Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship
  • సెక్స్ తర్వాత ఆడవారి శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సలు లైట్ తీసుకోకండి

సెక్స్ తర్వాత ఆడవారి శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సలు లైట్ తీసుకోకండి

సంభోగం తర్వాత ఆడవారి శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో కొందరు ఆడవారు కంప్లీట్ గా నార్మల్ గా ఉంటారు. ఇలాంటి వారికి ఎలాంటి సమస్యలు రావు. కానీ.. 

R Shivallela | Published : Sep 24 2023, 10:41 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Image: Getty

Image: Getty

శృంగారం తర్వాత మహిళల్లో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే సంభోగం తర్వాత ప్రతి మహిళలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కాగా ఈ సమయంలో కొందరు మహిళలు పూర్తిగా నార్మల్ గా ఉంటారని,  వారికి ఎలాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమందికి ఇలా ఉండదు. అసలు శృంగారం తర్వాత మహిళల్లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి. వేటిని లైట్ తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25
Asianet Image

మంట 

సెక్స్ తర్వాత కొంతమంది ఆడవారికి యోనిలో మంట కలుగుతుంది. ఇది సర్వ సాధారణం. సెక్స్ సమయంలో ఎక్కువ ఘర్షణ లేదా యోని కణజాలం పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. సాధారణంగా సంభోగం తర్వాత కొంత సమయం తర్వాత ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొన్ని గంటలు లేదా రోజంతా మంట అలాగే ఉండి, ఇతర సమస్య లేదా సంక్రమణగా కొంతమందికి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వారు హాస్పటల్ కు ఖచ్చితంగా వెళ్లాలి. 


ఈ సమస్య రావొద్దంటే: సెక్స్ సమయంలో ల్యూబ్ ను ఖచ్చితంగా ఉపయోగించండి. అయితే నేచురల్ ల్యూబ్ మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
 

35
Asianet Image

రక్తపు మరకలు 

సెక్స్ తర్వాత కొంతమందికి రక్తపు మరకలు కనిపిస్తాయి. గర్భాశయంలో వాపు ఉన్నప్పుడు, సెక్స్ సమయంలో కుదించినప్పుడు రక్తపు మచ్చలు ఏర్పడతాయి. అలాగే  కఠినమైన సెక్స్ లేదా లైంగిక భాగస్వాములను మార్చడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇది తీవ్రమైన సమస్య కానప్పటికీ.. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.  

ఈ పరిస్థితిలో ఏం చేయాలంటే: ఇలాంటి పరిస్థితిలో మీరు సెక్స్ తర్వాత యోని ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. సెక్స్ తర్వాత మళ్లీ లేదా రక్తం మచ్చలు కనిపిస్తే మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించండి.
 

45
sex life

sex life

యోనిలో దురద 

అయితే చాలా మంది కండోమ్ లను, ల్యూబ్స్ లను ఉపయోగిస్తుంటారు, కానీ ఇవి యోనిని చాలా సున్నితంగా చేస్తాయి. అలాగే దురద, చికాకు వంటి సమస్యలను కూడా కలిగిస్తాయి. అసురక్షితమై శృంగారం, పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల కూడా యోనిలో దురద పెడుతుంది. 

పోస్ట్ సెక్స్ సొల్యూషన్: ఈ సమస్య మీకు ఎప్పుడూ వస్తుంటే.. ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లండి. మీకు అలెర్జీ ఉందో లేదో తెలుసుకోండి. అలాగే ఈ సమస్య మీకు అప్పుడప్పుడు వస్తుంటే.. సెక్స్ కు ముందు సరైన పరిశుభ్రత మీరు, మీ భాగస్వామి పాటించండి. అలాగే అసురక్షితమైన సెక్స్ లో పాల్గొనకూడదు. 
 

55
Image: Getty Images

Image: Getty Images

కండరాల నొప్పి

శృంగారాన్ని వ్యాయామంతో కూడా పోలుస్తారు. దీనికి కూడా శారీరక కార్యకలాపమే అంటారు. అందుకే సెక్స్ తర్వాత మీ శరీరంలోని ఎన్నో భాగాల్లో.. ముఖ్యంగా చేతులు, పాదాలు, నడుము, తొడ మొదలైన వాటిలో నొప్పి పుడుతుంది. కొన్ని భంగిమల్లో శృంగారంలో పాల్గొంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇది సమస్య కానప్పటికీ.. జాగ్రత్తగా ఉండటం మంచిది. 

ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి: సెక్స్ తర్వాత కండరాల ఒత్తిడి, నొప్పి రావడం చాలా సహజం. ఇలాంటి పరిస్థితిలో మీరు సెక్స్ కు ముందు కొన్ని నీళ్లను తాగండి. అలాగే సెక్స్ తర్వాత కూడా తగినంత నీటిని తాగండి. దీంతో మీ శరీరం పూర్తిగా హైడ్రేట్ గా ఉంటుంది. కండరాల ఒత్తిడి, నొప్పి కూడా తక్కువగా ఉంటాయి.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే అబ్బాయిలకు కోపిష్టి భార్యలు వస్తారు!
Name Astrology: ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే అబ్బాయిలకు కోపిష్టి భార్యలు వస్తారు!
Relationship: విడాకులు తీసుకుంటే జీవితం ఆగిపోతుందా?
Relationship: విడాకులు తీసుకుంటే జీవితం ఆగిపోతుందా?
Chanakya Niti: భర్త పొరపాటున కూడా భార్యతో ఈ 4 విషయాలు చెప్పకూడదు!
Chanakya Niti: భర్త పొరపాటున కూడా భార్యతో ఈ 4 విషయాలు చెప్పకూడదు!
Top Stories
Telugu news live updates: Reliance Jio సూపర్ ఆఫర్ - ఈ ప్లాన్ రీచార్జ్ తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు
Telugu news live updates: Reliance Jio సూపర్ ఆఫర్ - ఈ ప్లాన్ రీచార్జ్ తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు
Telangana weather: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరికలు
Telangana weather: తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరికలు
Andhra Pradesh ప్రజలకు బిగ్‌ అలర్ట్‌...సచివాలయాల్లో నిలిచిన సేవలు..ఎన్నిరోజులంటే..!
Andhra Pradesh ప్రజలకు బిగ్‌ అలర్ట్‌...సచివాలయాల్లో నిలిచిన సేవలు..ఎన్నిరోజులంటే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Fact Check
  • Life Style
  • Sports
  • Entertainment
  • International News
  • District News
  • Visakhapatnam News
  • Guntur News
  • Vijayawada News
  • Hyderabad News
  • Nellore News
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved