MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Astrology
  • Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి మొద‌ట్లో క‌ష్టాలున్నా.. శ‌ని ద‌య‌తో జీవితం మారుతుంది

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి మొద‌ట్లో క‌ష్టాలున్నా.. శ‌ని ద‌య‌తో జీవితం మారుతుంది

Numerology: సంఖ్యా శాస్త్రం ఆధారంగా వ్య‌క్తుల స్వభావం, జీవితంలో ఎదురయ్యే అవకాశాలు, విజయాలను నిర్ణ‌యించ‌వ‌చ్చ‌ని న్యూమ‌రాల‌జీ చెబుతుంది. మూలాంకం ప్ర‌కారం 8 అంకె ఉన్న వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 12 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూలాంకం 8 అంటే ఏమిటి?
Image Credit : Getty

మూలాంకం 8 అంటే ఏమిటి?

న్యూమ‌రాల‌జీలో మూలాంకం 8ని చాలా ప్రత్యేకమైన సంఖ్యగా భావిస్తారు. ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 8 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి శని గ్రహం. జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం క్రమశిక్షణ, సహనం, కష్టం అనే లక్షణాలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ సంఖ్యకు చెందిన వారు జీవితంలో ముందుకు రావడానికి ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రారంభ జీవితం క‌ష్టాల్లో
Image Credit : Freepik

ప్రారంభ జీవితం క‌ష్టాల్లో

సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలాంకం 8 ఉన్న వారి ప్రారంభ జీవితం సాధారణంగా స‌వాళ్ల‌తో ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో విజయం సాధించడానికి ఇతరుల కంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. చాలా విషయాలు వారికి సులభంగా లభించవు. ఈ సమయంలో శని ప్రభావం వల్ల వారు క్రమశిక్షణ, సహనం వంటి లక్షణాలు నేర్చుకుంటారని నమ్మకం ఉంది.

Related Articles

Related image1
Induction stove: గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంతైనా పెర‌గ‌ని.. ఈ స్ట‌వ్ మీ ఇంట్లో ఉంటే బిందాస్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related image2
వెయ్యి రూపాయ‌ల‌కే మినీ కూల‌ర్‌.. ఇల్లు, ఆఫీస్‌, ట్రావెల్ ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు
35
మూలాంకం 8 వ్యక్తుల స్వభావం
Image Credit : Asianet News

మూలాంకం 8 వ్యక్తుల స్వభావం

న్యూమ‌రాల‌జీ ప్రకారం ఈ సంఖ్యకు చెందిన వారు సాధారణంగా శాంతంగా, గంభీరంగా ఉంటారు. వీరు తక్కువగా మాట్లాడుతారు. తమ భావాలను ఎక్కువగా బ‌య‌ట‌పెట్ట‌రు. పని మీద ఎక్కువ‌గా దృష్టిపెడ‌తారు. ఈ కారణంగా కొందరికి వారు అహంకారంగా కనిపించవచ్చు. కానీ వాస్తవానికి వారు చాలా బాధ్యతాయుతంగా, కష్టపడే స్వభావం కలిగినవారు.

45
ఆ స‌మ‌యంలో ఊహించ‌ని మార్పు
Image Credit : AI Generated photo

ఆ స‌మ‌యంలో ఊహించ‌ని మార్పు

నిపుణుల ప్రకారం మూలాంకం 8 ఉన్న వారికి 35 నుంచి 36 సంవత్సరాల మధ్య జీవితంలో ముఖ్యమైన మలుపు వస్తుంది. ఈ సమయంలో కెరీర్‌లో మంచి అవకాశాలు వ‌స్తాయి. ఆర్థికంగా పురోగతి ల‌భిస్తుంది. సమాజంలో పేరు, గుర్తింపు పొందుతారు. శని దేవుని అనుగ్రహం వల్ల వారి కష్టానికి తగిన ఫలితం ఈ దశలో కనిపిస్తుందని చెబుతారు.

55
విజయంతో ప్రభావం చూపే వ్యక్తులు
Image Credit : Freepik

విజయంతో ప్రభావం చూపే వ్యక్తులు

మూలాంకం 8 ఉన్న వారు జీవితంలో విజయాన్ని సాధించిన తర్వాత సమాజంపై కూడా ప్రభావం చూపే స్థాయికి ఎదుగుతారని న్యూమరాల‌జీ చెబుతోంది. స‌మాజంలో ఎంతో మంది విజయవంతమైన వ్యాపారవేత్తలు, ప్రముఖ నాయకులు ఈ సంఖ్యకు చెందినవారే అని నిపుణులు చెబుతారు. వీరు కష్టపడే స్వభావం వల్ల ఒకసారి విజయాన్ని అందుకున్న తర్వాత దాన్ని స్థిరంగా నిలబెట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటారు.

గమనిక: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం విశ్వాసాలపై ఆధారపడినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గమ‌నించాలి. జీవితంలో విజయానికి కష్టం, పట్టుదల, సరైన నిర్ణయాలు ముఖ్యమైనవని గుర్తించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mercury Venus Retrograde: బుధ, శుక్రుల వక్ర సంచారం.. ఈ 5 రాశులవారికి డబ్బు, తిరుగులేని సక్సెస్!
Recommended image2
Planet Reterograde: ఈ 5 రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగంతో ఆకస్మిక ధనలాభం, అదృష్టం!
Recommended image3
Rakhi 2026: రాఖీ ఎప్పుడు క‌ట్టాలి.? స‌రైన సమయం ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Induction stove: గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంతైనా పెర‌గ‌ని.. ఈ స్ట‌వ్ మీ ఇంట్లో ఉంటే బిందాస్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image2
వెయ్యి రూపాయ‌ల‌కే మినీ కూల‌ర్‌.. ఇల్లు, ఆఫీస్‌, ట్రావెల్ ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved