుద్ధరించినట్టు క్లౌడ్‌ఫ్లేర్ ఇంజనీర్లు తెలిపారు. తక్కువ సమయంలోనే నెట్‌వర్క్‌ను పునరుద్ధరించారు. అయితే, ఇది ఇంకా పూర్తిగా అన్ని ప్రాంతాల్లో పరిష్కారం కాలేదు.

ఇంటర్నెట్‌లో అత్యధిక ట్రాఫిక్‌ను నిర్వహించే క్లౌడ్‌ఫ్లేర్, AWS వంటి సంస్థల్లో లోపం తలెత్తితే, ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోవచ్చని ఈ సంఘటన నిరూపించింది. భవిష్యత్తులో ఇలాంటి విస్తృత అంతరాయాలు తలెత్తకుండా, మౌలిక సదుపాయాల బహుళ ఆధారం, అత్యవసర ప్రణాళికలు ఎంత ముఖ్యమో ఈ సంఘటన టెక్ ప్రపంచానికి  చూపించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారత దేశం
ప్రపంచం
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
కేవలం రూ.9 కే 100GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ .. బిఎస్ఎన్ఎల్ లిమిటెడ్ రీచార్జ్ ఆఫర్, వెంటనే పొందండి
Recommended image2
సూపర్ ఫీచర్లతో Oppo Find X9 సిరీస్ లాంచ్ : స్పెక్స్, ధర, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవే
Recommended image3
దేశంలో హైదరాబాద్ నెంబర్ వన్ ... ఐటీ సిటీ బెంగళూరునే వెనక్కినెట్టేసిందిగా..!
Related Stories
Recommended image1
సూపర్ ఫీచర్లతో Oppo Find X9 సిరీస్ లాంచ్ : స్పెక్స్, ధర, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవే
Recommended image2
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5 ఫోన్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved