MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఆశగా తిందామని మ‌ట‌న్ బిర్యాని ఆర్డ‌ర్ పెట్టాడు.. క‌వ‌ర్ ఓపెన్ చేసి చూడ‌గా కుక్క కాలు.? షాకింగ్ వీడియో

ఆశగా తిందామని మ‌ట‌న్ బిర్యాని ఆర్డ‌ర్ పెట్టాడు.. క‌వ‌ర్ ఓపెన్ చేసి చూడ‌గా కుక్క కాలు.? షాకింగ్ వీడియో

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వినోదాన్ని పంచితే మ‌రికొన్ని భ‌య‌పెట్టేవి ఉంటాయి. తాజాగా నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఓ వీడియో నెటిజ‌న్ల‌ను షాక్‌కి గురి చేస్తోంది. ఇంత‌కీ వీడియోలో అంతలా ఏముంద‌నేగా.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 13 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెరుగుతోన్న ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌ర్లు
Image Credit : Gemini AI

పెరుగుతోన్న ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌ర్లు

ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయి. ఉద్యోగాలు, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది బయట హోటళ్లకు వెళ్లకుండా మొబైల్ యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు ఉండటంతో వినియోగదారులు కూడా ఎక్కువగా ఈ సేవలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ వంటి వంటకాలు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో ఫుడ్ డెలివ‌రీలో జ‌రుగుతోన్న కొన్ని సంఘ‌ట‌న‌లు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి.

25
మటన్ బిర్యానీలో అనుమానాస్పద ముక్కలు
Image Credit : indianscanvas/Instagram

మటన్ బిర్యానీలో అనుమానాస్పద ముక్కలు

తాజాగా కాన్పూర్‌కి చెందిన ఓ వ్య‌క్తి పోస్ట్ చేసిన వీడియో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. కాన్పూర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి ఒక ప్రముఖ రెస్టారెంట్ నుంచి మటన్ బిర్యానీని ఆర్డర్ చేసినట్లు సమాచారం. డెలివరీ వచ్చిన తర్వాత బాక్స్ తెరిచి చూడగా బిర్యానీలో ఉన్న కొన్ని ముక్కలు సాధారణ మటన్ ముక్కలలా కనిపించలేదని అతను పేర్కొన్నాడు. ఆ ముక్కలు కుక్క కాలు ఆకారంలో ఉన్నట్లు అనిపించడంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే ఆ మాంసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Related Articles

Related image1
వెయ్యి రూపాయ‌ల‌కే మినీ కూల‌ర్‌.. ఇల్లు, ఆఫీస్‌, ట్రావెల్ ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు
Related image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి మొద‌ట్లో క‌ష్టాలున్నా.. శ‌ని ద‌య‌తో జీవితం మారుతుంది
35
వీడియో వైరల్.. కస్టమర్ ఆగ్రహం
Image Credit : indianscanvas/Instagram

వీడియో వైరల్.. కస్టమర్ ఆగ్రహం

సదరు వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. వీడియోలో కస్టమర్ రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించాడు. తాను మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే కుక్క మాంసం పంపించారని ఆరోపించాడు. కుక్క కాలును పోలి ఉన్న‌ట్లు క‌నిపిస్తున్న ముక్క‌ను సైతం అత‌ను వీడియోలో చూపించాడు. దీంతో ఈ వీడియో కాస్త ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు.

45
పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణ
Image Credit : indianscanvas/Instagram

పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణ

ఈ ఘటనపై వివాదం పెరగడంతో స్థానిక పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బిర్యానీలో ఉన్న మాంసం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్లు తెలుస్తోంది. అది నిజంగా వేరే జంతువు మాంసమా లేదా సాధారణ మటన్ ముక్కేనా అన్నది ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ఇదే

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indians Canvas (@indianscanvas)

55
ఆర్డ‌ర్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి
Image Credit : indianscanvas/Instagram

ఆర్డ‌ర్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

ఈ సంఘటన తర్వాత ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ల విషయంలో వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నమ్మకమైన రెస్టారెంట్ల నుంచే ఆర్డర్ చేయడం మంచిది. ఆహారం అందుకున్న తర్వాత దాని నాణ్యతను పరిశీలించాలి. అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయాలి. ఆన్‌లైన్ ఫుడ్ సేవలు మ‌న ప‌నిని సుల‌భ‌త‌రం చేస్తున్న‌ప్ప‌టికీ ఆహార భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. మ‌రి నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియోలో నిజ‌మెంత ఉందో తెలియాలంటే అధికారిక రిపోర్ట్ వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
MiG-29 UPG Fighter Jet: యుద్ధ విమానాన్ని పరిశీలించిన వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ | Asianet Telugu
Recommended image2
Now Playing
Saudi Oil Vessel Shenlong: యుద్ధ బాంబులను తప్పిచుకుంటూ భారత్ కు చేరుకున్న ఆయిల్ షిప్| Asianet Telugu
Recommended image3
Now Playing
మోనాలిసా భర్త ఎవరో తెలుసా? Who is Monalisa Bhosle's husband | Asianet News Telugu
Related Stories
Recommended image1
వెయ్యి రూపాయ‌ల‌కే మినీ కూల‌ర్‌.. ఇల్లు, ఆఫీస్‌, ట్రావెల్ ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి మొద‌ట్లో క‌ష్టాలున్నా.. శ‌ని ద‌య‌తో జీవితం మారుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved