MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • PM Modi: యువతకు ప్రధాని మోదీ గుడ్‌న్యూస్.. ఉచితంగా ఏఐ శిక్ష‌ణ‌, పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్

PM Modi: యువతకు ప్రధాని మోదీ గుడ్‌న్యూస్.. ఉచితంగా ఏఐ శిక్ష‌ణ‌, పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్

PM Modi: 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని పేర్కొంటూ.. నైపుణ్యాభివృద్ధి, పోటీ పరీక్షల సన్నద్ధత, క్రీడలు వంటి రంగాల్లో కొత్త కార్యక్రమాలను ప్రకటించారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 15 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ
Image Credit : X

కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ

ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు AI స్కిల్స్‌లో శిక్షణ అందించేలా దేశవ్యాప్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ శిక్షణ ద్వారా యువతకు కొత్త టెక్నాలజీపై అవగాహన పెరగడంతో పాటు భవిష్యత్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్
Image Credit : ‍X

పోటీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ప్రధాని కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లే స్థోమత లేని విద్యార్థులకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంటి నుంచే శిక్షణ పొందేందుకు ఈ విధానం దోహదపడవచ్చు.

Related Articles

Related image1
ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లోని గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లగ్‌తో సాధ్య‌మే
Related image2
హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త ఫ్లై ఓవ‌ర్‌.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌, రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
35
చిన్నారుల్లో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం
Image Credit : X

చిన్నారుల్లో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం

దేశంలో క్రీడా ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి అవసరమైన అవకాశాలు కల్పిస్తే భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తయారు చేయవచ్చనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు.

45
సెమీకండక్టర్ తయారీలో మరింత వేగం
Image Credit : X

సెమీకండక్టర్ తయారీలో మరింత వేగం

టెక్నాలజీ రంగంలో భారత్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సెమీకండక్టర్ తయారీపై కూడా ప్రధాని దృష్టి సారించారు. వచ్చే ఒకటి నుంచి రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 కొత్త సెమీకండక్టర్ తయారీ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఆటోమొబైల్, టెలికాం వంటి అనేక రంగాలకు ప్రయోజనం కలగడంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.

55
అణుశక్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యం
Image Credit : X

అణుశక్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యం

దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు అణుశక్తి రంగంలో కూడా భారత్ ముందుకు సాగుతుందని ప్రధాని ప్రకటించారు. 2047 నాటికి 100 GW అణుశక్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. అలాగే వచ్చే 6 నుంచి 7 ఏళ్లలో ఐదు కొత్త అణు రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Recommended image2
ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో
Recommended image3
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Related Stories
Recommended image1
ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లోని గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లగ్‌తో సాధ్య‌మే
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త ఫ్లై ఓవ‌ర్‌.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌, రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved