Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామ మందిరం: 11 రోజుల క్రతువును ప్రారంభించనున్న మోడీ

అయోధ్యలో  రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని  ఇవాళ్టి నుండి  11 రోజుల పాటు ప్రత్యేక క్రతువును ప్రారంభించనున్నట్టుగా మోడీ ప్రకటించారు. 

 ayodhya ram temple inauguration: prime ministernarendra modi released audio message lns
Author
First Published Jan 12, 2024, 10:09 AM IST


న్యూఢిల్లీ:  ఈ నెల 22వ తేదీన  అయోధ్యలో  రామమందిర ప్రాణ ప్రతిష్ట జరగనుంది.  రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇవాళ్టి నుండి  11 రోజుల క్రతువును ప్రారంభించనున్నట్టుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.ఈ మేరకు  సోషల్ మీడియాలో ఆడియో సందేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. 

అయోధ్యలో  రామలల్లాకు శంకుస్థాపన జరగడానికి ఇంకా 11 రోజులు మాత్రమే  మిగిలి ఉంది.  ఈ 11 రోజుల పాటు  ప్రత్యేక క్రతువును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మోడీ ప్రకటించారు. ఇందుకు గాను మీ ఆశీర్వాదాలు కోరుతున్నట్టుగా మోడీ చెప్పారు.

ఈ ఆడియోలో మోడీ ఏం చెప్పారంటే

నా ప్రియమైన దేశ ప్రజలారా జీవితంలో కొన్ని క్షణాలు దైవానుగ్రహం వల్లే వాస్తవాలుగా మారుతాయన్నారు.  రామ మందిర ప్రాణ ప్రతిష్ట  దేశ ప్రజలందరికి శుభ దినంగా పేర్కొన్నారు.  చారిత్రాత్మకమైన జనవరి  22 కోసం  ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు.  అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి  ఇంకా  11 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా ఆయన పేర్కొన్నారు.  ఇది తనకు  ఊహించలేని అనుభవాల సమయంగా ఆయన పేర్కొన్నారు.  తన జీవితంలో తొలిసారిగా భావోద్వేగానికి గురౌతున్నట్టుగా  చెప్పారు.

 

తన అంతరంగంలో సాగే ఈ భావోద్వేగ ప్రయాణం భావవ్యక్తీకరణకు  అవకాశం కాదు, అనుభవానికి అవకాశంగా ప్రధాని పేర్కొన్నారు.  చాలా తరాల వారి హృదయాల్లో  ఏళ్ల తరబడి జీవించిన కల ఓ తీర్మానం ఉందన్నారు.  అది నెరవేరే సమయానికి తాను  అక్కడే ఉండడం తన అదృష్టంగా మోడీ పేర్కొన్నారు.  ఈ సమయంలో భారతదేశ ప్రజలకు తాను ప్రాతినిథ్యం వహించే సాధనంగా చేశాడన్నారు.

పవిత్ర గ్రంధాల్లో  ఉపవాసాలు, కఠిన నియమాలు నిర్ధేశించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఈ మేరకు తాను ఇవాళ్టి నుండి  11 రోజుల పాటు  ప్రత్యేక కర్మను ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios