MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రిపబ్లిక్ డే: మ‌న ఆత్మవిశ్వాసం ఎప్ప‌టికీ వ‌మ్ము కాదు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్ర‌సంగం

రిపబ్లిక్ డే: మ‌న ఆత్మవిశ్వాసం ఎప్ప‌టికీ వ‌మ్ము కాదు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్ర‌సంగం

76th republic day: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి చేస్తున్న అనేక కార్యక్రమాలను వివరిస్తూ మన ఆత్మవిశ్వాసం ఎప్పటికీ వమ్ము కాదన్నారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధితో ముందుకుసాగుతున్నామని చెప్పారు. 
 

Mahesh Rajamoni | Updated : Jan 26 2025, 09:08 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

india republic day: భారతదేశం తన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2025న గొప్ప వేడుకలను జ‌రుపుకుంటోంది. ఉత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా వచ్చే  ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమక్షంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో వేడుక‌లు జ‌రుగుతున్నాయి. 

1950లో ఈ చారిత్రాత్మకమైన రోజున అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ జనవరి 26 రిప‌బ్లిక్ డేను జ‌రుపుకుంటున్నాము. భార‌త రాష్ట్రప‌తి ద్రౌపది ముర్ము, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇది యువ గణతంత్రానికి సర్వతోముఖంగా పురోగమిస్తున్న కాలం అని పేర్కొన్నారు.

26
Asianet Image

వలసవాద మనస్తత్వాన్ని మార్చేందుకు గట్టి ప్రయత్నాలను చూస్తున్నాము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రభుత్వ అనేక సంస్కరణాత్మక, సంక్షేమ చర్యలు, చట్టాలను ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో వలసవాద మనస్తత్వాన్ని మార్చేందుకు గట్టి ప్రయత్నాలను చూస్తున్నామని అన్నారు. 1947 సంవత్సరంలో స్వాతంత్య్రం సాధించాము, కాని వలస మనస్తత్వ అనేక అవశేషాలు చాలా కాలం పాటు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆ మనస్తత్వాన్ని మార్చే ప్రయత్నాలను చూస్తున్నామ‌ని ముర్ము పేర్కొన్నారు. 

36
Independence Day Greetings 2022

Independence Day Greetings 2022

వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏం చెప్పారంటే? 

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రభుత్వ చొరవను ధైర్యమైన దూరదృష్టితో కూడిన ప్రయత్నంగా రాష్ట్రప‌తి ముర్ము అభివర్ణించారు. "వన్ నేషన్ వన్ ఎలక్షన్" సుపరిపాలనకు కొత్త కోణాలను అందించగలదనీ,  పాలనలో కొనసాగింపును ప్రోత్సహించగలదనీ, ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంద‌ని రాష్ట్రప‌తి చెప్పారు. 

"విధాన రూపకల్పనకు సంబంధించిన ఇనాక్టివిటీని తొలగించవచ్చు, వనరుల ఎక్కువ ఖ‌ర్చు తగ్గుతుంది. ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు. ఇవి కాకుండా, ప్రజా ప్రయోజనాల కోసం అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 'రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు, 2024, సంబంధిత 'కేంద్రపాలిత చట్టాల (సవరణ) బిల్లు 2024', లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ, గత శీతాకాల సమావేశాల్లో దిగువ సభలో ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించేందుకు 39 మంది సభ్యులతో కూడిన పార్లమెంటు సంయుక్త కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, గత 75 ఏళ్లలో సాధించిన ప్రగతిని రాష్ట్రపతి ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో పేదరికం, ఆకలి చావులు ఉండేవని అన్నారు. 

46
rajpath

rajpath

పేద‌రికం, ఆక‌లిచావులు పోయాయి

"మా ఆత్మవిశ్వాసం ఎన్నడూ చలించలేదు, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి అవకాశం పొందగల అటువంటి పరిస్థితులను సృష్టించాలని మేము నిర్ణయించుకున్నామ‌ని తెలిపారు.  రైతులు, కార్మికుల సహకారాన్ని హైలైట్ చేస్తూ ప్రపంచ ఆర్థిక ధోరణులలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, ఈ పరివర్తనకు ఆధారం రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన ఫ్రేమ్‌వర్క్ అని రాష్ట్రపతి అన్నారు. 

ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా ఉన్న అధిక ఆర్థిక వృద్ధి రేటు ఉపాధి అవకాశాలను సృష్టించిందని, రైతులు, కార్మికుల ఆదాయాలను పెంచిందనీ, పెద్ద సంఖ్యలో ప్రజలను పేదరికం నుండి బయటపడేయడాన్ని చూశామ‌ని రాష్ట్రపతి ముర్ము హైలైట్ చేశారు. 

56
Asianet Image

సమ్మిళిత వృద్ధి, ప్ర‌జా సంక్షేమానికి ప్రాధాన్య‌త 

సమ్మిళిత వృద్ధి ప్రాముఖ్యతను, సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను నొక్కిచెప్పారు, పౌరులకు గృహాలు, స్వచ్ఛమైన త్రాగునీరు వంటి ప్రాథమిక అవసరాలకు భరోసా ఇచ్చారు. అణగారిన వర్గాలకు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) సహాయం అందించే ప్రయత్నాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. "షెడ్యూల్డ్ కులాల యువతకు ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, జాతీయ ఫెలోషిప్‌లు, విదేశీ స్కాలర్‌షిప్‌లు, హాస్టల్‌లు, కోచింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నార‌ని" తెలిపారు. 

ప్రధాన మంత్రి షెడ్యూల్డ్ కుల అభ్యుదయ యోజన ద్వారా, ఉపాధి, ఆదాయ అవకాశాలను సృష్టించడం ద్వారా షెడ్యూల్డ్ కులాల ప్రజల పేదరికం వేగంగా తగ్గించబడుతోంది. షెడ్యూల్డ్ తెగల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించబడ్డాయి, వాటిలో ధరి ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్, ప్రధాన మంత్రి గిరిజన గిరిజన న్యాయ మహా అభియాన్ - PM-జన్మాన్ ఉన్నాయి. రాష్ట్రపతి మాట్లాడుతూ.. విముక్త, సంచార, పాక్షిక సంచార వర్గాల కోసం 'అభివృద్ధి, సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేశామన్నారు.

66
<p>Matterhorn, Switzerland, Coronavirus, India Flag</p>

<p>Matterhorn, Switzerland, Coronavirus, India Flag</p>

మ‌హాకుంభ్.. మ‌న సంస్కృతిక వార‌స‌త్వం  

మహా కుంభ్ గురించి ప్రస్తావిస్తూ, "మన సాంస్కృతిక వారసత్వంతో మనకున్న అనుబంధం మరింత బలపడింది. ఈ సమయంలో నిర్వహించబడుతున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభ్ ఆ గొప్ప వారసత్వానికి ప్రభావవంతమైన వ్యక్తీకరణగా పరిగణించబడుతుంది. అనేక ప్రోత్సాహకరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని" రాష్ట్రపతి అన్నారు.

"సాంప్రదాయాలు, ఆచారాలను సంరక్షించడానికి - వాటిని కొత్త శక్తిని నింపడానికి సాంస్కృతిక రంగంలో రూపొందించబడింది, రాజ్యాంగం భారతదేశ ప్రజల సామూహిక గుర్తింపుకు ప్రాథమిక ఆధారం.. ఇది ప్రత్యేకమైనది. ఇది పౌరులందరినీ ఒక కుటుంబంలా కలుపుతుందని" తెలిపారు. 

రాజ్యాంగం నిర్దేశించిన ఫ్రేమ్‌వర్క్ లేకుండా నేడు భారతదేశంలో సంభవించిన సమగ్ర మార్పులు సాధ్యమయ్యేవి కాదని ఆయన అన్నారు. "భారత గణతంత్ర విలువలు మన రాజ్యాంగ సభ నిర్మాణంలో కూడా ప్రతిబింబిస్తాయి. ఆ సమావేశంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. అత్యంత గమనించదగ్గ విషయం ఏమిటంటే, రాజ్యాంగ సభలో సరోజినీ నాయుడు, యువరాణి అమృత్ కౌర్, సుచేతా కృపలానీ, హంసబెన్ మెహతా, మాల్తీ చౌదరి వంటి 15 మంది అసాధారణ మహిళలు కూడా ఉన్నారని" గుర్తుచేశారు. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
భారత దేశం
 
Recommended Stories
Top Stories