MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Puducherry: రా.. రమ్మంటోన్న పుదుచ్చేరి.. పాండీ మెలాంజ్ పేరుతో మ‌ర్చిపోలేని అనుభూతి

Puducherry: రా.. రమ్మంటోన్న పుదుచ్చేరి.. పాండీ మెలాంజ్ పేరుతో మ‌ర్చిపోలేని అనుభూతి

Puducherry: దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తున్న పుదుచ్చేరిలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పాండీ మెలాంజ్ పేరుతో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 17 2026, 04:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
‘పాండీ మెలాంజ్‌ 2027’ లోగో ఆవిష్కరణ
Image Credit : pondymelange

‘పాండీ మెలాంజ్‌ 2027’ లోగో ఆవిష్కరణ

పుదుచ్చేరిలోని గాంధీ తిడల్‌లో శుక్రవారం (అక్టోబర్ 16) నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్. రంగసామి ‘పాండీ మెలాంజ్‌ 2027’ అధికారిక లోగో, చిహ్నాన్ని ఆవిష్కరించారు. పుదుచ్చేరి పర్యాటక శాఖ, టెక్‌షాట్‌ (TEKSHOT) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా పాండీ మెలాంజ్‌ 2027 లక్ష్యాలు, భవిష్యత్తులో నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక ప్రచార వీడియోను పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విడుదల చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సంస్కృతి, సృజనాత్మకత, వేడుకలకు ప్రాధాన్యం
Image Credit : Pondy Melange

సంస్కృతి, సృజనాత్మకత, వేడుకలకు ప్రాధాన్యం

‘కల్చర్‌.. క్రియేటివిటీ.. సెలబ్రేషన్‌’ (సంస్కృతి.. సృజనాత్మకత.. వేడుకలు) అనే ప్రధాన ఇతివృత్తంతో పాండీ మెలాంజ్‌ కార్యక్రమాలను రూపొందించారు. ఇందులో కళలు, సంగీతం, ఫ్యాషన్‌, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, వారసత్వ సంపద, వినోదానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పుదుచ్చేరి ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు స్థానికంగా ఉన్న పర్యాటక ఆకర్షణలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

జనవరిలో విద్య, ఆధ్యాత్మికత, వైద్య రంగాలపై సదస్సులు

పాండీ మెలాంజ్‌ 2027లో భాగంగా జనవరిలో విద్య, ఆధ్యాత్మికత, వైద్య రంగాలకు సంబంధించిన సదస్సులను నిర్వహించనున్నారు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులు, వృత్తి నిపుణులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొంటారు. తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు ఆయా రంగాల్లోని ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాలు అడ్డాగా నిలవనున్నాయి.

34
ఫిబ్రవరిలో సంగీత కచేరీలు, అంతర్జాతీయ నృత్య ప్రదర్శనలు
Image Credit : Pondy Melange

ఫిబ్రవరిలో సంగీత కచేరీలు, అంతర్జాతీయ నృత్య ప్రదర్శనలు

జనవరిలో సదస్సులు ముగిసిన తర్వాత ఫిబ్రవరిలో వినోద కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యక్ష సంగీత కచేరీలు, అంతర్జాతీయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేలా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

44
పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం
Image Credit : Pondy Melange

పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

పుదుచ్చేరి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్న పర్యాటక ప్రాంతమని ముఖ్యమంత్రి ఎన్. రంగసామి తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద వేడుకల ద్వారా పర్యాటకుల సంఖ్యను మరింత పెంచవచ్చని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పర్యాటకుల రాక పెరిగి, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాండీ మెలాంజ్‌ 2027ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించి, పుదుచ్చేరిని ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలబెట్టడమే లక్ష్యమని వెల్లడించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Supreme Court: పిల్లల విషయంలో సుప్రీం కోర్టు చెప్పినట్లు జరుగుతుందా?
Recommended image2
తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఎల్‌కే అద్వానీ.. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం ఎలా ఉందంటే.?
Recommended image3
Diwali Bonus: పండుగ వేళ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. అకౌంట్లోకి రూ. 7000
Related Stories
Recommended image1
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఓసారి రైలు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి చాలు
Recommended image2
ATM పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుంది? దీని వెనుకున్న‌ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved