నరసరావుపేట ఎంపీ టిక్కెట్టు  లావు కృష్ణదేవరాయలును గుంటూరు నుండి పోటీ చేయాలని   జగన్ కోరుతున్నారు. కానీ,ఇందుకు  కృష్ణదేవరాయలు ఆసక్తిగా లేరు.

గుంటూరు: ఎంపీ లావు కృష్ణదేవరాయలును వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి తిరిగి పోటీ చేయించాలని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

also read:సీఎంఓకు క్యూ: వైఎస్ఆర్‌సీపీ మూడో జాబితాపై జగన్ కసరత్తు

2019 పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట స్థానం లావు కృష్ణదేవరాయలును వైఎస్ఆర్‌సీపీ బరిలోకి దింపింది.వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చుతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలును గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. అయితే గుంటూరు నుండి పోటీ చేయడానికి లావు కృష్ణదేవరాయలు ఆసక్తిగా లేరు. ఇదే విషయాన్ని సీఎం జగన్ కు కూడ స్పష్టం చేశారు.

also read:సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు

లావు కృష్ణదేవరాయలుకే నరసరావుపేట ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని నలుగురు ఎమ్మెల్యేలు కూడ కోరుతున్నారు. గురువారంనాడు సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి
 గురజాల , మాచర్ల, , పెదకూరపాడు, నరసరావుపేట ఎమ్మెల్యేలు వచ్చారు. కృష్ణదేవరాయలుకే ఎంపీ టిక్కెట్టు కేటాయించాలని సీఎంను కోరనున్నారు. అయితే ఈ విషయమై సీఎం జగన్ నలుగురు ఎమ్మెల్యేలకు నచ్చచెబుతారా, లేక ఎమ్మెల్యేలు చెప్పే విషయాలను విని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

also read:వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు నిరాకరణ: పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు బలప్రదర్శన

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కమ్మ సామాజిక ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున లావు కృష్ణ దేవరాయలును అక్కడి నుండి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. అయితే ఇందుకు కృష్ణదేవరాయలు ఆసక్తిగా లేరు. తన అభిప్రాయాన్ని కూడ ఆయన జగన్ కు తేల్చి చెప్పారు.