- Home
- Technology
- Gadgets
- సూపర్ ఫీచర్లతో Oppo Find X9 సిరీస్ లాంచ్ : స్పెక్స్, ధర, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవే
సూపర్ ఫీచర్లతో Oppo Find X9 సిరీస్ లాంచ్ : స్పెక్స్, ధర, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవే
Oppo Find X9 Series : ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ భారత్‌లో విడుదలైంది. హాసెల్‌బ్లాడ్ కెమెరా, 7,000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌తో అద్భుతమైన ఫీచర్లను కలిగివుంది. వీటి ధరలు, ఆఫర్లు, ఇతర స్పెక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

భారీ అంచనాల మధ్య భారత మార్కెట్లో Oppo Find X9 సిరీస్ విడుదల
ఒప్పో తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లైన ఫైండ్ ఎక్స్ 9 (Find X9), ఫైండ్ ఎక్స్ 9ప్రో (Find X9 Pro) స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. హాసెల్‌బ్లాడ్‌తో కలిసి రూపొందించిన కొత్త తరం కెమెరా సెటప్, అధిక బ్యాటరీ సామర్థ్యం, శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 (MediaTek Dimensity 9500) ప్రాసెసర్, అలాగే కలర్ ఓఎస్ 16 (ColorOS 16) వంటి ఫీచర్లు ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపాయి. ఇప్పటికే చైనా, గ్లోబల్ మార్కెట్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్‌కు భారత్‌లో కూడా భారీ డిమాండ్ ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.
Oppo Find X9 Series ధరలు, కలర్స్
Oppo Find X9
• 12GB + 256GB: ₹74,999
• 16GB + 512GB: ₹84,999
• కలర్స్: స్పేస్ బ్లాక్, టైటానియమ్ గ్రే
Oppo Find X9 Pro
• 16GB + 512GB: ₹1,09,999
• కలర్స్: సిల్క్ వైట్, టైటానియమ్ చార్కోల్
రెండు ఫోన్లూ ఒప్పో ఆన్ లైన్ స్టోర్ (Oppo Online Store), ఫ్లిప్ కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon)లతో పాటు దేశవ్యాప్త రిటైల్ స్టోర్లలో నవంబర్ 21 నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి.
Oppo Find X9: డిజైన్, కెమెరా, పనితీరు వివరాలు
ఫైండ్ ఎక్స్ 9 లో 6.59-ఇంచ్ AMOLED 1.5K డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్టును కలిగి ఉంది.
చిప్‌సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్
కెమెరా సెటప్:
• 50MP ప్రధాన కెమెరా (OIS)
• 50MP అల్ట్రావైడ్
• 50MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్)
• 32MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ:
• 7,025mAh సామర్థ్యంతో 80W వైర్డ్, 50W వైర్‌లెస్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది
సాఫ్ట్‌వేర్:
• కలర్ ఓఎస్ 16 ఆధారంగా ఆండ్రాయిడ్ 16 పై నడుస్తుంది
• 5 సంవత్సరాల OS అప్‌డేట్స్ + 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతాయి
• IP66, IP68, IP69 డస్ట్/వాటర్ రెసిస్టెన్స్
• Wi-Fi 7, NFC, Bluetooth 6.0, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి
Oppo Find X9 Pro: 200MP టెలిఫోటో కెమెరాతో ప్రీమియం అప్‌గ్రేడ్
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9ప్రో లో మరింత అప్‌గ్రేడ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి..
• 6.78-ఇంచ్ AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
• 200MP హాసెల్‌బ్లాడ్ ట్యూన్ చేసిన పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా
• 50MP ప్రధాన కెమెరా
• 50MP అల్ట్రావైడ్
• 50MP ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ:
• 7,500mAh పెద్ద బ్యాటరీ
• 80W వైర్డ్, 50W వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు ఉంది
• మెరుగైన కూలింగ్ సిస్టం, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ
ఫైండ్ ఎక్స్ 9ప్రో ను అత్యంత ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోసం అభివృద్ధి చేసినట్లు ఒప్పో చెబుతోంది.
Oppo Find X9 సిరీస్ లాంచ్ ఆఫర్లు: క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ బోనస్, EMI ఆఫర్లు
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్‌పై భారీ ప్రారంభ ఆఫర్లను ప్రకటించింది. వాటిలో..
• SBI, HDFC, Kotak, IDFC First బ్యాంక్‌ల కార్డులతో 10% ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్
• 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ
• Cashify, Servify ద్వారా 10% ఎక్స్చేంజ్ బోనస్
• Bajaj Finserv, TVS Credit తదితర సంస్థలతో జీరో డౌన్ పేమెంట్ స్కీమ్స్
• నవంబర్ 20లోపు ప్రీ-ఆర్డర్ చేస్తే ₹5,198 విలువైన బ్లాక్ గోల్డ్ గిఫ్ట్ బాక్స్
• 180 రోజుల హార్డ్‌వేర్ రీప్లేస్‌మెంట్ పాలిసీ
• 3 నెలల గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం
• పేటీఎం ట్రావెల్ ద్వారా ₹2,000 ఫ్లైట్ వోచర్
• జియో యూజర్లకు ₹2,250 విలువైన ప్రయోజనాలు, 18–25 సంవత్సరాల వారికి 18 నెలల జెమినీ ప్రో యాక్సెస్
ఈ ఆఫర్లు ప్రీమియం సెగ్మెంట్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నాయి.