తైపీ ఓపెన్ 2022 టోర్నీపైనే ఆశలు పెట్టుకున్న సైనా నెహ్వాల్... 14 ఏళ్ల తర్వాత...
భారత్‌లో టెన్నిస్కి క్రేజ్ తీసుకొచ్చింది సానియా మీర్జా అయితే బ్యాడ్మింటన్‌కి క్రేజ్ తీసుకొచ్చింది సైనా నెహ్వాల్... 2012 లండన్ ఒలింపిక్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన సైనా నెహ్వాల్, తన కెరీర్లో ఇండోనేషియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్, హంగ్‌కాంగ్ ఓపెన్ వంటి ప్రతిష్టాత్మక టైటిల్స్ ఎన్నో గెలిచింది..
Saina Nehwal
2018లో తన సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ని ప్రేమించి పెళ్లాడింది సైనా నెహ్వాల్. పుల్లెల గోపిచంద్ అకాడమీ నుంచి దూరమైన తర్వాత సరైన విజయాలు అందుకోలేకపోతున్న సైనా నెహ్వాల్, సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టింది...
అయితే ఓ టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లడం కూడా గత 15 నెలల్లో సైనా నెహ్వాల్‌కి ఇదే తొలిసారి. 32 ఏళ్ల సైనా నెహ్వాల్ ఇప్పుడు ఆశలన్నీ తైపీ ఓపెన్ పైనే పెట్టుకుంది...
1980 జరుగుతున్న తైపీ ఓపెన్ టైటిల్ గెలిచిన ఏకైక భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా 2008లో రికార్డు క్రియేట్ చేసింది సైనా నెహ్వాల్. పీవీ సింధు సహా మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ తైపీ ఓపెన్‌లో ఫైనల్ కూడా చేరలేకపోయారు...
యోనెక్స్ తైపీ ఓపెన్‌గా పిలవబడే తైపీ ఓపెన్ జూలై 19 నుంచి 24 వరకూ జరుగుతుంది. ప్రస్తుతం సింగపూర్ ఓపెన్ కోసం స్వీస్ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందం అక్కడి నుంచి తైవాన్ వెళ్లనుంది. ఈ టోర్నీ ద్వారా కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశపడుతోంది సైనా...
పీవీ సింధు వరుస విజయాలతో దూసుకుపోతుంటే టోర్నీలు గెలవడంలో వెనకబడిన సైనా నెహ్వాల్.. తైపీ ఓపెన్‌లో అయినా స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇస్తుందో లేదో చూడాలి...