సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
మహారాష్ట్రలో పలు కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పాల్గొంటారు. దేశంలో సముద్రంపై అతి పొడవైన వంతెనను మోడీ ప్రారంభిస్తారు.
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
దేశంలో సముద్రంపై అతి పొడవైన అటల్ సేతు బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి ద్వారా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాలకు కూడ ప్రయాణించే సమయం కూడ తక్కువ కానుంది. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ స్మారకార్ధం ఈ బ్రిడ్జికి అటల్ సేతుగా నామకరణం చేశారు.
also read:అయోధ్య రామ మందిరం: 11 రోజుల క్రతువును ప్రారంభించనున్న మోడీ
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
ప్రధానంగా ముంబై నగరంలోని ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణించే సాధారణ ప్రయాణీకుల కష్టాలు తీర్చనుంది. అటల్ సేతు బ్రిడ్జి పొడవు 21.8 కి.మీ. ఆరు లేన్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఇది సముద్రంలో 16.5 కి.మీ. భూమిపై 5.5 కి.మీ. పొడవు ఉంటుంది. భారత దేశంలో సముద్రంపై ఉన్న అత్యంత పొడవైన వంతెన ఇదే.
also read:లావుకు మద్దతుగా జగన్ వద్దకు: మార్చొద్దని కోరుతున్న నలుగురు ఎమ్మెల్యేలు
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణ సమయం కూడ గణనీయంగా తగ్గనుంది.ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం మధ్య ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుంది. అటల్ సేతుపై ప్రయాణం చేస్తే 20 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. అంతేకాదు నిరంతరం ట్రాఫిక్ జామ్ ల నుండి ఉపశమనం కలగనుంది. ఈ వంతెనపై 100 కి.మీ. వేగంతో ప్రయాణం చేయవచ్చు.
also read:ఎస్బీఐ బ్యాంకులోకి ఎద్దు: ఏం చేసిందంటే...వీడియో వైరల్
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
ఎంఎంఆర్డీఏ, జేఐసీఏ నిర్వహించిన అధ్యయనం మేరకు ఎంటీహెచ్ఎల్ సెర్వీ, చిర్లే మధ్య ప్రయాణం 61 నిమిషాల నుండి 16 నిమిషాలకు తగ్గనుంది.ప్రతి రోజూ కనీసం 40 వేల వాహనాలు ఈ బ్రిడ్జిపై నుండి ప్రయాణించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
also read:వైఎస్ఆర్సీపీ టిక్కెట్టు నిరాకరణ: పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బలప్రదర్శన
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
పుణె, అలిబాగ్, గోవా, పన్వేల్ లను కూడ కలిపేందుకు ఈ బ్రిడ్జి దోహద పడుతుంది. నవీ ముంబైలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై పుణె ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవే ల మధ్య ఈ బ్రిడ్జి కనెక్టివిటిని గణనీయంగా మెరుగుపర్చనుంది.
also read:సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
ముంబైని ప్రధాన భూభాగానికి కలిపే బే క్రాసింగ్ ఆలోచనను 1963లో అమెరికన్ కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ సంస్థ విల్బర్ స్మిత్ అసోసియేట్స్ తొలిసారిగా రూపొందించింది.ఆ తర్వాత ఈ ప్రతిపాదనలో ఎలాంటి కదలిక రాలేదు. అయితే 1990లో ఈ ప్రణాళిక పునరుద్దరించబడింది. 2006లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచారు.
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
2008 ఫిబ్రవరిలో అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా 11 నెలల్లో రూ. 6 వేల కోట్ల బ్రిడ్జి నిర్మాణానికి ముందుకు వచ్చింది. అయితే కొన్ని నెలల తర్వాత ఈ ప్రాజెక్టు నుండి అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ తప్పుకుంది. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుండి ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీకి మార్చారు.
also read:మెత్తబడని మాజీ మంత్రి: తెలుగుదేశంలోకి మాజీ మంత్రి పార్థసారథి?
సముద్రంపై అతి పొడవైన బ్రిడ్జి: అటల్ సేతు విశేషాలివీ....
జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీ (జేఐసీఏ)తో ఎంఎంఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2017 డిసెంబర్ లో టెండరింగ్ పూర్తైంది. 2018లో ఈ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 21, 200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ. 15, 100 జైకా నుండి రుణం తీసుకున్నారు.
also read:ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్