- Home
- Life
- Relationship
- Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అమ్మాయి.. అత్తారింటిని బాగా తీర్చిదిద్దుతుంది!
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అమ్మాయి.. అత్తారింటిని బాగా తీర్చిదిద్దుతుంది!
ఇంట్లో ఆడవాళ్లు ఏడిస్తే ఆ ఇంటికి అస్సలు మంచిది కాదని చెబుతుంటారు పెద్దలు. సహజంగా చాలా సెన్సిటివ్ గా ఉండే వారు ఎక్కువగా ఏడుస్తుంటారు. చిన్న విషయాలకు కూడా బాధ పడుతుంటారు. వారి బాధను ఏడుపు ద్వారా తీసేస్తే ఉంటారు. ఏడుపు చికాకు తెప్పిచ్చినప్పటికీ అలాంటి ఆడవాళ్లు కుటుంబంలో పెద్ద మార్పు తీసుకువస్తారని చెబుతున్నాడు చాణక్యుడు. అదెంటీ అనుకుంటున్నారా? ఓసారి తెలుసుకుందాం పదండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సాధారణంగా చాలామంది స్త్రీలు చాలా సాఫ్ట్ గా ఉంటారు. వారు ప్రతిదానికి భావోద్వేగానికి లోనవుతారు. చాలాసార్లు ఈ అలవాటు చుట్టుపక్కల వారిని చికాకుపెడుతుంది. కానీ స్త్రీలు ఏడవడం ఇంటికి శుభప్రదమే అని చాణక్య నీతి చెబుతోంది!
చాణక్యుడి ప్రకారం..
చాణక్య నీతి ప్రకారం ప్రతి విషయానికీ ఏడ్చే స్త్రీలు తమ భర్త, కుటుంబానికి దూరంగా ఉండాలనుకోరట. అంతేకాదు అలాంటి స్త్రీలు ఎప్పుడూ కుటుంబాన్ని కలిసి ఉంచాలని కోరుకుంటారట.
అలాంటి స్తీలలో..
ఆచార్య చాణక్యుని ప్రకారం ఏడ్చే స్త్రీలలో కోపం, ఒత్తిడి ఉండవు. ఇవన్నీ కన్నీటి ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి వారు ఎవరితో కోపం పెంచుకోరు. ఇతరులకు హాని చేయాలని చూడరు.
క్షమించే గుణం
అప్పుడప్పుడూ ఏడ్చే స్త్రీలు చాలా మృదువైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఆమె త్వరగా అందరి తప్పులను మరచిపోయి క్షమిస్తుంది. అలాంటి స్త్రీలు తమ మనస్సులో ఎక్కువ కాలం ఏమీ దాచుకోరు.
కుటుంబంపై ప్రేమ
ఏ తప్పు లేకుండా ఏడవడం ప్రారంభించే స్త్రీలు తమ కుటుంబం పట్ల అచంచలమైన ప్రేమను కలిగి ఉంటారట. వారు తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారని చాణక్యుడి నీతి చెబుతోంది.
అందరిని అర్థం చేసుకుంటారు!
చాణక్య నీతి ప్రకారం ప్రతి విషయంలోనూ ఏడ్చే స్త్రీలు ఎప్పుడూ ఇతరుల భావాలను పట్టించుకుంటారు. వారి స్వభావంలోని ఈ ప్రత్యేకత వారి కుటుంబాన్ని వారికి అభిమానిగా చేస్తుంది.