ఏఎన్నార్కేమో వీరాభిమాని, అఖిల్‌ని పట్టుకుని బండ బూతులు తిట్టిన టీచర్.. అక్కినేని హీరోకి అవమానం
హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్న అఖిల్ స్కూల్ టైమ్‌లో తెలుగు టీచర్ చేసిన పని బయటపెట్టాడు. తనని ఎలా తిట్టేదో వెల్లడించాడు.
అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాని బాగా ప్రభావితం చేసిన హీరోల్లో ఒకరు. నటుడిగా రాణించిన హీరోగా ఎదిగి, లెజెండ్‌గా నిలిచిపోయారు. ఆయన వారసత్వాన్ని నాగార్జున కొనసాగిస్తున్నారు. ఆయన ప్రస్తుతం సీనియర్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. తనదైన నటనతో, సినిమాలతో ఆయన ముప్పై ఏళ్లుగా మెప్పిస్తూనే ఉన్నారు.
అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం నుంచి నాగచైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు. నాగచైతన్య పడుతూ లేస్తూ సినిమాలు చేస్తున్నారు. ఓ రకంగా ఆయన హీరోగా నిలబడ్డాడనే చెప్పాలి. కానీ అఖిల్ ఇంకా హీరోగా నిలబడలేదు. ఆయనకు ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా మాత్రమే జస్ట్ యావరేజ్‌గా నిలిచింది.
ప్రస్తుతం అఖిల్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాటికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రావాల్సి ఉంది. ఒకటి అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్‌లో సినిమా చేస్తున్నారు. దీనికి `ధీర` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. అలాగే `వినరో భాగ్యము విష్ణు కథ` దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారట. ప్రస్తుతం ఈ మూవీస్‌తో ఆయన బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే అఖిల్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. స్కూల్లో జరిగిన సంఘటన ఒకటి బయటపెట్టారు. తెలుగు టీచర్ చేసిన పని వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, తనకు తెలుగు చదవడం, రాయడం వచ్చు అట. దానికి కారణం సరోజ అనే తెలుగు టీచర్ అని చెప్పాడు అఖిల్. అయితే స్టడీస్‌లో తాను వీక్ అట. కేవలం గేమ్స్ కోసమే స్కూల్‌కి వెళ్తా అని ఇంట్లో చెప్పాడట. అలానే వెళ్లారు. అయితే తెలుగులో ఏదైనా రాయమంటే తనకు నచ్చింది రాసేవాడట. దసరా పండుగ రోజు ఏం చేస్తావు అని ఎస్సే రాయమంటే తనకు నచ్చింది రాసేవాడట.
దీంతో ఆ పేపరు చూసి టీచర్ పిల్లలందరినీ బయటకు పంపించి తనకు ఆ విషయం చెబుతూ ఏడ్చేదట. అయితే ఆమె ఏఎన్నార్‌కి వీరాభిమాని. మీ తాతగారు అంత బాగా తెలుగు మాట్లాడతారు, నువ్వు ఎలా పుట్టావురా ఎదవ అంటూ బండ బూతులు తిట్టేదట. కొన్నాళ్లు అలా తిట్టేదట. ఆ తర్వాత మదర్ అమల నెంబర్ తీసుకుని ఆమెకి ఫోన్ చేసి ఏడ్చేదట. అఖిల్ ఇలా చేస్తున్నాడని అమ్మ ముందు ఆవేదన వ్యక్తం చేసేదట.
తన విషయంలో ఆమె బాగా ఫ్రస్టేట్ అయ్యేదని, కానీ ఇప్పుడు తాను తెలుగు మాట్లాడుతున్నా, రాస్తున్నా అంటే కారణం ఆ తెలుగు టీచరే అని, ఆమెకి థ్యాంక్స్ చెప్పాడు అఖిల్. కొన్నాళ్ల క్రితం ఆయన యాంకర్ ప్రదీప్ నిర్వహించిన `కొంచెం టచ్ లో ఉంటే చెబుతా` షోలో ఈ విషయాన్ని చెప్పాడు అఖిల్.
also read: భర్తతో సినిమాని రిజెక్ట్ చేసిన ఐశ్వర్యా రాయ్.. కారణం ఏంటో తెలిస్తే ఫ్యూజులు ఔట్