14 ఏళ్ల క్రితం సైనా నెహ్వాల్ చేసిన ఫీట్, సింధు సాధించగలదా... మరో నాలుగు రోజుల్లో తైపీ ఓపెన్...
పీవీ సింధు, సైనా నెహ్వాల్... భారత బ్యాడ్మింటన్‌కి ఈ ఇద్దరూ రెండు కళ్లతో సమానం. అయితే ఇద్దరిలో ఎవరు గ్రేట్? అంటే చెప్పడం కష్టం. చాలామంది బ్యాడ్మింటన్ ఫ్యాన్స్ ఈ విషయం గురించి చాలా సార్లు చర్చించుకునే ఉంటారు. కొందరు సైనా గ్రేట్ అంటే, ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన పీవీ సింధుయే గ్రేట్ అంటారు మరికొందరు...
Image credit: Getty
సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. అయితే సైనాని తక్కువ అంచనా వేయడానికి లేదు...
Image credit: Getty
ఎందుకంటే పీవీ సింధు ప్రొఫెషనల్ టోర్నీల్లోకి అడుగుపెట్టకముందే 2010లో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచింది సైనా నెహ్వాల్... ఇప్పటిదాకా సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలవలేకపోయిన పీవీ సింధు, ఈసారి ఎలాగైనా ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తోంది...
అలాగే సింగపూర్ ఓపెన్ తర్వాత తైపీ ఓపెన్‌లో పాల్గొనబోతోంది భారత బ్యాడ్మింటన్ టీమ్. 1980 జరుగుతున్న తైపీ ఓపెన్‌ను కరోనా కారణంగా గత రెండు సీజన్లలో నిర్వహించలేదు...
తైపీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన ఏకైక భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా 2008లో రికార్డు క్రియేట్ చేసింది సైనా నెహ్వాల్. పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్లు కూడా ఎవ్వరూ ఈ టైటిల్ గెలవలేకపోయారు. పీవీ సింధు సహా మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ తైపీ ఓపెన్‌లో ఫైనల్ కూడా చేరలేకపోయారు...
యోనెక్స్ తైపీ ఓపెన్‌గా పిలవబడే తైపీ ఓపెన్ జూలై 19 నుంచి 24 వరకూ జరుగుతుంది. ప్రస్తుతం సింగపూర్ ఓపెన్ కోసం స్వీస్ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందం అక్కడి నుంచి తైవాన్ వెళ్లనుంది. సైనా కంటే పీవీ సింధు బెస్ట్ అని నిరూపించుకోవాలంటే అక్కడ కూడా సత్తా చాటాల్సి ఉంటుంది...