MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Illicit Affair : భార్య వివాహేతర సంబంధం .. పిల్లల DNA టెస్ట్ ద్వారా భర్త నిరూపించవచ్చా..? ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెబుతోంది..?

Illicit Affair : భార్య వివాహేతర సంబంధం .. పిల్లల DNA టెస్ట్ ద్వారా భర్త నిరూపించవచ్చా..? ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెబుతోంది..?

భార్య వివాహేతర సంబంధం కలిగివుంటే ఆ భర్త విడాకులు కోరవచ్చు. కానీ దీన్ని  నిరూపించేందుకు పిల్లల DNA Test కోరవచ్చా..? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెబుతోంది..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 01 2026, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వివాహేతర సంబంధాలు నిరూపించేందుకు పిల్లల డిఎన్ఏ టెస్ట్..?
Image Credit : Asianet News

వివాహేతర సంబంధాలు నిరూపించేందుకు పిల్లల డిఎన్ఏ టెస్ట్..?

Illicit Affair : ఈ కలికాలంలో మానవ బంధాలకు విలువే లేకుండా పోయింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం బాగా తగ్గిపోయింది... చివరకు ఒకరిని ఒకరు మోసం చేసుకునే స్థాయికి చేరింది. కొందరు భార్యలు భర్తకు తెలియకుండా... కొందరు భర్తలు భార్యకు తెలియకుండా ఇతరకులతో శారీరక సంబంధాలు కొనసాగిస్తున్నారు... ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఈ వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి... చివరకు విడాకులు తీసుకునేలా చేస్తున్నాయి.

అయితే భార్యపై అనుమానంతో భర్త విడాకులు కోరవచ్చా..? భార్య వివాహేతర సంబంధాన్ని కలిగివుందని నిరూపించేందుకు పిల్లల డిఎన్ఏ టెస్ట్ కోరవచ్చా..? ఇలాంటి సమయంలో కోర్టు ఎలా వ్యవహరిస్తుంది.. న్యాయశాస్త్రం ఏం చెబుతోంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

24
తండ్రి పిల్లల డిఎన్ఏ టెస్ట్ కోరవచ్చా..?
Image Credit : Google Gemini AI

తండ్రి పిల్లల డిఎన్ఏ టెస్ట్ కోరవచ్చా..?

భార్యాభర్తల గొడవలోకి పిల్లలను లాగడం మంచిది కాదు.. ఇదే విషయాన్ని న్యాయశాస్త్రం కూడా చెబుతోంది. భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు భర్త DNA టెస్ట్ కోరలేడని ఇప్పటికే పలు కేసుల్లో కోర్టులు తేల్చాయి. పిల్లలు తనకు పుట్టలేరంటూ... తన భార్య ఇతరులతో పిల్లలను కందని వాదించినా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోదు. పిల్లలను వాడకుండా ఇతర మార్గాల్లో భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపిస్తే విడాకులు మంజూరు చేసే అవకాశాలుంటాయి.

Related Articles

Related image1
Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!
Related image2
Relationship: సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి.? Gen Z జ‌మానాలో కొత్త ప్రేమ క‌థ‌లు
34
ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చేబుతోంది..?
Image Credit : Getty

ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చేబుతోంది..?

కోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవిడెన్స్ తప్పనిసరి... అయితే దీని ప్రకారం విడాకుల కేసులో పిల్లలను ఆధారంగా వాడలేమని ఇది చెబుతోంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాలను నిరూపించేందుకు పిల్లలను ఎవిడెన్స్ టూల్ గా ఉపయోగించలేమని చెబుతోంది. ఇది పిల్లల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుంది.. కాబట్టి స్వయంగా తండ్రి DNA టెస్ట్ కోరినా కోర్టు అనుమతించదు. చిన్నపిల్లల గౌరవం, ప్రైవసీకి భంగం కలిగించే ఏ చర్యలనైనా కోర్టు వ్యతిరేకిస్తుంది.

44
పిల్లల డిఎన్ఏ టెస్ట్ కోరితే ఏం జరుగుతుంది..?
Image Credit : Asianet News

పిల్లల డిఎన్ఏ టెస్ట్ కోరితే ఏం జరుగుతుంది..?

ఇటీవల ఓ వ్యక్తి తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది... కాబట్టి విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరాడు. ఈ క్రమంలోనే అతడు పిల్లలు కూడా తనకు పుట్టలేదని కోర్టుకు తెలియజేశాడు... DNA టెస్ట్ చేయాలని పిటిషన్ దాఖలుచేశాడు. కానీ ఎవిడెన్స్ యాక్ట్ దీన్ని అనుమతించదని కోర్టు స్పష్టం చేసింది. దీన్ని కోరిన సదరు పిటిషనర్ కి రూ.3000 జరిమానా విధించింది. DNA టెస్ట్ ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో అక్రమ సంబంధాన్ని నిరూపించాలి... అంతేగానీ పిల్లలను ఉపయోగించరాదని కోర్టు సూచించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!
Recommended image2
పెళ్లి వద్దు, రొమాన్స్ ముద్దు.. అమ్మాయిల సుఖంకోసమే అక్కడ బాయ్స్ స్ట్రీట్స్
Recommended image3
Relationship: సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి.? Gen Z జ‌మానాలో కొత్త ప్రేమ క‌థ‌లు
Related Stories
Recommended image1
Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!
Recommended image2
Relationship: సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి.? Gen Z జ‌మానాలో కొత్త ప్రేమ క‌థ‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved