MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ATM పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుంది? దీని వెనుకున్న‌ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా?

ATM పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుంది? దీని వెనుకున్న‌ ఆసక్తికరమైన కథ ఏంటో తెలుసా?

ATM PIN: ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ ఏటీఎం కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే ఏటీఎంలో డబ్బులు తీసుకునే సమయంలో మనం 4 అంకెల పిన్ నంబర్‌ను నమోదు చేస్తాం. అసలు ఈ పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.?

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 17 2026, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలో మొదటి ఏటీఎం ఎక్కడ ప్రారంభమైంది?
Image Credit : Gemini AI

ప్రపంచంలో మొదటి ఏటీఎం ఎక్కడ ప్రారంభమైంది?

ప్రస్తుతం బ్యాంకింగ్ సేవల్లో ఏటీఎంలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఒకప్పుడు డబ్బులు తీసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత డబ్బులు అవసరమైతే ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారంగా ఏటీఎం ఆలోచన తెరపైకి వచ్చింది. ప్రపంచంలో తొలి ఏటీఎంను స్కాట్లాండ్‌కు చెందిన జాన్ షెపర్డ్‌-బారన్ రూపొందించారు. 1967 జూన్ 27న లండన్‌లోని ఎన్ఫీల్డ్ ప్రాంతంలో బార్క్లేస్ బ్యాంకు శాఖ వెలుపల ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది బ్యాంకింగ్ రంగంలో ఒక కొత్త ఆవిష్కరణగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చాక్లెట్ వెండింగ్ మెషీన్ చూసి ఏటీఎం ఆలోచన
Image Credit : Asianet News

చాక్లెట్ వెండింగ్ మెషీన్ చూసి ఏటీఎం ఆలోచన

జాన్ షెపర్డ్‌-బారన్‌కు ఏటీఎం ఆలోచన రావడం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఒకరోజు బ్యాంకు మూసివేసి ఉండటంతో ఆయన డబ్బులు తీసుకోలేకపోయారు. అదే సమయంలో చాక్లెట్లు విక్రయించే వెండింగ్ మెషీన్ల గురించి ఆయన ఆలోచించారు. ఒక యంత్రం ద్వారా చాక్లెట్లు పొందగలిగినప్పుడు, అదే తరహాలో మరో యంత్రం ద్వారా డబ్బులు ఎందుకు తీసుకోకూడదని ఆయనకు అనిపించింది. ఈ ఆలోచనే ఏటీఎం రూపకల్పనకు ప్రేరణనిచ్చింది. అయితే యంత్రం నుంచి డబ్బులు తీసుకునే వ్యక్తి అసలైన కస్టమరేనని ఎలా గుర్తించాలనే ప్రశ్న ఎదురైంది. దీనికి పరిష్కారంగా వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (Personal Identification Number - PIN) విధానాన్ని రూపొందించారు.

35
మొదట 6 అంకెల పిన్‌ అనుకున్నారు!
Image Credit : Getty

మొదట 6 అంకెల పిన్‌ అనుకున్నారు!

ఏటీఎం పిన్‌ను రూపొందించే సమయంలో జాన్ షెపర్డ్‌-బారన్ మొదట 6 అంకెల నంబర్‌ను ఉపయోగించాలని భావించారు. ఆయన సైన్యంలో పనిచేసిన అనుభవం ఉండటంతో, తన సైనిక గుర్తింపు సంఖ్య తరహాలో 6 అంకెల పిన్‌ను ఎంచుకోవాలనుకున్నారు. ఎక్కువ అంకెలు ఉంటే పిన్‌ను ఇతరులు ఊహించడం కష్టమవుతుందని ఆయన భావించారు. అందువల్ల 6 అంకెల పిన్‌తో భద్రతను పెంచవచ్చని అనుకున్నారు. అయితే ఈ నిర్ణయం అమలు చేసే సమయంలో ఆయనకు ఒక సమస్య ఎదురైంది. ఆరు అంకెలను గుర్తుంచుకోవడం అందరికీ సులభం కాకపోవచ్చని ఆయన గుర్తించారు. దీంతో పిన్ నంబర్ విషయంలో తన ఆలోచనను మార్చుకోవాల్సి వచ్చింది.

45
భార్య సూచనతో 4 అంకెల పిన్‌గా మార్పు
Image Credit : Getty

భార్య సూచనతో 4 అంకెల పిన్‌గా మార్పు

జాన్ షెపర్డ్‌-బారన్ తన భార్య కరోలిన్‌కు 6 అంకెల పిన్‌ను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించమని చెప్పారట. అయితే ఆమె తనకు సులభంగా గుర్తుండేవి 4 అంకెలు మాత్రమేనని, అంతకంటే ఎక్కువ అంకెలను గుర్తుంచుకోవడం కష్టమని చెప్పినట్లు ప‌లు క‌థ‌నాలు చెబుతున్నాయి. దీంతో ఆయన పిన్‌ను 6 అంకెల నుంచి 4 అంకెలకు మార్చాలని నిర్ణయించుకున్నారు. వినియోగదారులకు సులభంగా గుర్తుండేలా ఉండటమే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశమ‌ని చెబుతారు. తర్వాత ఏటీఎంల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరగడంతో 4 అంకెల పిన్ విధానం కూడా విస్తరించింది. అయితే అన్ని బ్యాంకులు, అన్ని దేశాల్లోనూ ఇదే విధానం తప్పనిసరిగా అమల్లో ఉందని చెప్పలేం. కొన్ని బ్యాంకింగ్ వ్యవస్థలు ఎక్కువ అంకెల పిన్‌లను కూడా అనుమతిస్తాయి.

55
4 అంకెల పిన్ ఎంతవరకు సురక్షితం?
Image Credit : Getty

4 అంకెల పిన్ ఎంతవరకు సురక్షితం?

నాలుగు అంకెల పిన్‌ను గుర్తుంచుకోవడం సులభమే. అయితే భద్రత పరంగా చూస్తే, ఇందులో మొత్తం 10,000 రకాల కలయికలు మాత్రమే సాధ్యమవుతాయి. అంటే 0000 నుంచి 9999 వరకు పిన్‌లు ఉండవచ్చు. అదే పిన్ 6 అంకెలతో ఉంటే మొత్తం 10 లక్షల కలయికలు సాధ్యమవుతాయి. దీంతో పిన్‌ను ఊహించడం మరింత కష్టమవుతుంది. అయితే పిన్ అంకెల సంఖ్య మాత్రమే భద్రతను నిర్ణయించదు. బ్యాంకు విధించే పరిమితులు, కార్డు భద్రతా వ్యవస్థలు, ఇతర రక్షణ చర్యలు కూడా కీలకమే.

సాధారణంగా ఏటీఎంలో వరుసగా తప్పు పిన్‌లు నమోదు చేస్తే బ్యాంకు భద్రతా నియమాలను బట్టి లావాదేవీలు నిలిపివేయవచ్చు లేదా కార్డును తాత్కాలికంగా బ్లాక్ చేయవచ్చు. మొత్తంగా చూస్తే.. ఏటీఎం పిన్ 4 అంకెలుగా ప్రాచుర్యంలోకి రావడానికి సులభంగా గుర్తుంచుకోవాలనే ఆలోచన కూడా ఒక కారణంగా చెబుతారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 
2nd TEST • SA vs AUS
Stumps
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 4
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
1st T20 • NZ vs IND 2026
NZNZ
Thu, 22 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: షాకింగ్ న్యూస్.. రూ.1లక్ష కంటే తక్కువకు పడిపోనున్న బంగారం ధరలు
Recommended image2
Jio Platforms IPO: జియో ఐపీఓపై ఎందుకింత క్రేజ్? అసలు కారణాలు ఏంటో తెలుసా?
Recommended image3
Jio IPO: 100 నిమిషాల్లో ఖాళీ అయిన జియో ఐపీఓ.. అసలు ఎవరు కొంటున్నారో తెలుసా? షాకింగ్ నిజాలు
Related Stories
Recommended image1
Railway: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండే ఈ పసుపు గీత అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
ఉన్నదాంతో తృప్తి చెందకపోతే.. ఉన్నది కూడా పోతుంది. జీవిత సత్యాన్ని చాటే గొప్ప కథ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved