Relationship: మీ పార్ట్నర్ పై రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే కాస్త ఆలోచించండి?
Relationship: మన జీవితం భాగస్వామి మనల్ని మోసం చేశాడు అంటే ఆ బాధ భరించలేనిది. మనల్ని బాధ పెట్టిన వ్యక్తిపై కక్ష తీర్చుకోవాలి అనిపిస్తుంది. కానీ మీరు కూడా అదే తప్పు చేయకండి.. ఆగి ఆలోచించండి.
బయట వాళ్ళు మనల్ని మోసం చేస్తేనే భరించలేము అలాంటిది మన సర్వసము అనుకున్న జీవిత భాగస్వామి మనల్ని మోసం చేస్తే ఆ బాధ భరించలేనిది. ఇదే విషయంలో చాలామంది డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు.
మనల్ని బాధ పెట్టినవాళ్ళు సుఖంగా ఉండకూడదు వాళ్ళు కూడా బాధపడాలి అనుకొని ఎలాగైనా వాళ్లపై కక్ష సాధించాలి అనుకుంటారు. కానీ అలా చేయకండి ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ముందుగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి.
వాళ్ళు చేసిన తప్పు ఏంటో వాళ్ళకి తెలిసేలాగా చేయండి మెల్లగా మీ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంతేకానీ వాళ్లు చేసిన తప్పే మీరు చేస్తే ఇక అతనిని నిలదీసే హక్కుని మీరు కోల్పోతారు.
నేను తప్పు చేశాను అని నిలదీస్తున్నావు మరి నువ్వు చేసింది ఏంటి అని మీ భాగస్వామి మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్తారు? పైగా మీరు కక్ష సాధించడం వల్ల ప్రత్యేకంగా మీకు వచ్చే లాభం ఏమీ ఉండదు. అలా చేయటం వలన మీరు పడిన బాధ ఏమీ తగ్గదు కదా.
లేదు.. నేను పడిన బాధ వాళ్ళు కూడా పడాలి అన్నా ఆలోచన ఆ నిమిషానికి మనసుకి తృప్తిగా అనిపిస్తుంది కానీ జీవిత కాలం అది అవతలి వ్యక్తితో పాటు మీకు కూడా శిక్ష అని గుర్తుంచుకోండి. సమస్యని గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. పరిష్కారం అయితే పర్వాలేదు లేదు.
లేదంటే హుందాగా ఒకరి జీవితాల్లో నుంచి ఒకరు తప్పుకోండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. చివరిగా క్షమించే గుణం బంధాన్ని నిలబడుతుందని తెలుసుకోండి. ఒక్క క్షమవల్ల ఒక కాపురం బాగుంటుంది అంటే క్షమించడంలో తప్పు లేదని గ్రహించండి.