ఆసియా కప్ ఫైనల్ : భారత్‌కు షాక్.. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఔట్.. ?
IND vs PAK: భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ గాయపడ్డారు. మోర్కెల్ వీరి గాయాలకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. ఫైనల్ లో ఆడతారా? లేదా?

ఆసియా కప్ ఫైనల్ ముందు భారత జట్టుకు షాక్
ఆసియా కప్ 2025 ఫైనల్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గాయాల సమస్యలు ఎదురయ్యాయి. భారత్-శ్రీలంక (IND vs SL) సూపర్-4 చివరి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యంగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఇద్దరూ గాయపడి గ్రౌండ్ ను వీడారు. దీంతో పాకిస్తాన్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ కు ముందు వీరు ఆడతారా లేదా? అనే ప్రశ్నలు వచ్చాయి. ఇది ఫైనల్‌కు ముందు టీమిండియా, అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.
హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఎలా గాయపడ్డారు?
సూపర్-4లో శ్రీలంకపై భారత్ సూపర్ ఓవర్‌లో గెలిచింది. అయితే ఆ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్ వేసి, తొలి బంతికే కుసల్ మెండిస్ వికెట్ తీసి ఔట్ చేశాడు. కానీ వెంటనే ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్‌లో అసౌకర్యం అనిపించడంతో మైదానం విడిచారు. ఆ తర్వాత పాండ్యా తిరిగి ఆడలేదు.
ఇక, అభిషేక్ శర్మ తొమ్మిదో ఓవర్‌లో పరుగులు తీస్తున్న సమయంలో కుడి తొడ పట్టుకుని ఇబ్బంది పడ్డాడు. 10వ ఓవర్‌లో మైదానం విడిచారు. ఇద్దరికీ వెంటనే ఐస్ ప్యాక్, పికల్ జ్యూస్‌తో ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఫైనల్ ఆడతారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.
భారత ప్లేయర్ల గాయాలపై మోర్నే మోర్కెల్ అప్‌డేట్
మ్యాచ్ అనంతరం భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్లేయర్ల గాయాలకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు. “ఇద్దరికీ తీవ్రమైన గాయాలు కాలేదు. కేవలం క్రాంప్స్ మాత్రమే. అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు, హార్దిక్ పాండ్యా విషయంపై తుది నిర్ణయం శనివారం తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ అప్‌డేట్‌తో కొంత ఊరట లభించినప్పటికీ, పాండ్యా ఫైనల్‌లో ఆడతారా అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టత రాలేదు. అంటే పాక్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడనున్నాడు. మరోసారి పాక్ పై అతని తుపాను ఇన్నింగ్స్ ను చూడవచ్చు. అయితే, పాక్ పై మంచి రికార్డు ఉన్న హార్ధిక్ పాండ్యా ఆడతారా లేదా అనేది మ్యాచ్ కు ముందు తెలిసే అవకాశముంది.
ఆసియా కప్ 2025 భారత్-పాకిస్థాన్ ఫైనల్
ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఆసియా కప్ 2025 ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ సాయంత్రం 7:30 గంటలకు, మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ హై వోల్టేజ్ ఫైనల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ ఫైనల్ లో తలపడుతున్నాయి.
భారత్, పాకిస్థాన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11
భారత్ జట్టు: అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్ జట్టు: సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సామ్ అయూబ్, సల్మాన్ ఆగా (కెప్టెన్), హుస్సేన్ తలాత్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్