- Home
- National
- Indian Railways: పెళ్లిళ్లు, యాత్రలకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. రైలు రిజర్వేషన్ రూల్స్ ఛేంజ్.. టికెట్ల బుకింగ్ సూపర్ ఈజీ
Indian Railways: పెళ్లిళ్లు, యాత్రలకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. రైలు రిజర్వేషన్ రూల్స్ ఛేంజ్.. టికెట్ల బుకింగ్ సూపర్ ఈజీ
Indian Railways: భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సౌత్ వెస్ట్రన్ రైల్వే గ్రూప్, బల్క్ టికెట్ బుకింగ్ పరిమితిని ఎత్తివేసింది. పెళ్లిళ్లు, ట్రిప్‌లకు వెళ్లేవారికి ఇకపై ఒకేసారి సీట్ల బుకింగ్ మరింత ఈజీ అవుతుంది. ఆ వవరాలు మీకోసం.

గుడ్ న్యూస్.. బల్క్ రైలు టికెట్లపై లిమిట్ కట్! ఇక ఒకేసారి ఎన్నైనా సీట్లు బుక్ చేసుకోవచ్చు
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్‌తో కలిసి ఒకేసారి ట్రైన్‌లో వెళ్లేవారికి ఇది నిజంగా మంచి అప్‌డేట్. ఇప్పటివరకు బల్క్ లేదా గ్రూప్ రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఒక లిమిట్ ఉండేది. అయితే ఆ పరిమితిని ఇప్పుడు సౌత్ వెస్ట్రన్ రైల్వే తొలగించింది. ఈ మేరకు గ్రూప్, బల్క్ రిజర్వేషన్ నిబంధనల్లో మార్పులు చేస్తూ అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పెళ్లిళ్లు, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, తీర్థయాత్రలు, స్పోర్ట్స్ ఈవెంట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించేవారికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గ్రూప్‌గా వెళ్లేవారు ఒకేసారి బెర్తులు బుక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ప్రయాణికులు బుక్ చేసుకునే సీట్ల సంఖ్యపై ఉన్న పరిమితిని రైల్వే ఎత్తివేసిందని సౌత్ వెస్ట్రన్ రైల్వే తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
ఉదయం 9 గంటల నుంచే బుకింగ్
సౌత్ వెస్ట్రన్ రైల్వే నోటిఫికేషన్ ప్రకారం, ఈ గ్రూప్ బుకింగ్ సదుపాయం మెయిన్ స్టేషన్లలో మాత్రమే ఉంటుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ కింద రిజర్వేషన్లు మొదలైన గంట తర్వాత, అంటే ఉదయం 9 గంటల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. జర్నీ డేట్‌కు 60 రోజుల ముందు ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ మొదలవుతుంది.
ఉదాహరణకు, ఈ రోజు నుంచి 100 రోజుల తర్వాత ప్రయాణం చేయాలంటే అప్పుడే టికెట్ బుక్ చేయలేరు. ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు ఉదయం 8 గంటల నుంచే బుకింగ్ మొదలవుతుంది. పెళ్లిళ్లు, స్టడీ టూర్లు, తీర్థయాత్రలు, స్పోర్ట్స్ టీమ్స్ లేదా కల్చరల్ గ్రూప్స్ వంటి నిజమైన అవసరాల కోసం వెళ్లేవారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని సౌత్ వెస్ట్రన్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కన్ఫర్మ్, ఆర్ఏసీ, వెయిట్‌లిస్టెడ్ టికెట్లతో సంబంధం లేకుండా అన్ని క్లాసులకు ఇది వర్తిస్తుంది.
స్టేషన్ మేనేజర్‌కే అధికారం
బల్క్ రిజర్వేషన్ కింద బుక్ చేసే సీట్ల సంఖ్యపై ఇకపై ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదని సౌత్ వెస్ట్రన్ రైల్వే పేర్కొంది. గతంలో ఉన్న నిబంధనలు, లిమిట్స్‌ను తొలగించారు. ఇప్పుడు బల్క్ రిజర్వేషన్‌కు పర్మిషన్ ఇచ్చే అధికారాన్ని చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ లేదా స్టేషన్ మేనేజర్ కు అప్పగించారు.
ఏజెంట్ల ద్వారా కాదు.. నేరుగా కలవాలి
ఎక్కువ సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకునేవారు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కాకుండా, నేరుగా సంబంధిత అధికారులను కలవాలని సౌత్ వెస్ట్రన్ రైల్వే కోరింది. అయితే ఫారిన్ టూరిస్టులు లేదా ఎన్ఆర్ఐల విషయంలో మాత్రం ఇప్పటికే ఉన్న రూల్స్ ప్రకారం ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణ వివరాలు తప్పనిసరి
ట్రావెల్ పర్పస్ క్లియర్‌గా చెబితేనే బల్క్ టికెట్లు బుక్ చేసుకునేందుకు సౌత్ వెస్ట్రన్ రైల్వే అనుమతి ఇస్తుంది. గ్రూప్‌లో ప్రయాణించే ప్రతి ఒక్కరి పేరు, వయసు, జెండర్, అడ్రస్‌తో పాటు ప్రయాణ ఉద్దేశాన్ని కూడా తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది.















