ఆపిల్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది.
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో వీటిని తినడం చాలా మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఆరెంజ్ తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి అధిక మోతాదులో ఉంటాయి.
మామిడి పండులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే వీటిని మితంగా తినాలి.
అవకాడోలో విటమిన్ సి, బి, కె పుష్కలంగా ఉంటాయి. ఇది వికారాన్ని తగ్గిస్తుంది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి.
గర్భధారణ సమయంలో వచ్చే వికారం, వాంతులు తగ్గించడానికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్ కూడా ఉంటాయి.
మీరు జాంబీ పేరెంటా? మీ పిల్లల భవిష్యత్తు ఏమౌతుందో తెలుసా?
రెండు అక్షరాలతో అందమైన పేర్లు.. అర్థాలతో సహా ఇవిగో
మీ చిన్నారుల కోసం అందమైన, అర్థవంతమైన పేర్లు.. ఇవిగో!
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!