MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Facts: గోవా, అంటార్కిటికాలో ఒకే పిన్ కోడ్ ఉంటుంది. ఎందుకో తెలుసా.?

Facts: గోవా, అంటార్కిటికాలో ఒకే పిన్ కోడ్ ఉంటుంది. ఎందుకో తెలుసా.?

ఒక్కో ప్రాంతానికి ఒక్కో పిన్ కోడ్ ఉంటుంద‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటి ఆధారంగా ఉత్త‌రాలు పంపిస్తుంటారు. అయితే మ‌న దేశంలోని గోవాకు, అంటార్కిటాకు ఒకే పిన్ కోడ్ ఉంద‌న్న విష‌యం మీకు తెలుసా.? 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 17 2025, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండి విభిన్న ప్రాంతాలు
Image Credit : Goa tourisam @ X

రెండి విభిన్న ప్రాంతాలు

గోవా అంద‌మైన స‌ముద్ర తీరాల‌కు, ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. మరోవైపు, అంటార్కిటికా – మంచుతో కప్పబడిన, మానవ నివాసానికి అనుకూలంగా లేని భూమి. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే ఈ ఖండంపై నిత్యం ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే ఇలా ఈ రెండు పూర్తిగా భిన్నమైన ప్రదేశాలకు ఒకే పిన్ కోడ్ ఉండటం ఆశ్చర్యమే కదూ!

25
ఒకే పిన్ కోడ్ ఎందుకు?
Image Credit : India Post And Other X Account

ఒకే పిన్ కోడ్ ఎందుకు?

గోవా, అంటార్కిటికాకు 403001 అనే పిన్ కోడ్ ఉంటుంది. ఇలా రెండు ప్రాంతాల‌కు ఒకే పిన్ కోడ్ ఎందుక‌నే సందేహం చాలా మందిలో ఉంటుంది. 1983లో భారత ప్రభుత్వం అంటార్కిటికాలో “దక్షిణ గంగోత్రి” అనే మొదటి శాస్త్రీయ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది.

ఇందులో పని చేసే పరిశోధకులకు తమ కుటుంబాల నుంచి లేఖలు అందేలా 1984లో అక్కడ పోస్టాఫీసు ప్రారంభించారు. కానీ అది స్థానికంగా కాకుండా గోవా ఆధారంగా పనిచేస్తుంది.

Related Articles

Related image1
UPI Payments: ఫోన్‌పే, గూగుల్‌పే చేసే వారికి గుడ్ న్యూస్‌.. ఈరోజు నుంచి ఆ స‌మ‌స్యలేన‌ట్లే
Related image2
ATM: ఏటీఎమ్ ఉప‌యోగించే వారికి గుడ్ న్యూస్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆర్బీఐ
35
అంటార్కిటికాకు లేఖలు ఎలా చేరేవి?
Image Credit : pinterest

అంటార్కిటికాకు లేఖలు ఎలా చేరేవి?

మీరు ఎవరికైనా అంటార్కిటికాలో లేఖ రాస్తే, దానిపై “Antarctica” అని రాసి, 403001 అనే పిన్ కోడ్ పెట్టాలి. ఈ లేఖ మొదట గోవాలోని వాస్కోడగామా ఉన్న National Centre for Polar and Ocean Research (NCPOR) కి చేరుతుంది. అక్కడి నుంచి ఆ లేఖలు అంటార్కిటికాలోని శిబిరానికి చేరతాయి.

45
ఎందుకు గోవా నుంచే పంపిస్తారు?
Image Credit : pinterest

ఎందుకు గోవా నుంచే పంపిస్తారు?

గోవాలోని NCPOR భారతదేశం నుంచి అంటార్కిటికాకు జరిపే అన్ని యాత్రలకు, లాజిస్టిక్ కార్యకలాపాలకు కేంద్రంగా పని చేస్తుంది. అంటే, శాస్త్రవేత్తలు, సరఫరా, పరికరాలు అన్నీ ఇక్కడ నుంచే పంపిస్తారు. అందుకే, ఆ పోస్టాఫీసు కూడా గోవా పిన్ కోడ్‌ను ఉపయోగించి పనిచేస్తోంది. దీని ద్వారా అక్కడికి వెళ్లే ఉత్తరాలు ఒకే మార్గం ద్వారా చేరుతాయి.

55
పోస్టల్ స్టాంపు ‘రద్దు’ ప్రక్రియ.
Image Credit : our own

పోస్టల్ స్టాంపు ‘రద్దు’ ప్రక్రియ.

గోవాలోని NCPOR ఉత్తరాలపై పోస్టల్ స్టాంపును ‘రద్దు’ చేస్తుంది. దీని అర్థం ఆ స్టాంపును తిరిగి ఉపయోగించకుండా చెయ్యడం. ఇది అధికారికంగా ఆ లేఖని పంపిన ఆధారంగా నిలుస్తుంది. రద్దయిన ఈ ఉత్తరాలు ఆ తరువాత సరైన సమయంలో అంటార్కిటికాలలోని శిబిరంలో ఉన్న వ్యక్తుల వరకు చేరతాయి. ఈ విధంగా, భారతీయ పోస్టల్ వ్యవస్థ తెలివిగా పనిచేసి ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశమైన అంటార్కిటికాలో కూడా పోస్ట‌ల్ సేవ‌ల‌ను అందిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Recommended image2
Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!
Recommended image3
అదే జరిగిందో.. బంగారం ధర టక్కున రెండు లక్షలు..!
Related Stories
Recommended image1
UPI Payments: ఫోన్‌పే, గూగుల్‌పే చేసే వారికి గుడ్ న్యూస్‌.. ఈరోజు నుంచి ఆ స‌మ‌స్యలేన‌ట్లే
Recommended image2
ATM: ఏటీఎమ్ ఉప‌యోగించే వారికి గుడ్ న్యూస్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆర్బీఐ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved