- Home
- Life
- Pregnancy & Parenting
- Memory Power : మీ పిల్లలు ఎంత చదివినా మరిచిపోతున్నారా? మెమరీ పవర్ కోసం ఇలా చేయండి!
Memory Power : మీ పిల్లలు ఎంత చదివినా మరిచిపోతున్నారా? మెమరీ పవర్ కోసం ఇలా చేయండి!
Memory Power Increase Tips: కొంతమంది పిల్లలు ఇంట్లో ఎప్పుడూ చదువుతూనే ఉంటారు. కానీ, పరీక్షలు వచ్చేసరికి మొత్తం మరిచిపోతారు. దీనికి కారణం జ్ఞాపకశక్తి లోపమే. పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

మెమరీ పవర్ ను పెంచే టిప్స్
నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే పిల్లలు చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండాలి. చదువుపై దృష్టి పెట్టాలి. పిల్లల జ్ఞాపకశక్తి బాగుంటే అన్ని విషయాల్లో ముందుంటారు. అందుకే పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి కొన్ని అలవాట్లు పాటించాలి. దీనివల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ అలవాట్లు వారి జీవితాన్ని మారుస్తాయి. అలాంటి అలవాట్ల గురించి వివరంగా చూద్దాం.
సరైన నిద్ర
పిల్లల మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే తగినంత విశ్రాంతి అత్యవసరం. పిల్లలకు రోజుకు కనీసం 8 నుండి 10 గంటలు గాఢనిద్ర అవసరం. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల, పగటిపూట నేర్చుకున్న విషయాలు మెదడులో నిక్షిప్తం అవుతాయి. నిద్ర దృష్టి శక్తిని పెంచుతుంది,
కానీ నిద్రలేమి వల్ల పెద్దవారిలాగే పిల్లలలోనూ మానసిక అలసట, గుర్తుపట్టే సామర్థ్యం లోపించటం, దృష్టి మందగించటం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించి, సరైన సమయానికి పడుకునే అలవాటు చేయండి.
హెల్తీ బ్రేక్‌ఫాస్ట్
పిల్లలు ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యం. ఇది మెదడుకు అవసరమైన పోషకాలు, శక్తిని అందిస్తుంది. ఉదయం హడావిడిలో చాలా మంది పిల్లలు అల్పాహారం తీసుకోకుండానే పాఠశాలకు వెళ్తారు. కానీ ఇది శరీరానికీ, మనస్సుకీ హానికరం.
పిల్లలకు ఉదయం అల్పాహారంగా ధాన్యాలు, పండ్లు, పాలు వంటి పోషకమైన ఆహారం ఇవ్వాలి. దీంతో వారు క్లాస్‌రూమ్‌లో చురుగ్గా, దృష్టితో, ఉత్సాహంగా ఉంటారు. అల్పాహారం లేకపోతే దృష్టి తగ్గిపోవడం, అలసట, పాఠాలు పట్టకుండా పోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి ఉదయం పోషకమైన అల్పాహారం ఇవ్వండి.
చదివే అలవాటు
మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌ల వినియోగం తగ్గించి, పిల్లల చేతికి కథల పుస్తకాలు, వార్తాపత్రికలు ఇవ్వండి. రోజుకు కనీసం 20 నిమిషాలు చదివే అలవాటు చేస్తే.. వారి వాక్యనిర్మాణం మెరుగుపడుతుంది. ఊహాశక్తి పెరుగుతుంది, పాఠాలు సులభంగా అర్థం చేసుకుంటారు. పుస్తకం చదవడం ఇష్టం లేకపోతే, మీరే కథలు చెప్పండి. కథలు ఊహల రూపంలో పిల్లల కళ్ల ముందు ఆవిష్కృతం కావడంతో వారి జ్ఞాపకశక్తి గణనీయంగా మెరుగవుతుంది.
ఆటలతో నేర్పించండి
పిల్లల జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఆటల కంటే మంచి మార్గం లేదు. ఉదాహరణకు మెమరీ కార్డ్ గేమ్స్, పజిల్స్ వంటి ఆటలు పిల్లల్లో ఆలోచనా శక్తి , గుర్తు పట్టే సామర్థ్యం పెంచుతాయి. అలాగే, పాటల ద్వారా నేర్పించడం, వాటిలోని పదాలు, విషయాలు గుర్తుంచుకోవడం ద్వారా కూడా మాట్లాడే తత్వం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.