Parentng Tips: పిల్లల తెలివితేటలు పెరగాలంటే పేరెంట్స్ ఏం చేయాలి?
కొందరు పేరెంట్స్ మాత్రం పిల్లలు ఏదైనా సరిగా నేర్చుకోలేకపోతే.. నీకు తెలివి లేదని.. నీ వల్ల ఏదీ చేతకాదు అని విమర్శిస్తూ ఉంటారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే...
తమ పిల్లలు అందరి కంటే తెలివైనవాళ్లుగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. పిల్లల్లో ఆ తెలివితేటలను పెంచేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి తెలియని విషయాలు చెబుతూ ఉంటారు. కొత్త విషయాలను నేర్పిస్తూ ఉంటారు. అయితే.. కొందరు పేరెంట్స్ మాత్రం పిల్లలు ఏదైనా సరిగా నేర్చుకోలేకపోతే.. నీకు తెలివి లేదని.. నీ వల్ల ఏదీ చేతకాదు అని విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. మరి.. తల్లిదండ్రులు ఏం చేస్తే.. పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం....
పేరెంట్స్ ఏం చేయాలి?
తెలివి తేటలు ప్రతి ఒక్కరికీ జన్మతహా వచ్చేయవు.ఇవి రోజువారి అలవాట్ల ద్వారా, సరైన ఆహారం, ఆలోచనల ద్వారా అభివృద్ధి చెందుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లల మెదడు శక్తిని పెంపొందించేందుకు మనం ఇంట్లోనే కొన్ని సరళమైన మార్పులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
పుస్తకాలు చదివించడం..
మొదటిగా, చదివే అలవాటు పిల్లల్లో తప్పనిసరిగా ఉండాలి. రోజూ కొన్ని నిమిషాలు కథలు చదవడం లేదా పుస్తకాల పట్ల ఆసక్తిని పెంపొందించడం వల్ల వారి ఊహాశక్తి, పదజాలం, విశ్లేషణ సామర్థ్యం మెరుగవుతుంది. అలాగే, తగినంత నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనది. మంచి నిద్ర వల్ల మెదడు విశ్రాంతి పొంది, కొత్త విషయాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది.ఎదిగే పిల్లలకు కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పడం..
పిల్లల్లో ఆసక్తి, కుతూహలాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. వారికి ఏది ఆసక్తి ఉందో..ఆ రంగంలో శిక్షణ ఇస్తే.. వారు మరింత మెరుగౌతతారు. అంతేకాకుండా.. పిల్లలకు నేర్చుకునే దశలో డౌట్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ మనమే తీర్చాలి. వారు ప్రశ్నలు అడగడాన్ని మద్దతు ఇవ్వాలి. "ఎందుకు?" అనే ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం చెప్పడం వారి ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే, ఇతరులతో సంభాషణలు, స్నేహాలు , ఇవి పిల్లల్లో సామాజిక చైతన్యం, భావనలను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతాయి.
మైండ్ గేమ్స్ ఆడించడం..
అదే సమయంలో, వారిని చిన్న చిన్న మానసిక ఛాలెంజ్‌లను ఇస్తూ ఉండాలి. ఉదాహరణకు చదరంగం, సుడోకు లాంటి గేమ్స్ ఆడించడం, జిగ్సా పజల్స్ పెట్టించడం లేదా సరికొత్త భాషా పదాలు నేర్పించడం వంటివి మంచివి. మొదట సులభంగా వారు ఈజీగా గెలిచేలా ఉండే వాటితో మొదలుపెట్టి.. వారికి వాటి మీద ఆసక్తి పెంచాలి.
ఇవి మాత్రమే కాకుండా, మెదడు ఆరోగ్యానికి అనువైన ఆహారం కూడా చాలా కీలకం. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న పండ్లు వంటివి ఆహారంలో చేర్చడం ద్వారా పిల్లల మెదడు శక్తి మెరుగవుతుంది.
ఇలా పిల్లల తెలివితేటలు ఒక్కసారిగా రావు. సరైన మార్గంలో, సరైన అలవాట్లతో, వారిని ప్రోత్సహించడం ద్వారా, వారు మానసికంగా, తెలివిగా ఎదుగుతారు.