సెక్స్ సమయంలో కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిదా? చెడ్డదా?
సంభోగానికి కొబ్బరి నూనెను లూబ్రికెంట్ ఉపయోగించే వారు కూడా ఉన్నారు. మరి దీన్ని లైంగిక కార్యకలాపాల సమయంలో ఉపయోగించడం మంచిదా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
sex life
లైంగిక కార్యకలాపాల సమయంలో.. ముఖ్యంగా సంభోగం సమయంలో లూబ్రికేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం మార్కెట్లో చాలా లూబ్రికేట్ లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ.. చాలా మంది సహజ లూబ్రికేట్ లను మాత్రమే ఉపయోగిస్తారు. వీటిలో కొబ్బరి నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ సంభోగానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం సురక్షితమేనా? కాదా? అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Image: Getty Images
కందెన ఎందుకు ముఖ్యం
లైంగిక కార్యకలాపాల సమయంలో.. ముఖ్యంగా సంభోగానికి లూబ్రికేషన్ చాలా ముఖ్యమైనది. చాలా మంది లూబ్రికెంట్ లేకుండా సంభోగంలో పాల్గొంటుంటారు. దీని వల్ల పురుషులు, మహిళలు ఇద్దరూ నొప్పిని అనుభవించొచ్చు. దీనితో పాటుగా ఇది యోని కోతలకు కారణమవుతుంది కూడా. అలాగే సెక్స్ సమయంలో అధిక ఘర్షణ కారణంగా ఇతర సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి లూబ్రికెంట్ ను ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. ఇది మీ లైంగిక ఆనందాన్ని కూడా పెంచుతుంది.
Marrige sex
కొబ్బరి నూనె లూబ్రికెంట్ గా ఉపయోగించడం సురక్షితమేనా?
కొబ్బరి నూనెను లైంగిక లూబ్రికెంట్ గా ఉపయోగించొచ్చు. అలాగే యోని పొడిబారే సమస్యతో మీరు బాధపడుతుంటే.. కొబ్బరి నూనెను ఖచ్చితంగా ఉపయోగించండి. దీనిలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు యోని పొడిని తగ్గిస్తాయి. అలాగే తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. కొబ్బరి నూనె సంభోగాన్ని సున్నితంగా చేస్తుంది. అలాగే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా మీరు మెనోపాజ్ పీరియడ్ లో ఉంటే.. కొబ్బరి నూనె మీ లైంగిక సెషన్లను మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది. మార్కెట్లో లభించే లూబ్రికెంట్స్ లల్లో ఎన్నోకెమికల్స్ ను కలుపుతారు. ఇది అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. అందుకే కొబ్బరి నూనె వంటి సహజ ప్రత్యామ్నాయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.
కొబ్బరి నూనెలో ఉండే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు మీ సన్నిహిత ప్రాంతానికి రక్షణ కల్పిస్తాయి. దీన్ని ఉపయోగించడం వల్ల లైంగిక కార్యకలాపాల సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదు. దీన్ని ఉపయోగించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అలాగే కొబ్బరి నూనెను లూబ్రికెంట్ గా ఉపయోగించడం సురక్షితం కాదని కొందరు నిపుణులు అంటున్నారు.
కొబ్బరినూనెను కందెనగా వాడితే ఈ విషయాలను గుర్తుంచుకోండి
కొంతమందికి సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది
కొబ్బరి నూనెలో పీహెచ్ విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది యోని సహజ పీహెచ్ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. పీహెచ్ అసమతుల్యత ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఇతర రకాల యోని ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనెను ఉపయోగించకూడదు.
మరకలు
ఇతర రకాల ఆయిల్ ఆధారిత లూబ్రికెంట్ లా మాదిరిగానె కొబ్బరి నూనె మీ మంచంపై మరకలను కలిగిస్తుంది. అందుకే మీరు దీన్ని ఉపయోగిస్తుంటే మీ బెడ్ షీట్ కింద మరేదైనా ఉంచండి.