MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship: భార్యాభర్తల మధ్య నిజంగా ఉండాల్సింది ఇదే..!

Relationship: భార్యాభర్తల మధ్య నిజంగా ఉండాల్సింది ఇదే..!

ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒకరికొకరు ఐలవ్ యూ చెప్పుకుంటే సరిపోదు. వారి మధ్య మంచి అవగాహన, పరస్పర గౌరవం, నమ్మకం కూడా ఉండాలి. నిజమైన సంబంధం అంటే ఒకరి భావాలను అర్థం చేసుకోవడం, ప్రతి కష్ట సమయంలో మద్దతుగా ఉండటం లాంటివి చాలా అవసరం.

2 Min read
Author : ramya Sridhar
Published : May 08 2025, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వారి మధ్య ప్రేమ ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ప్రేమ ఒక్కటే సరిపోదు. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒకరికొకరు ఐలవ్ యూ చెప్పుకుంటే సరిపోదు. వారి మధ్య మంచి అవగాహన, పరస్పర గౌరవం, నమ్మకం కూడా ఉండాలి. నిజమైన సంబంధం అంటే ఒకరి భావాలను అర్థం చేసుకోవడం, ప్రతి కష్ట సమయంలో మద్దతుగా ఉండటం లాంటివి చాలా అవసరం. మరి, ఇంకా దంపతుల మధ్య ఉండాల్సినవి ఏంటో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

1. ఆకర్షణ (Attraction)
ఇది సంబంధానికి బలమైన మొదటి మెట్టు. ఇది కేవలం శారీరకంగా కాకుండా, మానసికంగా, భావోద్వేగంగా, సామాజికంగా కూడా ఉండాలి. ఒకరిని ఒకరు ఆకర్షించుకోవడం వల్లే, వారి మధ్య స్నేహం, అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఇది బంధాన్ని మరింత గాఢం చేస్తుంది.

36

2. నమ్మకం (Trust)
ఎంతటి ప్రేమ ఉన్నా, నమ్మకం లేకుంటే బంధం నిలబడదు. మీరు చెప్పిన మాట నెరవేర్చడం, అవసరమైన సమయంలో మద్దతుగా ఉండటం—ఇవే నమ్మకానికి పునాది. ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం ఉంటే, సమస్యలపై కలిసి ఎదుర్కోవచ్చు.
 

46

3. గౌరవం (Respect)
బంధంలో నిజమైన విలువ గౌరవంతోనే ఉంటుంది. భాగస్వామిని వారు ఉన్నట్టు అంగీకరించాలి. వారి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, పరిమితులను గౌరవించాలి. గౌరవంతో కూడిన బంధం ఎప్పటికీ నిలుస్తుంది.
 

56

4. సానుభూతి (Empathy)
బంధాన్ని బలోపేతం చేసే భావోద్వేగ పరమైన మూల్యం ఇది. భాగస్వామి బాధలో ఉన్నప్పుడు, వారి పక్షాన నిలబడే గుణమే సానుభూతి. కేవలం తమ అవసరాలకే కాకుండా, వారి భావోద్వేగాలకు స్పందించడం కూడా ముఖ్యమే.

5. ప్రేమపూర్వక ప్రవర్తన (Affection)
ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం,  ఒక మాట, ఓ హగ్, ఓ చిన్న సహాయం ఇవి బంధాన్ని మరింత బలంగా మార్చతాయి. ప్రేమ అనేది కేవలం చెప్పడం కాదు, తగిన చర్యలతో నిరూపించడమే అసలైన ప్రేమ.
 

66

6. అవగాహన (Understanding)
ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడమే మంచి బంధానికి మెరుగైన బలమైన మూలం. ఒక్కో సందర్భంలో వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోవడం, నొప్పిని గమనించడం, మౌనంగా ఉన్నప్పుడు కూడా వారి భావాలను గుర్తించడం.ఇవన్నీ బంధానికి అద్భుతమైన బలాన్ని ఇస్తాయి.

ఈ ఆరు లక్షణాలు ఏ బంధాన్ని అయినా బలపరుస్తాయి.ఇవి ఉంటే సంబంధం ఎంత కాలమైనా బలంగా, ప్రేమగా సాగుతుంది. మీరు కూడా ఈ లక్షణాలను పాటించి మీ బంధాన్ని మరింత గొప్పదిగా మార్చుకోండి!


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భార్య ఏడాదిగా పుట్టింట్లో ఉంటే.. భ‌ర్త విడాకులు తీసుకోవ‌చ్చా? చ‌ట్టం ఏం చెబుతోంది
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఉదయాన్నే ఇవి చేస్తే చాలా మంచిది!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అమ్మాయి.. అత్తారింటిని బాగా తీర్చిదిద్దుతుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved