శృంగారంపై ఆసక్తి తగ్గిందా..? కారణం ఇదే కావచ్చు..!
మున్ముందు వారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఉన్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
శృంగారం పట్ల ప్రతి మనిషికి ఆసక్తి ఉంటుంది. దానిని తనివితీరా ఆస్వాదించాలనే తపన కూడా ఉంటుంది. అది చాలా సహజం. అది చాలా అవసరం కూడా. ప్రతి మనిషికి లైంగిక అన్వేషణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా ఉండటం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుందట.
అయితే, కొంత మందికి శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి కూడా కలగడం లేదట. ఒకవేళ పాల్గొన్నా, వారికి లైంగిక తృప్తి ఉండటం లేదట. అయితే, అలా శృంగారంలో తృప్తి పొందనివారికి వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందట. మున్ముందు వారిలో మతిమరుపు వచ్చే అవకాశం ఉన్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
మధ్యవయసులో శృంగారంలో తృప్తి కలగకపోవడానికి వృద్ధాప్యంలో విషయగ్రహణ సామర్థ్యం తగ్గిపోవడానికి సంబంధం ఉందని తేలడం గమనార్హం. దాదాపు 56-68 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పురుషులను దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారట. మొదటి నుంచి వారిలో జ్నాపకశక్తి, విషయ విశ్లేషణ, సమస్యల పరిష్కార వేగాన్ని క్రమంగా పరీక్షించగా ఈ విషయం తేలడం గమనార్హం.
అంగ స్తంభన, శృంగార తృప్తి తగ్గటానికి ముందు వారికి మతిమరుపు వచ్చిన తర్వాత రెండింటి తేడాను వారు గమనించారట. లైంగిక ఆరోగ్యం మీద చేసే పరిశోధనల్లో చాలా వరకు ఎంత చురుకుగా శృంగారంలో పాల్గొంటున్నారు అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారట. కానీ, ఈ అధ్యయనంలో మాత్రం కలయిక సమయంలో వారి అభిప్రాయలను కూడా సేకరించారట.
శారీరకంగా చాలా మంది ఒకేలా ఉన్నారట, కానీ శారీరక తృప్తి విషయంలో మాత్రం వారి అభిప్రాయాలు, అనుభవాలు వేర్వేరుగా ఉన్నాయని వారు పేర్కొనడం గమనార్హం. శృంగార తృప్తి, అంగ స్తంభన సామర్థ్యం తగ్గటం మధ్యవయసులోనే మొదలౌతుందట. కాబట్టే మధ్య వయసు పురుషులనే ఎంచుకొని అధ్యయనం ఆరంభించారు. మానసికంగా వచ్చే మార్పులు కూడా శృంగారంలో తృప్తి తగ్గిపోతుందట.
శృంగారంలో తృప్తి పొందనివారిలో అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, తృప్తి పొందిన వారిలో ఆ సమస్యలు ఉండటం లేదు అని తేలడం గమనార్హం.