Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు
Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం.

Heavy Rains : తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. మూసీ వరదలతో హైదరాబాద్ అప్రమత్తం
తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో సుమారు 35 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు మునిగిపోయాయి.
ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వరదనీరు చేరడంతో బస్సులను ఇతర మార్గాలకు మళ్లించారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి జిల్లాల బస్సులు నడుస్తున్నాయి. పూరానాపూల్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై నీరు పొంగిపొర్లడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. టీఎస్ఆర్టీసీ ఎంజీబీఎస్‌కు ప్రయాణికులు రావొద్దని విజ్ఞప్తి చేస్తూ, వివరాల కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించమని సూచించింది.
Chandrababu Naidu: 2029 నాటికి అందరికీ ఇళ్లు.. : సీఎం చంద్రబాబు నాయుడు
సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను వివరించారు. అక్టోబర్ 4న 2.9 లక్షల ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని చెప్పారు. రైతులకు మద్దతు ధరలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, ఆక్వా రైతులకు సబ్సిడీలు అందించామని గుర్తుచేశారు.
4.7 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామనీ, యువత ఉపాధి తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. అన్నక్యాంటీన్లను తిరిగి ప్రారంభించి, సంఖ్యను 271కి పెంచుతామని చెప్పారు. దీపావళికల్లా 3 లక్షల ఇళ్లు ఇస్తామని, 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు కల్పించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.
PM Modi: అక్టోబర్ 16న ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ
అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో దర్శనం చేసుకోనున్నారు.
కర్నూలులో కూటమి నేతలతో కలిసి రోడ్‌షో నిర్వహించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ ర్యాలీ చేయనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో తెలిపారు.
India vs Pakistan :పాక్ ఇచ్చిపడేసిన భారత్
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐరాసలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధ చర్యతో సమానం అని అన్నారు. అయితే, దీనికి భారత్ ఘాటుగానే స్పందించింది. భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని తిప్పికొట్టారు.
బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించిన పాక్ ద్వంద్వ విధానాన్ని ఎండగట్టారు. అమాయక భారత పౌరులపై దాడులకు పాక్ బాధ్యత వహించాలన్నారు. నిజంగా శాంతి కోరుకుంటే ఉగ్రవాదాన్ని మానుకోవాలని, నేరస్తులను అప్పగించాలన్నారు. భారత్ సమస్యలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరమవుతాయనీ, అణు బెదిరింపులను ఎప్పటికీ సహించబోమని గహ్లోత్ స్పష్టం చేశారు.
Sheetal Devi : పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శీతల్ కు స్వర్ణం
దక్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల శీతల్ చరిత్ర సృష్టించింది. కౌంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో వరల్డ్ నెం.1 ఓజ్నూర్ క్యూర్ గిర్డిని 146-143 తేడాతో ఓడించి స్వర్ణం గెలుచుకుంది.
అలాగే, తోమన్ కుమార్ కూడా కౌంపౌండ్ మెన్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఈక్రితం శీతల్, తోమన్ జంటగా మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో బ్రిటన్ జోడీపై గెలిచి కాంస్యం సాధించారు. కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో శీతల్, సరిత రజతం గెలిచారు.