MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • జస్ట్ ఈ మార్పులు చేసుకుంటే చాలు.. సెక్స్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు..!

జస్ట్ ఈ మార్పులు చేసుకుంటే చాలు.. సెక్స్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు..!

లైంగిక కోరికలు తక్కువగా ఉండటం, తక్కువ లిబిడో వంటివి మీ లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. లైంగిక ఆసక్తి తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి సెక్స్ లైఫ్ మెరుగ్గా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

R Shivallela | Published : Sep 26 2023, 03:31 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

సెక్స్ కోరికలు, ఆసక్తులు వ్యక్తి వ్యక్తికి మారొచ్చు. కొంతమంది తమ భాగస్వామితో మంచి లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే.. మరికొంతమంది తమ భాగస్వామితో సన్నిహిత, సంబంధాన్ని మెరుగుపర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు. కొంతమంది పురుషులకు లైంగిక కోరికలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు తమ  భాగస్వామితో సెక్స్ లో పాల్గొనడానికి ఇష్టపడరు. అలసట, డిప్రెషన్,  వయసు వంటి వివిధ కారణాల వల్లయ మధ్య వయస్కుల్లోనే సెక్స్ సమస్యలు వస్తాయి. అయితే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ సెక్స్ లైఫ్ ను మెరుగుపర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..? 

25
Asianet Image

హెల్తీ డైట్

సెక్స్ లైఫ్ ను మెరుగ్గా ఉంచడానికి కొన్ని రకాల ఆహారాలు కూడా ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం కామోద్దీపన, జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా అత్తి పండ్లు, అరటిపండ్లు, చాక్లెట్లు,  వెన్న వంటివి తిన్నా మీ లైంగిక కోరికలు బాగా పెరుగుతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు మీ లిబిడోను బాగా తగ్గిస్తాయి. వేయించిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు లేదా స్వీట్లు మీ లైంగిక కోరికలను తగ్గిస్తాయి. లిబిడోను తగ్గిస్తాయి. అందుకే వీటికి బదులుగా చికెన్, గింజలు, పండ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఇవి మీ కామోద్దీపనను మెరుగుపరచడానికి, హార్మోన్ల అసమతుల్యత సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి. 
 

35
Image: Getty

Image: Getty

తగినంత నిద్ర

నిద్రకూడా మీ లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. సరిగ్గా నిద్రపోకుంటే మీకు లైంగిక ఆసక్తి తగ్గుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి కలుగుతుంది. అంతేకాదు ఈ నిద్రలేమి సమస్య చాలా కాలంగా ఉంటే ఎన్నో అనారోగ్యసమస్యలు వస్తాయి. మీ సెక్స్ లైఫ్ కూడా బాగుండదు. అందుకే నిద్రలేమి సమస్యతో చాలా కాలంగా బాధపడేవారు డాక్టర్ కు చూపించుకోవడం మంచిది. 
 

45
Asianet Image

శారీరక ఆరోగ్యం

శారీరక దృఢత్వానికి లైంగిక కార్యకలాపాలకు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్థూలకాయం, అధిక బరువు మీ సెక్స్ లైఫ్ ను నాశనం చేస్తాయి. అయినప్పటికీ చిన్న వ్యాయామం కూడా లైంగిక పనితీరుపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్ గా వ్యాయామం చేసేవారు శృంగారం లో చరుగ్గా ఉంటారని నిపుణులు అంటున్నారు. వ్యాయామం మన శరీరాన్ని ఆరోగ్యం, ఫిట్ గా ఉంచుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

55
Asianet Image

భాగస్వామితో మాట్లాడటం

ఒత్తిడికి గురికావడం, ఆరోగ్య సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వల్లే సెక్స్ పట్ల కోరికలు బాగా తగ్గుతాయి. ఒకవేళ మీకు మీ భాగస్వామికి ఈ సమస్య ఉంటే దాని గురించి వారితో మాట్లాడండి. అవసరమైతే చికిత్సలు తీసుకోండి. మీ సంబంధంపై ఆసక్తిని పెంచడానికి కొత్త మార్గాలను ప్రయత్నించండి.

R Shivallela
About the Author
R Shivallela
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories