Relationship: లివిన్ రిలేషన్ షిప్ లో ఇన్ని లాభాలా.. అవునంటున్న రిలేషన్ ఎక్స్పర్ట్స్?
Relationship: ఒకప్పుడు పెళ్లి కాకుండా ఇద్దరూ ఆడ మగ వ్యక్తులు కలిసి ఉంటే అది సమాజ విరుద్ధమైన సంఘటనగా అందరూ చూసేవారు. కానీ అదే నేడు లివ్ ఇన్ రిలేషన్ పేరుతో వచ్చింది. అలా ఉండటం కూడా మంచిదే అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్ అదేంటో చూద్దాం.
పూర్వం రోజుల్లో ఒకసారి పెళ్లయిందంటే కష్టమైనా సుఖమైన ఆ దంపతులు కలిసే ఉండేవారు. కానీ నేడు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ చిన్న చిన్న గొడవలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న జంటలు చాలా ఉన్నాయి. వాటికి పరిష్కారం లీవ్ ఇన్ రిలేషన్షిప్ లు అంటున్నారు నిపుణులు.
ఇలా ఉండటం వలన వాళ్ళిద్దరికీ పెళ్లి అయిన తర్వాత ఆ బంధాన్ని నిలుపుకోగలరా లేదా అని తెలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత ఒకరితో ఒకరు జీవించలేక విడిపోవడం కంటే వారితో జీవితం ఎలా ఉంటుందో ముందే తెలుసుకొని..
దాని తర్వాత వివాహ బంధంతో ఒకటి కావడం మంచి చర్య అంటున్నారు నిపుణులు. మీ సంబంధం వివాహానికి సిద్ధంగా ఉందో లేదో అంచనా వేయటంలో ప్రత్యక్ష సంబంధం మీకు సహాయపడుతుంది. మీరు కలిసి జీవించినప్పుడు ఎక్కువ సమయం వాళ్ళతో గడపవచ్చు.
ఎక్కువ సమయం గడపడం అంటే బలమైన బంధం ఏర్పడటానికి మొదటి మెట్టు. లీవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఒకరిని ఒకరు బాగా తెలుసుకోవడానికి మరియు ఎలాంటి అదనపు అంచనాలు లేకుండా పెళ్లి చేసుకోవటమా..
లేదా విడిపోవడం అనే సమాచారం తెలుసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. పైగా పెళ్లి అయిన తర్వాత అవతల వారి అలవాట్లు మరియు ప్రవర్తనలన్నింటినీ మనం మేనేజ్ చేయగలమో లేదో తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
అలాగే పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. అలాగే మీరు భార్యాభర్తలు గా బాధ్యతలు స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నారో లేదో కూడా తెలుస్తుంది.