భార్యభర్తల మధ్య రొమాన్స్ లేకుంటే జీవితంలో వచ్చే మార్పులు.. బంధం తెగే పరిస్థితి?
భార్య భర్తలు అంటే శివపార్వతులు అంటారు పెద్దలు. సృష్టికి ప్రతి భర్త శివుని రూపమే, భార్య పార్వతి ప్రతిరూపమే. భార్య భర్తల బంధం గొప్పది మాత్రమే కాదు పవిత్రమైనది కూడా.
భార్య భర్తలు అంటే శివపార్వతులు అంటారు పెద్దలు. సృష్టికి ప్రతి భర్త శివుని రూపమే, భార్య పార్వతి ప్రతిరూపమే. భార్య భర్తల బంధం గొప్పది మాత్రమే కాదు పవిత్రమైనది కూడా. ఒకరి మాటలను మరొకరు గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ సంసారాన్ని నడిపితేనే అది అద్భుతమైన దాంపత్యం అవుతుంది.
జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అదేవిధంగా మన జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా నడపడానికి భార్యాభర్తల మధ్య కలయిక అనేది ముఖ్యం. భార్య భర్తల బంధాలను బలపరచు కోవడంలో ఇద్దరి మధ్య సలహాలు సూచనలు అదేవిధంగా వారిద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు బలంగా ఉండాలి.
మనసు విప్పి మాట్లాడుకోవడం, శారీరక విషయంలో కంగారు పడకుండా, సిగ్గు పడకుండా ఉండాలి. భార్య భర్తల బంధంలో రొమాన్స్ వారి ప్రేమను తెలియజేస్తుంది. రొమాన్స్ అంటే చాలామందికి ఇది ఓ బూతు పదంలా అనిపిస్తుంది. ఇది ప్రతి క్షణం కొత్తగా అందంగా, చెరిగిపోని జ్ఞాపకాలను మిగులుస్తుంది.
మానసికంగా, శారీరకంగా ఎదుటి వ్యక్తిని సంతోషపరచడం రొమాన్స్ ద్వారా జరుగుతుంది. రొమాన్స్ అంటే కేవలం రెండు శరీరాల కలయిక కాదు. ఇద్దరి మనుషుల మధ్య బంధాన్ని బలపరిచే అద్భుతమైన ప్రక్రియ. భార్య భర్తలు మనసు విప్పి మాట్లాడకపోవడం వంటి పొరపాట్లు చేయడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
వీరు ఒకరికొకరు పరస్పరం ప్రేమించుకోవాలి. ఇలా చేయుట వలన వారి మధ్య ప్రేమ బంధం బలపడుతుంది. చాలామంది వివాహమైన తర్వాత వ్యక్తిగత పనికి, ఆఫీసు పనికి మొదటి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలా చేస్తూ రతిక్రీడ గురించి అస్సలు ఆలోచించరు. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి సహజంగానే కోపం, చిరాకు, ఆందోళన వంటివి పెరుగుతాయి.
ఇలాంటి సమయాల్లో ఇద్దరి మధ్య అనేక విషయాల్లో విబేధాలు పెరుగుతాయి. అందుకే వివాహ జీవితంలో రతి క్రీడ రొమాన్స్ లేకుండా హ్యాపీగా ఉండలేము. రొమాన్స్ అనేది భార్యాభర్తల యొక్క పని ఒత్తిడిని తగ్గించే ఒక అద్భుతమైన ప్రక్రియ.
కొంత మంది దంపతుల మధ్య రొమాన్స్ విషయంలో విభేదాలు ఉన్నట్లయితే వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకుంటారు. కాబట్టి దాంపత్య జీవితంలో ఏకాంత సమయం అనేది కూడా ఒక ముఖ్యమైన భాగమే.