సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు
తెలుగు దేశం పార్టీ సంక్రాంతికి తొలి జాబితాను విడుదల చేయనుంది. పలు రకాల సర్వేల ఆధారంగా ఈ జాబితాపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
అమరావతి: తెలుగు దేశం పార్టీ 20 నుండి 25 మందితో తొలి జాబితాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తుంది. ఈ జాబితాలో వివాదాలకు తావులేని స్థానాలకు చోటు దక్కనుంది.ఇప్పటికే 90 స్థానాల్లో అభ్యర్ధులను చంద్రబాబు ఖరారు చేశారు.
ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అయితే ఈ 90 స్థానాల్లో 20 నుండి 25 మందితో తొలి జాబితాను తెలుగు దేశం పార్టీ ప్రకటించనుంది. సంక్రాంతికి ఈ జాబితాను విడుదల చేయాలని తెలుగు దేశం పార్టీ నాయకత్వం భావిస్తుంది.
also read:ముద్రగడ ఇంటికి ప్రధాన పార్టీల నేతల క్యూ: పద్మనాభం పయనమెటు?
పార్టీ శ్రేణులు, పార్టీ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్తలు ఇచ్చిన నివేదికలు ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా ఈ అభ్యర్ధుల జాబితాపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితాలో ఎక్కువ మంది గతంలో టిక్కెట్లు దక్కినవారే ఉండే అవకాశం ఉంది. వివాదాలు లేని స్థానాలే ఈ జాబితాలో ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తెలుగు దేశం, జనసేన కూటమిగా పోటీ చేయనున్నాయి. రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం,జనసేన పార్టీల కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేది సంక్రాంతి తర్వాత స్పష్టత రానుంది. పొత్తులపై బీజేపీ రాష్ట్ర నాయకుల నుండి సేకరించిన అభిప్రాయాలను ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి పంపారు.ఈ విషయమై పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.
also read:సీఎంఓకు క్యూ: వైఎస్ఆర్‌సీపీ మూడో జాబితాపై జగన్ కసరత్తు
తెలుగు దేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటుపై చర్చలు సాగుతున్నాయి. జనసేన పోటీ చేసే స్థానాలను మినహయించి ఇతర స్థానాల్లో అభ్యర్ధులను తెలుగు దేశం ప్రకటించనుంది.
also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 90 మంది పేర్లను ప్రకటిస్తారని తొలుత ప్రచారం సాగింది. అయితే కేవలం 20 నుండి 25 మందితోనే తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం.పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే స్థానాల విషయమై స్పష్టత వచ్చిన తర్వాత ఇతర స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు.