ఆరోగ్యకరమైన కొవ్వులే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు. జ్ఞాపకశక్తిని పెంచడానికి, మెదడు ఆరోగ్యానికి మెరుగుపరచడానికి సహాయపడుతాయి.
సాల్మన్ వంటి చేపలు, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, గుడ్లు, సోయాబీన్స్ మొదలైన వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
విటమిన్ బి5, బి6, బి9 (ఫోలేట్), బి12 వంటి బి విటమిన్లు మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
అరటి, బంగాళాదుంప, పాలకూర, పప్పులు, నారింజ, గుడ్లు, పాల ఉత్పత్తులు మొదలైనవి ఆహారంలో చేర్చుకోవాలి.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా విటమిన్ సి, ఇ ఉన్న ఆహరం తీసుకోవాలి.
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, డార్క్ చాక్లెట్, నారింజ, ద్రాక్ష, గింజలు, విత్తనాలు మొదలైనవి ఆహారంలో చేర్చుకోవాలి.
మెగ్నీషియం ఉన్న ఆహారం తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది. గుమ్మడికాయ గింజలు, పాలకూర, బాదం, డార్క్ చాక్లెట్, అవకాడో, అరటి, జీడిపప్పు మొదలైన వాటిలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.