MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వెయ్యి రూపాయ‌ల‌కే మినీ కూల‌ర్‌.. ఇల్లు, ఆఫీస్‌, ట్రావెల్ ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు

వెయ్యి రూపాయ‌ల‌కే మినీ కూల‌ర్‌.. ఇల్లు, ఆఫీస్‌, ట్రావెల్ ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లొచ్చు

Mini Cooler: స‌మ్మ‌ర్ మొద‌లైంది. దీంతో చాలా మంది ఏసీలు, కూల‌ర్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే కేవ‌లం వెయ్యి రూపాయ‌ల్లో అది కూడా ఎక్క‌డికంటే అక్క‌డికి తీసుకెళ్లే కూల‌ర్ ఉంటే భ‌లే ఉంటుంది క‌దూ! అలాంటి ఓ కూలర్ గురించి తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 12 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ ధరలో గది చల్లగా చేసే పోర్టబుల్ మినీ కూలర్
Image Credit : amazon.in

తక్కువ ధరలో గది చల్లగా చేసే పోర్టబుల్ మినీ కూలర్

వేసవి కాలంలో చిన్న గదుల్లో చల్లదనం కోసం చాలా మంది తక్కువ ఖర్చుతో ఉండే మినీ కూల‌ర్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి Exxelo Mini Cooler 3‑in‑1 Portable Air Conditioner ఒక సరైన ఎంపికగా చెప్పొచ్చు. ఇది మినీ కూలర్, హ్యూమిడిఫైయర్, ఎయిర్ ప్యూరిఫయర్‌లా పనిచేసే 3-in-1 పరికరం. గది, ఆఫీస్, స్టడీ రూమ్ వంటి చిన్న ప్రదేశాల్లో ఉపయోగించేందుకు అనుకూలంగా రూపొందించారు. ప్రస్తుతం దీని ధర సుమారు రూ. 969 వరకు ఉంటుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ వంటి వాటితో కొనుగోలు చేస్తే మ‌రింత క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. చిన్న గదులు, స్టడీ టేబుల్, వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే వారికి ఇది సరైన ఎంపిక. పెద్ద ఎయిర్ కండీషనర్ కొనలేని వారికి ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది.

25
3 ఇన్ 1 ఫీచ‌ర్ – కూలర్, హ్యూమిడిఫయర్, ప్యూరిఫయర్
Image Credit : amazon.in

3 ఇన్ 1 ఫీచ‌ర్ – కూలర్, హ్యూమిడిఫయర్, ప్యూరిఫయర్

ఈ మినీ కూల‌ర్‌ ఒకేసారి మూడు విధాలుగా పనిచేస్తుంది. మినీ కూలర్ – గాలి చల్లగా చేస్తుంది. హ్యూమిడిఫయర్ – గాలిలో తేమను పెంచుతుంది. అలాగే ఎయిర్ ప్యూరిఫయర్ – గాలిని కొంతవరకు శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. ఇది 5 స్ప్రే మిస్టింగ్ సిస్టమ్ తో వస్తుంది. నీటిని మిస్ట్ రూపంలో విడుదల చేసి గాలిని చల్లగా చేస్తుంది. అలాగే అరోమా ఆయిల్ వేస్తే గదిలో సువాసన కూడా వస్తుంది.

Related Articles

Related image1
Induction stove: గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంతైనా పెర‌గ‌ని.. ఈ స్ట‌వ్ మీ ఇంట్లో ఉంటే బిందాస్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related image2
వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా
35
600ML వాటర్ ట్యాంక్ – గంటల పాటు చల్లదనం
Image Credit : amazon.in

600ML వాటర్ ట్యాంక్ – గంటల పాటు చల్లదనం

ఈ మినీ కూలర్‌లో 600 మిల్లీలీటర్ల నీటి ట్యాంక్ ఉంటుంది. ఒకసారి నీరు నింపితే 2 నుంచి 6 గంటల వరకు స్ప్రే కొనసాగుతుంది కొన్ని పరిస్థితుల్లో 2.5 నుంచి 12 గంటల వరకు పనిచేయవచ్చు. ట్యాంక్‌ను తీసి సులభంగా శుభ్రం చేయవచ్చు. ఇంకా చల్లదనం కావాలంటే ట్యాంక్‌లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు.

45
మూడు గాలి వేగాలు – టైమర్ సదుపాయం
Image Credit : amazon.in

మూడు గాలి వేగాలు – టైమర్ సదుపాయం

ఈ మినీ కూలర్‌లో లో, మీడియం, హై అనే మూడు ర‌కాల ఫ్యాన్ స్పీడ్ మోడ్‌లను అందించారు. మీకు అవసరమైన చల్లదనం ప్రకారం వీటిని మార్చుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ టైమర్ ఫీచర్ కూడా ఉంది. గంట, రెండు గంట‌లు, మూడు గంట‌ల్లో టైమ్ సెట్ చేసుకుంటే ఆ స‌మ‌యానికి ఆఫ్ అవుతుంది.

55
USB పవర్‌తో ఎక్కడైనా సులభంగా
Image Credit : amazon.in

USB పవర్‌తో ఎక్కడైనా సులభంగా

ఈ పరికరం USB పవర్‌తో పనిచేస్తుంది. అందువల్ల దీనిని అనేక పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్, అడాప్టర్, కంప్యూటర్ వంటి వాటితో న‌డుస్తుంది. ఇది 5V 2A ఇన్‌పుట్ వోల్టోజ్‌ తో పనిచేస్తుంది. అయితే ఇది రిచార్జబుల్ కాదు. USB కేబుల్ పెట్టినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. చిన్న సైజ్ ఉండటంతో దీనిని తీసుకెళ్లడం కూడా చాలా సులభం. కిచెన్, ఆఫీస్, బెడ్‌రూమ్, పిక్నిక్ లేదా ట్రావెల్ సమయంలో కూడా ఉపయోగించవచ్చు.

గమనిక: ఇది పూర్తి స్థాయి ఎయిర్ కండీషనర్ కాదు. సాధారణ ఫ్యాన్ కంటే కొంచెం చల్లదనం ఇచ్చే మినీ కూలర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఈ ప్రొడ‌క్ట్‌ను కొనుగోలు చేసే ముందు రివ్యూల‌ను ప‌రిశీలించ‌డం ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Toll Plaza: టోల్ ఫీజు క‌డితే ఇన్ని లాభాలున్నాయా? ఉచితంగా పెట్రోల్ కూడా ఇస్తారని తెలుసా
Recommended image2
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయిన గుడ్ల ధరలు.. ట్రే ఎంతంటే?
Recommended image3
Induction stove: గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంతైనా పెర‌గ‌ని.. ఈ స్ట‌వ్ మీ ఇంట్లో ఉంటే బిందాస్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
Induction stove: గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంతైనా పెర‌గ‌ని.. ఈ స్ట‌వ్ మీ ఇంట్లో ఉంటే బిందాస్‌. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image2
వివాహేత‌ర సంబంధాల్లో దేశంలో ఏ న‌గ‌రం మొద‌టి స్థానంలో ఉందో తెలుసా.? తెలుగు వారు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved