MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Bank Holidays : ఈ శనివారం బ్యాంకులకు సెలవుందా? రేపట్నుంచి వరుసగా మూడ్రోజులు సెలవేనా?

Bank Holidays : ఈ శనివారం బ్యాంకులకు సెలవుందా? రేపట్నుంచి వరుసగా మూడ్రోజులు సెలవేనా?

అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 3 శనివారం, అక్టోబర్ 4 ఆదివారం… వరుసగా మూడ్రోజులు బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే ఈ శనివారం బ్యాంకులకు సెలవుందా?

4 Min read
Author : Arun Kumar P
Published : Oct 01 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రతి శనివారం బ్యాంకులకు సెలవేనా?
Image Credit : ChatGPT

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవేనా?

Bank Holidays : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయని, ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించినట్లుగా కనిపిస్తున్న ఓ గెజిట్ నోటిఫికేషన్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. దీంతో అక్టోబర్ నుంచి బ్యాంకుల పని విధానంలో మార్పులు వచ్చేశాయా? ఈ శనివారం బ్యాంకులు తెరుచుకుంటాయా? లేదా? అనే సందేహాలు కస్టమర్లలో మొదలయ్యాయి.

అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని PIB Fact Check వెల్లడించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గెజిట్ నోటిఫికేషన్ నకిలీదని స్పష్టం చేసింది. కాబట్టి ప్రస్తుతానికి బ్యాంకుల సెలవుల విషయంలో ఎలాంటి కొత్త మార్పు లేదని గుర్తుంచుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలు సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతోంది?
Image Credit : ANI

అసలు సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతోంది?

బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయాలని.. శని, ఆదివారాలు వారాంతపు సెలవులుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ఇటీవల ఈ డిమాండ్‌పై బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె నిర్వహించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) నిర్ణయించింది.. అయితే ఈ డిమాండ్ పై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవడంతో సమ్మె వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల బ్యాంకింగ్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

ప్రతి శనివారం సెలవు అంటూ ఫేక్ గెజిట్

ఇలా కేంద్ర ఆర్థిక శాఖ పేరుతో ఓ పేక్ గెజిట్ నోటిఫికేషన్ వైరల్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇకపై ప్రతి శనివారం సెలవు ఉంటుందని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ ఉత్తర్వులా కనిపించేలా రూపొందించిన ఈ పత్రాన్ని చూసి చాలామంది ఇది నిజమైన గెజిట్ అని భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగుల ఐదు రోజుల పని వారంపై డిమాండ్, తాజాగా జరిగిన సమ్మె నేపథ్యంలో ఈ ప్రచారం మరింత నమ్మదగినదిగా కనిపించింది. కానీ ఇందులో వాస్తవం లేదు.

PIB Fact Check ఏం చెప్పింది?

వైరల్ అవుతున్న గెజిట్ నోటిఫికేషన్‌ను PIB Fact Check నకిలీదిగా తేల్చింది. ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని స్పష్టం చేసింది. అంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్న గెజిట్‌ను ఆధారంగా చేసుకుని బ్యాంకుల పని విధానంలో మార్పు వచ్చిందని భావించకూడదు.

అక్టోబర్ నుండి బ్యాంక్ ఉద్యోగులకు వారానికి రెండ్రోజుల సెలవుల విధానం అమలు అవుతుందనే ప్రచారం సాగుతోంది. అంటే ఈ వారాంతం వరుసగా మూడ్రోజులు (అక్టోబర్ 2,3,4) బ్యాంకులకు సెలవు అనే ప్రచారం సాగుతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 3న శనివారం, అక్టోబర్ 4 ఆదివారం సెలవులు ఉంటాయంటున్నారు.... కానీ అక్టోబర్ 3న బ్యాంకులు యదావిధిగా నడుస్తాయి... శనివారం సెలవు లేదని PIB Fact Check స్పష్టం చేసింది.

A Gazette circulating on social media , purportedly issued by the Ministry of Finance (Department of Financial Services), claims that the Central Government has declared every Saturday a public holiday for all Public Sector Banks , including SBI.#PIBFactCheck:

❌ The document… pic.twitter.com/ClCqEt2UAX

— PIB Fact Check (@PIBFactCheck) October 1, 2026

34
బ్యాంకుల సమ్మె ఎందుకు?
Image Credit : GEMINI

బ్యాంకుల సమ్మె ఎందుకు?

వారానికి ఐదు రోజుల పని విధానం బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. ప్రస్తుతం నెలలో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు. మిగతా శనివారాల్లో సాధారణంగా బ్యాంకు శాఖలు పనిచేస్తాయి. ఈ శనివారాలు కూడా సెలవు ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగులు కోరుతున్నారు. మొత్తంలో నెలలో ప్రతి శని, ఆదివారం సెలవు కావాలని కోరుతున్నారన్నమాట. దీనితో పాటు పెన్షన్ సంబంధిత అంశాలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) తదితర సమస్యలను కూడా బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ప్రస్తావించాయి.

సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. ఐదు రోజుల బ్యాంకింగ్‌పై, శనివారం సెలవుల అంశాన్ని పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. దీంతో UFBU మూడు రోజుల సమ్మెను వాయిదా వేసింది. ఫలితంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు శాఖలు సమ్మె కారణంగా మూసివేయాల్సిన పరిస్థితి తప్పింది.

ప్రస్తుతం బ్యాంకులకు శనివారం సెలవులు ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం నెలలో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగతా శనివారాలు సాధారణంగా బ్యాంకులు పనిచేస్తాయి. అంటే మొదటి, మూడో శనివారాలు సాధారణ పని దినాలుగా ఉంటాయి. ఐదో శనివారం ఉన్న నెలల్లో ఆ రోజు కూడా బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. ఈ విధానంలో మార్పు రావాలంటే సంబంధిత అధికారిక నిర్ణయం, నోటిఫికేషన్ అవసరం.

44
ఐదు రోజుల బ్యాంకింగ్ సేవల సంగతేంటి..?
Image Credit : ANI

ఐదు రోజుల బ్యాంకింగ్ సేవల సంగతేంటి..?

ఇదే ఇప్పుడు అందరి ముందున్న అసలు ప్రశ్న. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఐదు రోజుల పని వారాన్ని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. 2024లో జరిగిన బ్యాంకింగ్ రంగంలోని ద్వైపాక్షిక ఒప్పంద ప్రక్రియలో కూడా అన్ని శనివారాలను సెలవులుగా మార్చే అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే దానిని అమలు చేయడానికి ప్రభుత్వ ఆమోదం అవసరం.

తాజా చర్చల తర్వాత IBA, UFBU కలిసి ఉన్నతస్థాయి కమిటీ ద్వారా మిగిలిన శనివారాల సెలవు అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించాయి. కానీ ఇది ఇప్పటికే ఐదు రోజుల బ్యాంకింగ్ వారం అమల్లోకి వచ్చిందని అర్థం కాదు. ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుత విధానమే కొనసాగుతుంది.

కస్టమర్లు ఏం గుర్తుంచుకోవాలి?

ప్రస్తుతం బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు వచ్చిందనే వార్తను నమ్మాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గెజిట్‌ను చూసి బ్యాంకు పని దినాల గురించి నిర్ణయం తీసుకోవడం సరికాదు. బ్యాంకుకు వెళ్లాల్సినప్పుడు సంబంధిత బ్యాంకు శాఖ పని దినాన్ని ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది. సెలవులు, శాఖల పని వేళలకు సంబంధించిన తాజా సమాచారాన్ని బ్యాంకు అధికారిక వెబ్‌సైట్, RBI లేదా కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటనల ద్వారా నిర్ధారించుకోవచ్చు.

అందువల్ల “ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు” అనే ప్రచారం ప్రస్తుతం నిజం కాదు. ఐదు రోజుల బ్యాంకింగ్ వారంపై ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రం కొనసాగుతోంది. ఈ అంశంపై భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే అధికారిక నిర్ణయం మాత్రమే తుది మార్పును నిర్ధారిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi: కీలక నిర్ణయాలను ఆమోదించిన కేంద్ర కేబినెట్.. వారికి గుడ్ న్యూస్
Recommended image2
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 16 రోజులు హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Recommended image3
Kalki Bhagavan: ఎల్‌ఐసీ క్లర్క్ నుంచి రూ. 200 కోట్ల ఏకం సామ్రాజ్యం వరకు.. కల్కి భగవాన్ సంచలన లైఫ్ స్టోరీ ఇది
Related Stories
Recommended image1
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 16 రోజులు హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Recommended image2
Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అక్టోబ‌ర్ 1 నుంచి మ‌నీ విత్‌డ్రాపై ఛార్జీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved