MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • స్కూల్ బ్యాగ్ కాదు... బియ్యం బస్తా! పిల్లలపై అధిక భారం పెడుతున్నామా..?

స్కూల్ బ్యాగ్ కాదు... బియ్యం బస్తా! పిల్లలపై అధిక భారం పెడుతున్నామా..?

పిల్లలు చిన్న వయసులోనే అధిక బరువున్న పుస్తకాల సంచులు మోయడం అనేది వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అసలు స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలన్న విషయాన్ని తెలుసుకోండి.

2 Min read
Author : Bhavana Thota
| Updated : Jul 15 2025, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పుస్తకాల సంచులు  బియ్యం బస్తాలు
Image Credit : Asianet News

పుస్తకాల సంచులు -బియ్యం బస్తాలు

ప్రస్తుత రోజుల్లో బడి పిల్లలు స్కూల్‌ కి పుస్తకాల సంచులు మోసుకెళ్తున్నారో...బియ్యం బస్తాలు మోసుకొని వెళ్తున్నారో అర్థం కానీ పరిస్థితులు ఉన్నాయి.వారి చిట్టి చిట్టి భుజాల మీద ఏనుగులు మోసే అంతా బరువుని పెడుతుంటే వారు వంగి పోయి నడుస్తున్నారు. ఇది మనకు నిత్యం ఏదోక స్కూల్‌ దగ్గర కనిపించే దృశ్యాలే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎన్నో ఇబ్బందులు
Image Credit : Asianet News

ఎన్నో ఇబ్బందులు

చిన్న వయసులోనే బరువులు ఎక్కువగా మోయడం వల్ల వారు శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి తన బ్యాగ్‌లో రోజూ 30 కంటే ఎక్కువ పుస్తకాలు మోస్తున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.

37
తీవ్రమైన అనారోగ్య సమస్యలు
Image Credit : Asianet News

తీవ్రమైన అనారోగ్య సమస్యలు

పిల్లల సంచుల్లో ఉండే బరువు వల్ల వారిపై పడే ప్రభావం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడ నొప్పులు, వెన్ను బాధలు, అలసటతో పాటు ఎదుగుదలపై దుష్ప్రభావం వంటి సమస్యలు ముందుగా కనిపిస్తాయి. కొందరికి ఎత్తు పెరగకపోవడం, శరీర ఆకృతి సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వంటి ప్రభావాలు కూడా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

47
బరువు ఎంత ఉండాలంటే
Image Credit : Asianet News

బరువు ఎంత ఉండాలంటే

అయితే, స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉండాలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం విద్యార్థి శరీర బరువుతో పోలిస్తే బ్యాగ్ బరువు 10 శాతానికి మించి ఉండకూడదు. కానీ ప్రస్తుతం చాలా స్కూళ్లలో ఈ నియమాలు పాటించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో బ్యాగ్ బరువు కనీసం 7 నుంచి 15 కిలోల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇది పిల్లల భవిష్యత్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదాలు చాలానే ఉన్నాయి.

57
పెద్ద వడ్ల బస్తా సైజులో
Image Credit : Asianet News

పెద్ద వడ్ల బస్తా సైజులో

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 2 తరగతివారి బ్యాగ్ బరువు 1.5 కిలోలు మించకూడదు. 3 నుండి 5వ తరగతి విద్యార్థులకి 2 నుంచి 3 కిలోలు. 6-7 తరగతులకు 4 కిలోలు, 8-9 తరగతుల వారికి 4.5 కిలోలు, 10వ తరగతివారికి గరిష్ఠంగా 5 కిలోలు మాత్రమే ఉండాలి. అయితే ఈ లెక్కలన్నింటిని చాలా ప్రైవేట్‌ పాఠశాలలు తుంగలో తొక్కుతున్నాయి. ఒక్కొ సబ్జెక్టుకి తక్కువలో తక్కువ వేసుకున్న కనీసం ఐదారు పుస్తకాలు ఉంటున్నాయి.దాంతో పుస్తకాల సంచి పెద్ద వడ్ల బస్తా సైజులో తయారవుతుంది.

67
ఎంత బరువుంటే...అంత ఉత్తమ విద్య
Image Credit : Asianet News

ఎంత బరువుంటే...అంత ఉత్తమ విద్య

ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం కలిసి చర్యలు తీసుకోవడం అత్యవసరం. పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక సంచి మోసే శక్తి లేక అలసిపోయి ఉంటారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం స్కూల్‌లో ఎంత బరువైన పుస్తకాలు ఉంటే అంతే ఉత్తమ విద్య పొందుతున్నారనుకునే భ్రమలో బతికేస్తున్నారు. ఇది తప్పు. చదువు మెరుగ్గా ఉండాలంటే బ్యాగ్ బరువు తప్పనిసరిగా తక్కువగా ఉండాలి.

77
నో బ్యాగ్ డే
Image Credit : Asianet News

నో బ్యాగ్ డే

సాధ్యమైనన్ని పుస్తకాలు స్కూల్‌లోనే ఉంచాలని పాఠశాలలు కూడా ముందుకు రావాలి. ఇంటివద్ద చదువుకునేందుకు మాత్రమే అవసరమైన పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లేలా పిల్లలకు చెప్పాలి. లంచ్ బాక్స్, వాటర్ బాటిల్‌ను వేరే సంచుల్లో మోయాలని అలవాటు చేయాలి. పిల్లల బ్యాగ్ బరువు అధికంగా ఉంటే తక్షణమే స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి.

ఇంకా కొన్నిచోట్ల “నో బ్యాగ్ డే” అనే కార్యక్రమాన్ని చేపట్టి వారానికొకరోజు బ్యాగ్ తీసుకురాకుండా పిల్లలకు ఆ రోజంతా సృజనాత్మక, ఆనందకరమైన విద్యను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను అన్ని పాఠశాలలూ పాటిస్తే పిల్లలకు మంచి ఉపశమనం కలుగుతుంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Parenting Tips: ఫోన్ , టీవీ చూస్తూ పిల్లలు ఫుడ్ తింటున్నారా? పేరెంట్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి
Recommended image2
Parenting tips: ఏ వయసు పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడితే మంచిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved