MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Relationship
  • Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!

Illicit Relationship : ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలిచ్చి.. 10 ఏళ్లు చిన్నోడితో తల్లి జంప్..!

సభ్యసమాజం తలదించుకునే ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. ఐదుగురు పిల్లల తల్లి తనకంటే చిన్నవాడిని ప్రేమించింది… భర్త కళ్లుగప్పి, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడి ప్రియుడితో లేచిపోయింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 31 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈమె అసలు తల్లేనా..!
Image Credit : Gemini AI

ఈమె అసలు తల్లేనా..!

ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువన్నదే లేదు… ఇందుకు నిదర్శనమే ఈ ఘటన. ఓ మహిళ అమ్మతనాన్ని మరిచి అమానుషంగా ప్రవర్తించింది. కట్టుకున్నవాడిని వదిలించుకుని ప్రియుడితో లేచిపోయేందుకు కన్న బిడ్డల ప్రాణాలతో చెలగాటం ఆడింది. తన ఐదుగురు పిల్లల తిండిలో నిద్రమాత్రలు కలిపి తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో పారిపోయింది. భర్త ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే ఆ జంటను పట్టుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలేం జరిగింది..?
Image Credit : Gemini AI

అసలేం జరిగింది..?

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగింది. ఈ మహిళ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆమె పోలీసులకు ఇస్తున్న వాంగ్మూలం వీడియో వైరల్ అవుతోంది. 33 ఏళ్ల మిథిలేశ అనే ఐదుగురు పిల్లల తల్లి, 22 ఏళ్ల సురేంద్ర అలియాస్ ఖన్నాతో ప్రేమలో పడింది. భర్త, పిల్లలను కాాదని అతడితో జీవించేందుకు సిద్దమయ్యింది.

Related Articles

Related image1
Relationship Psychology: కొందరు అమ్మాయిలు పెళ్లైన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు?సైకాలజీ ఏం చెబుతోంది?
Related image2
Relationship: సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి.? Gen Z జ‌మానాలో కొత్త ప్రేమ క‌థ‌లు
35
పిల్లల ప్రాణాలతో చెలగాటం..
Image Credit : Getty

పిల్లల ప్రాణాలతో చెలగాటం..

సురేంద్రతో వెళ్లే ముందు మిథిలేశ తన ఐదుగురు పిల్లలకు నిద్రమాత్రలు ఇచ్చింది. పిల్లలు పూర్తిగా స్పృహ కోల్పోగానే, ఇంట్లో ఉన్న డబ్బు, నగలు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని పారిపోయింది. పిల్లలు ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండగానే తలుపుకు తాళం వేసి వెళ్లిపోయింది.

45
మహిళను పట్టుకున్న పోలీసులు...
Image Credit : Meta Ai

మహిళను పట్టుకున్న పోలీసులు...

మిథిలేశ భర్త రూప్ కిశోర్ ఢిల్లీలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలియగానే గ్రామానికి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని 24 గంటల్లోనే మిథిలేశ, ఆమె ప్రియుడు సురేంద్రను పట్టుకున్నారు. నిద్రమాత్రల కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.  

55
 నెటిజన్స్ సీరియస్...
Image Credit : CHATGPT.COM

నెటిజన్స్ సీరియస్...

రాంపూర్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని మహిళ వాంగ్మూలం ఇస్తున్న వీడియో వేగంగా వైరల్ అయింది. 'ఐదుగురు పిల్లలున్నా మరో వ్యక్తితో ప్రేమ ఏంటి? ఒకవేళ పిల్లలకు ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటి? దేవుడు గొప్పవాడు, పిల్లలకు ఏమీ కాలేదు' అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భర్త తోడుగా లేకపోవడం వల్లే ఆమె ఇలా చేసి ఉండొచ్చని, లేదా వారి వైవాహిక జీవితం సరిగా లేకపోవడం కూడా కారణం కావొచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
బంధుత్వం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Relationship Psychology: కొందరు అమ్మాయిలు పెళ్లైన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు?సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Relationship: సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి.? Gen Z జ‌మానాలో కొత్త ప్రేమ క‌థ‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved