MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్

Post Office Scheme: చిన్న మొత్తాల పొదుపుతో ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ అందిచే 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒక అద్భుతమైన అవకాశం. మీరు రోజుకు కేవలం ₹300 చొప్పున పక్కనబెడితే మీ చేతికి ₹6.42 లక్షలు వస్తాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 05 2026, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పోస్ట్ ఆఫీస్ సూపర్‌ స్కీమ్.. నెలకు రూ. 9000 పొదుపుతో లక్షల్లో లాభం
Image Credit : Chatgpt

పోస్ట్ ఆఫీస్ సూపర్‌ స్కీమ్.. నెలకు రూ. 9000 పొదుపుతో లక్షల్లో లాభం

ప్రతి నెలా చేసే చిన్న చిన్న పొదుపులే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఉపయోగపడతాయి. మీరు సరైన చోట పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాలలో మంచి ఫండ్ సిద్ధమవుతుంది. మీరు రోజుకు దాదాపు ₹300 పొదుపు చేయగలిగితే, అది నెలకు దాదాపు ₹9,000 అవుతుంది. ఈ డబ్బును పోస్ట్ ఆఫీస్ (Post office) 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో జమ చేయడం ద్వారా మెచ్యూరిటీ నాటికి దాదాపు ₹6.42 లక్షల పెద్ద నిధిని తయారు చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
5 ఏళ్లలో ఎంత జమ అవుతుంది?
Image Credit : Asianet News

5 ఏళ్లలో ఎంత జమ అవుతుంది?

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీలో ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5 ఏళ్ల పోస్ట్ ఆఫీస్ ఆర్డీపై ఏడాదికి 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో వడ్డీ ప్రతి త్రైమాసికంలో కాంపౌండింగ్ రూపంలో లెక్కిస్తారు.

మీరు ప్రతి నెలా ₹9,000 జమ చేస్తే, క్యాలిక్యులేషన్ ఈ క్రింది విధంగా ఉంటుంది:

• నెల డిపాజిట్: ₹9,000

• కాలపరిమితి: 5 సంవత్సరాలు (60 నెలలు)

• మొత్తం జమ: ₹9,000 × 60 = ₹5,40,000

• వడ్డీ రేటు: ఏటా 6.7%

• అంచనా వడ్డీ: దాదాపు ₹1,02,292

• మెచ్యూరిటీ మొత్తం: దాదాపు ₹6,42,292

అంటే 5 ఏళ్లలో మీరు డిపాజిట్ చేసిన సొంత డబ్బు ₹5.40 లక్షలు కాగా, దానికి వడ్డీ రూపంలో దాదాపు ₹1.02 లక్షలు జతవుతాయి.

35
రోజుకు ₹300 పొదుపు చేయడం అంటే ఏమిటి?
Image Credit : iSTOCK

రోజుకు ₹300 పొదుపు చేయడం అంటే ఏమిటి?

రోజుకు ₹300 చొప్పున పొదుపు చేయడాన్ని నెలవారీగా చూస్తే అది దాదాపు ₹9,000 అవుతుంది. అయితే ఆర్డీలో డబ్బును ప్రతిరోజూ జమ చేయరు. ఒక నిర్ణీత నెలవారీ వాయిదా రూపంలో మాత్రమే జమ చేస్తారు. కాబట్టి రోజుకు ₹300 ఆదా చేయడమే మీ లక్ష్యం అయితే, మీరు ప్రతి నెలా ₹9,000 పక్కన పెట్టి ఆర్డీ వాయిదా చెల్లించవచ్చు.

45
ఎంత మొత్తంతో ప్రారంభించవచ్చు?
Image Credit : Chatgpt

ఎంత మొత్తంతో ప్రారంభించవచ్చు?

పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో చాలా తక్కువ మొత్తంతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఆర్డీలో నెలకు కనీసం ₹100 డిపాజిట్ చేయవచ్చు. ఆ తర్వాత డబ్బును ₹10 రూపాయలతో కూడా పెంచుకుంటూ వెళ్లవచ్చు. ఇందులో గరిష్ఠ డిపాజిట్‌కు ఎలాంటి పరిమితి లేదు. ఈ పథకం సాధారణ కాలపరిమితి 5 సంవత్సరాలు. అవసరమైతే దీనిని మరింత పొడిగించే వెసులుబాటు కూడా ఉంది.

55
డబ్బుకు భద్రత.. షరతులు వర్తిస్తాయి
Image Credit : Getty

డబ్బుకు భద్రత.. షరతులు వర్తిస్తాయి

పోస్ట్ ఆఫీస్ ఆర్డీ అనేది ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలలో ఒక భాగం. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. మార్కెట్ రిస్క్ లేకుండా ఖచ్చితమైన వడ్డీ, క్రమబద్ధమైన పొదుపు కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

అయితే, 6.7 శాతం వడ్డీ రేటు శాశ్వతంగా స్థిరంగా ఉండదని గుర్తుంచుకోండి. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తుంది. కాబట్టి కొత్త ఖాతా తెరిచే సమయంలో అమలులో ఉన్న ప్రస్తుత వడ్డీ రేటును సరిచూసుకోవడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? సింపుల్‌గా సిబిల్ స్కోర్ పెంచుకునే 6 సీక్రెట్ ట్రిక్స్ మీకోసం
Recommended image2
LPG Subsidy: గ్యాస్ సిలిండర్ పై కేంద్రం సబ్సిడీ.. ఇక ప్రతి నెల డబ్బులు ఆదా చేసుకోవచ్చు
Recommended image3
Today Gold Price: తులం బంగారం మళ్లీ రూ.లక్షకు దిగొస్తుందా? ఇప్పుడు కొనడం లాభమేనా?
Related Stories
Recommended image1
Andhra's Goa: గోవా దాకా ఎందుకు? మన దగ్గరే 'ఆంధ్రా గోవా'.. ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? సింపుల్‌గా సిబిల్ స్కోర్ పెంచుకునే 6 సీక్రెట్ ట్రిక్స్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved