MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • PM SYM Scheme : ప్రభుత్వ బంపర్ ఆఫర్.. నెలకు రూ. 55 కడితే చాలు.. ప్రతి నెలా మీ అకౌంట్‌లోకి రూ. 3000

PM SYM Scheme : ప్రభుత్వ బంపర్ ఆఫర్.. నెలకు రూ. 55 కడితే చాలు.. ప్రతి నెలా మీ అకౌంట్‌లోకి రూ. 3000

PM Shram Yogi Maandhan Yojana : అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారుల కోసం కేంద్రం ప్రధాని శ్రమ యోగి మాన్‌ధన్ యోజనను అందిస్తోంది. నెలకు చాలా తక్కువ మొత్తంతో జమచేయడంతో 60 ఏళ్ల తర్వాత రూ. 3000 పింఛను పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 10 2026, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన: అసంఘటిత కార్మికులకు ఒక వరం
Image Credit : Gemini

శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన: అసంఘటిత కార్మికులకు ఒక వరం

దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు, చిరు వ్యాపారులు ప్రతిరోజూ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటారు. అయితే, వయసు మళ్లిన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? సంపాదన లేక, శరీరం సహకరించక ఇబ్బంది పడే వృద్ధులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌ యోజన (PM SYM), ఎన్పీఎస్ ట్రేడర్స్ (NPS Traders) పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా నెలకు కేవలం రూ. 55 నుంచి రూ. 200 వరకు పొదుపు చేయడం ద్వారా, 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ. 3,000 గ్యారెంటీ పింఛను పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
PM SYM Scheme : ఎవరెవరు ఈ పథకానికి అర్హులు?
Image Credit : Gemini

PM SYM Scheme : ఎవరెవరు ఈ పథకానికి అర్హులు?

ఈ పథకం ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కార్మికుల కోసం తీసుకొచ్చారు.

• వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు మాత్రమే చేరాలి.

• ఆదాయం: నెలకు రూ. 15,000 కంటే తక్కువ సంపాదన ఉండాలి.

• నిబంధన: ఈపీఎఫ్ (EPF), ఈఎస్ఐ (ESI) లేదా ఇతర ప్రభుత్వ పింఛను పథకాలు పొందుతున్న వారు దీనికి అనర్హులు. అలాగే, ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా ఈ పథకంలో చేరలేరు.

Related Articles

Related image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Related image2
Top 10 IITs in India: ఇండియాలో నంబర్ వన్ ఐఐటీ ఏది? టాప్ 10 లిస్ట్ ఇదే
36
PM SYM Scheme : ఎంత జమ చేయాలి? కేంద్రం వాటా ఎంత?
Image Credit : Asianet News

PM SYM Scheme : ఎంత జమ చేయాలి? కేంద్రం వాటా ఎంత?

మీరు చెల్లించే ప్రీమియం మీ వయసుపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత సొమ్ము చెల్లిస్తారో, కేంద్ర ప్రభుత్వం కూడా మీ ఖాతాలో అంతే మొత్తాన్ని జమ చేస్తుంది.

• 18 ఏళ్ల వయసులో చేరితే: నెలకు కేవలం రూ. 55.

• 30 ఏళ్ల వయసులో చేరితే: నెలకు రూ. 105.

• 40 ఏళ్ల వయసులో చేరితే: నెలకు రూ. 200.

ఈ మొత్తాన్ని 60 ఏళ్లు నిండేవరకు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ ఈ నిధులను పర్యవేక్షిస్తుంది.

46
PM SYM Scheme : లబ్ధిదారులు ఎవరు? ఏ ఏ వృత్తుల వారు చేరవచ్చు?
Image Credit : iSTOCK

PM SYM Scheme : లబ్ధిదారులు ఎవరు? ఏ ఏ వృత్తుల వారు చేరవచ్చు?

ఈ పథకం పరిధి చాలా పెద్దది. సమాజంలోని దాదాపు అన్ని రకాల చిరు వృత్తుల వారు ఇందులో చేరవచ్చు..

• కూలీలు: వ్యవసాయ, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు.

• చేతి వృత్తుల వారు: చేనేత కార్మికులు, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, టైలర్లు.

• సేవా రంగం: ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, డ్రైవర్లు, క్లీనర్లు, డెలివరీ బాయ్స్.

• చిరు వ్యాపారులు: తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారు, హోటల్ కార్మికులు, సెలూన్ షాపుల వారు..

56
PM SYM పథకం కుటుంబానికి భరోసా: నామినీకి లభించే ప్రయోజనాలు ఇవే
Image Credit : Getty

PM SYM పథకం కుటుంబానికి భరోసా: నామినీకి లభించే ప్రయోజనాలు ఇవే

దురదృష్టవశాత్తూ పింఛను పొందుతున్న వ్యక్తి మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి (నామినీ) 50 శాతం పింఛను అంటే రూ. 1,500 అందుతుంది. ఒకవేళ లబ్ధిదారుడు 60 ఏళ్లు నిండకముందే మరణిస్తే, అప్పటివరకు జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. దీనివల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.

66
PM SYM Scheme : అప్లై చేసుకోవడం ఎలా?
Image Credit : Getty

PM SYM Scheme : అప్లై చేసుకోవడం ఎలా?

ఈ పథకంలో చేరడం చాలా సులభం. మీకు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది.

• ఆన్‌లైన్ ద్వారా: PM-SYM అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'Self Enrollment' ఆప్షన్ ఎంచుకుని, మొబైల్ ఓటీపీ ద్వారా వివరాలు నమోదు చేయవచ్చు.

• సీఎస్సీ సెంటర్లు: మీ గ్రామంలో లేదా పట్టణంలోని కామన్ సర్వీస్ సెంటర్లు ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.

• డిజిటల్ పేమెంట్: ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతా నుండి ఆటోమేటిక్ గా ప్రీమియం కట్ అయ్యేలా 'ఆటో డెబిట్' సౌకర్యం పెట్టుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
ప్రభుత్వ పథకాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
Recommended image2
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Recommended image3
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Related Stories
Recommended image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Recommended image2
Top 10 IITs in India: ఇండియాలో నంబర్ వన్ ఐఐటీ ఏది? టాప్ 10 లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved