MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు అలర్ట్

Weather update: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 3 వరకు అలర్ట్

Weather update: బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు 3 వరకు ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 28 2026, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు
Image Credit : gemini

వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పై తన ప్రభావం చూపుతోంది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం.. ఆగస్టు 3 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బంగాళాఖాతంలో వాయుగుండం
Image Credit : Gemini

బంగాళాఖాతంలో వాయుగుండం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం బాగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది గంటకు సుమారు 3 కిలోమీటర్ల నెమ్మదిగా ఉండే వేగంతో ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న హల్దియా, బాలాసోర్ మధ్య కేంద్రీకృతమై ఉంది. కొద్ది గంటల్లో హల్దియా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా కోస్తా ప్రాంతాల్లోని ఓడరేవుల్లో మూడో నంబరు, ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేశారు.

Related Articles

Related image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Related image2
Samsung Galaxy S27 Series: శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు.. ఐఫోన్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్!
36
తెలంగాణలో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులకు అలర్ట్
Image Credit : Gemini AI

తెలంగాణలో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులకు అలర్ట్

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఆగస్టు 3 వరకు తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో అక్కడక్కడ కుండపోత వర్షాలు పడవచ్చు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై నీరు నిలిచే సమస్య తలెత్తకుండా పోలీసులు స్పందించారు. ఐటీ కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగులను ముందస్తుగా లాగ్‌అవుట్ అయ్యేందుకు అనుమతించాలని కీలక సూచనలు చేశారు. దీనివల్ల ఉద్యోగులు సురక్షితంగా ఇళ్లకు చేరుకోవచ్చని స్పష్టం చేశారు.

46
ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం ఎంత?
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌పై వాయుగుండం ప్రభావం ఎంత?

ఈ తీవ్ర వాయుగుండం తన దిశను మార్చుకుని ఉత్తరం వైపుగా వెళ్లడం వల్ల అనుకున్న స్థాయిలో భారీ వర్షాలు పడటం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడవచ్చు.

అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు 54 శాతం వర్షపాతం లోటు నమోదవ్వడం, ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో వ్యవసాయానికి సరైన నీరు అందక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

56
గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన గాలులు
Image Credit : Gemini

గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన గాలులు

వర్షాలతో పాటు రెండు రాష్ట్రాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. అందుకే సముద్రం అలజడిగా ఉంటుందని, బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వస్తున్న సమయంలో బయట ఉన్నవారు పొరపాటున కూడా పెద్ద చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా ప్రకటనల హోర్డింగ్స్ కింద నిలబడకూడదని తెలిపారు.

66
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాబోయే కొద్ది రోజులు వాతావరణం అస్థిరంగా ఉండనుంది. అత్యవసర పనులు ఉంటే తప్ప వర్షం పడే సమయంలో బయటకు రాకపోవడమే మంచిది. వాహనదారులు, రోడ్లపై వెళ్లేవారు చెట్ల కింద ఆగకుండా సురక్షంగా వెళ్లాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
Recommended image2
Heavy Rain Alert : తీవ్ర వాయుగుండం దెబ్బకు ఈ మూడ్రోజుల్లో 100-120 మి.మీ వర్షం కురుస్తుందా..! ఈ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image3
Now Playing
నారాలోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి: బొత్స | Botsa Satyanarayana | Asianet News Telugu
Related Stories
Recommended image1
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Recommended image2
Samsung Galaxy S27 Series: శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు.. ఐఫోన్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved