MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లోని గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లగ్‌తో సాధ్య‌మే

ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంట్లోని గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయొచ్చు.. ఈ స్మార్ట్ ప్లగ్‌తో సాధ్య‌మే

Smart Plug: ఇంట్లో పరికరాలను స్మార్ట్‌గా మార్చుకోవాలనుకునే వారికి లైఫ్‌లాంగ్‌ 10A వైఫై స్మార్ట్ ప‌వ‌ర్ ప్ల‌గ్ బెస్ట్ ఆప్ష‌న్‌. సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్‌కు దీన్ని కనెక్ట్ చేసి, మొబైల్ యాప్, అలెక్సా ద్వారా పరికరాలను నియంత్రించుకోవచ్చు.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 15 2026, 07:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
10A సామర్థ్యంతో పలు పరికరాలకు ఉపయోగం
Image Credit : Amazon.in

10A సామర్థ్యంతో పలు పరికరాలకు ఉపయోగం

ఈ స్మార్ట్ ప్లగ్ 10A సామర్థ్యంతో రూపొందించారు. టీవీలు, హీటర్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ వంటి పరికరాలను దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. పాలీకార్బొనేట్ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ ప్లగ్ కాంపాక్ట్ డిజైన్‌లో ఉంటుంది. చిన్న పరిమాణం కారణంగా ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. అయితే ఏ పరికరాన్నైనా కనెక్ట్ చేసే ముందు దాని పవర్ అవసరాలు, స్మార్ట్ ప్లగ్ సామర్థ్యానికి అనుగుణంగా ఉన్నాయో చూసుకోవడం మంచిది. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడ‌క్ట్ ధ‌ర రూ. 890గా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటి గ్యాడ్జెట్లపై కంట్రోల్
Image Credit : Amazon.in

ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటి గ్యాడ్జెట్లపై కంట్రోల్

ఈ స్మార్ట్ ప్లగ్‌లోని Wi-Fi కనెక్టివిటీ ప్రధాన ఆకర్షణ. ఇంట్లో ఉన్న పరికరాన్ని స్మార్ట్ ప్లగ్‌కు కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్ యాప్ ద్వారా రిమోట్‌గా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. అంటే మీరు ఇంటికి దూరంగా మరో నగరంలో లేదా ప్రపంచంలో ఎక్కడో ఉన్నా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు యాప్ ద్వారా కనెక్ట్ చేసిన పరికరాన్ని నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయినా.. మొబైల్ ద్వారా స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

Related Articles

Related image1
'కథ కంచికి మ‌నం ఇంటికి' అని ఎందుకు అంటారో తెలుసా.? దీని వెనుక ఇంత అర్థం ఉందా?
Related image2
హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త ఫ్లై ఓవ‌ర్‌.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌, రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
35
టైమర్, షెడ్యూల్‌తో ఆటోమేటిక్ కంట్రోల్
Image Credit : Amazon.in

టైమర్, షెడ్యూల్‌తో ఆటోమేటిక్ కంట్రోల్

ప్రతిరోజూ ఒకే సమయంలో కొన్ని పరికరాలను ఆన్ లేదా ఆఫ్ చేయాల్సి వస్తే వాటి కోసం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ స్మార్ట్ ప్లగ్‌లో టైమర్, షెడ్యూలింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఉదయం ఒక నిర్దిష్ట సమయంలో పరికరం ఆన్ కావాలని, రాత్రి ఒక నిర్దిష్ట సమయంలో ఆఫ్ కావాలని ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇలా రోజువారీ పనులను ఆటోమేటిక్‌గా నిర్వహించుకోవడంతో విద్యుత్ వృథాను కూడా కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

45
అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కంట్రోల్
Image Credit : Amazon.in

అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ కంట్రోల్

స్మార్ట్‌ఫోన్ యాప్‌తో పాటు అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా కూడా ఈ ప్లగ్‌ను నియంత్రించవచ్చు. వాయిస్ కమాండ్‌తో కనెక్ట్ చేసిన పరికరాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. అలాగే ఇంట్లోని ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్ పరికరాలను గ్రూప్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కంట్రోల్ యాక్సెస్‌ను షేర్ చేసే అవకాశం కూడా ఉంది. దీంతో ఇంట్లోని స్మార్ట్ పరికరాలను ఒకే సిస్టమ్ ద్వారా నిర్వహించుకోవడం సులభమవుతుంది.

55
భద్రత, ఓవర్‌లోడ్ రక్షణపై దృష్టి
Image Credit : Amazon.in

భద్రత, ఓవర్‌లోడ్ రక్షణపై దృష్టి

ఈ స్మార్ట్ ప్లగ్‌లో టైమర్, ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. పవర్ సమస్యలు లేదా అధిక లోడ్ ఏర్పడినప్పుడు పరికరాలకు నష్టం కలగకుండా రక్షణ అందించడమే వీటి ఉద్దేశం. అయితే హై-పవర్ పరికరాలను ఉపయోగించే సమయంలో 10A పరిమితిని దాటకుండా జాగ్రత్త వహించాలి. నాణ్యమైన సాకెట్, సరైన వైరింగ్‌తో ఉపయోగించడం కూడా ముఖ్యం. మొత్తంగా, సాధారణ ఎలక్ట్రిక్ పరికరాలను స్మార్ట్‌గా మార్చుకోవాలనుకునే వారికి ఈ Lifelong Wi-Fi Smart Plug ఉపయోగకరమైన గ్యాడ్జెట్‌గా చెప్పొచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే
Recommended image2
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image3
Amazon Freedom Sale: ఆగస్ట్ 15 సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్...స్మార్ట్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్
Related Stories
Recommended image1
'కథ కంచికి మ‌నం ఇంటికి' అని ఎందుకు అంటారో తెలుసా.? దీని వెనుక ఇంత అర్థం ఉందా?
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త ఫ్లై ఓవ‌ర్‌.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌, రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved