- Home
- Business
- UPI Payments: ఫోన్‌పే, గూగుల్‌పే చేసే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి ఆ సమస్యలేనట్లే
UPI Payments: ఫోన్‌పే, గూగుల్‌పే చేసే వారికి గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి ఆ సమస్యలేనట్లే
దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఏ రేంజ్‌లో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న చిన్న లావాదేవీలు మొదలు పెద్ద పేమెంట్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు.

యూపీఐ చెల్లింపులు ఇక రెట్టింపు వేగం
దేశంలోని పల్లెల నుంచి పట్టణాల వరకు యూపీఐ డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రాధాన్యమిస్తున్న ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపులను మరింత వేగంగా, సమర్థవంతంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ 17 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
15 సెకన్లలో చెల్లింపు పూర్తి
ఇప్పటివరకు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం లేదా స్వీకరించడానికి సగటున 30 సెకన్ల సమయం తీసుకుంటుండేది. అయితే తాజా మార్పుల ప్రకారం, ఇకపై ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా కేవలం 15 సెకన్లలో చెల్లింపు పూర్తయ్యేలా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారు. దీంతో వినియోగదారులకు వేగవంతమైన అనుభవం లభించనుంది.
ఫెయిలైన ట్రాన్సాక్షన్ సమాచారం
చెల్లింపు ఫెయిల్ అయినా కానీ, పెండింగ్‌లో ఉన్నా కానీ... అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పటివరకు 30 సెకన్ల సమయం పట్టేది. ఇప్పుడు ఈ సమయాన్ని 10 సెకన్లకు తగ్గించారు. దీంతో ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయంలో వినియోగదారులకు తక్కువ సమయంలో స్పష్టత వస్తుంది.
QR కోడ్ స్కాన్ చెల్లింపులు మరింత వేగం
QR కోడ్ స్కాన్ చేసి చేసే చెల్లింపుల వేగాన్ని కూడా పెంచారు. ఈ విధానంలో కూడా ఇకపై 15 సెకన్లలోనే చెల్లింపులు పూర్తవుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. గతంలో కంటే ఇది వేగవంతమైన సేవలు అందించనుంది.
పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్
గతంలో పేమెంట్ స్టేటస్ కోసం 90 సెకన్ల వరకూ వేచి ఉండాల్సి వచ్చేది. కానీ తాజా మార్పుల తర్వాత దీనిని 45 నుంచి 60 సెకన్లకు తగ్గించారు. ఫెయిలైన లేదా నిలిచిపోయిన ట్రాన్సాక్షన్‌ల స్టేటస్‌ను త్వరగా తెలుసుకునే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది.
ఈ మార్పులతో UPI చెల్లింపులు మరింత వేగంగా, భద్రతగా మారనున్నాయి. వినియోగదారులకు తక్కువ సమయంలో సేవలు అందడం వల్ల డిజిటల్ పేమెంట్ పట్ల మరింత నమ్మకం పెరగనుంది.