MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • మోదీ కాన్వాయ్‌లో అన్ని వాహ‌నాలు ఎందుకు ఉంటాయి.? ఏ వాహ‌నం ఉప‌యోగం ఏంటో తెలుసా?

మోదీ కాన్వాయ్‌లో అన్ని వాహ‌నాలు ఎందుకు ఉంటాయి.? ఏ వాహ‌నం ఉప‌యోగం ఏంటో తెలుసా?

Modi convoy: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఇంధ‌నం ఆదా చేసే క్ర‌మంలో తన భద్రతా కాన్వాయ్‌లో ఉండే వాహనాల సంఖ్యను తగ్గించాలన్నారు. ఇంత‌కీ మోదీ కాన్వాయ్‌లో ఎన్ని వాహ‌నాలుంటాయో తెలుసా? 

2 Min read
Author : Narender Vaitla
Published : May 15 2026, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు
Image Credit : Doordarshan National/Youtube

కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు

ఇంధనాన్ని ఆదా చేయడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయం తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వంటి నేతలు కూడా తమ కాన్వాయ్‌లో వాహ‌నాల‌ను త‌గ్గించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బ్లూ బుక్ ప్రకారం భద్రతా వ్యవస్థ
Image Credit : Doordarshan National/Youtube

బ్లూ బుక్ ప్రకారం భద్రతా వ్యవస్థ

ప్రధాని భద్రతకు సంబంధించిన అన్ని నియమాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన “బ్లూ బుక్”లో ఉంటాయి. ఇది అత్యంత గోప్యమైన భద్రతా పత్రం. ఇందులో ప్రధాని ఎక్కడికి వెళ్లినా ఎలాంటి భద్రత ఉండాలి, ఎన్ని వాహనాలు ఉండాలి అనే వివరాలు ముందుగానే నిర్ణయిస్తారు. స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ గ్రూప్ (SPG) ఈ భద్రతా ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తుంది. కార్యక్రమం జరిగే ప్రదేశం, ముప్పు స్థాయి, మార్గం వంటి అంశాల ఆధారంగా కాన్వాయ్ రూపకల్పన జరుగుతుంది.

36
పీఎం కాన్వాయ్‌లో ఉండే ప్రధాన వాహనాలు
Image Credit : Doordarshan National/Youtube

పీఎం కాన్వాయ్‌లో ఉండే ప్రధాన వాహనాలు

సాధారణంగా ప్రధాని కాన్వాయ్‌లో కనీసం 18 ప్రధాన వాహనాలు ఉంటాయి. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా సిబ్బంది, అత్యవసర సేవల కోసం మరో 6 నుంచి 8 వాహనాలు వెంట నడుస్తాయి. మొత్తం 24 వరకు వాహనాలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాన్వాయ్‌లో పలు రకాల ప్రత్యేక వాహనాలు ఉంటాయి. వాటిలో పైలట్ కార్లు, భద్రతా ఎస్కార్ట్ వాహనాలు, జూమ‌ర్‌ వాహనాలు, డమ్మీ కార్లు, అంబులెన్స్, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు ఉంటాయి. వీటిలో ప్రతి వాహనానికి ప్రత్యేక బాధ్యత ఉంటుంది.

46
ప్రధాని ప్రయాణించే అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ కారు
Image Credit : Doordarshan National/Youtube

ప్రధాని ప్రయాణించే అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ కారు

ప్రధాని మోదీ ఎక్కువగా ఉపయోగించే వాహనం Mercedes-Maybach S650 Guard. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ కారుకు VR-10 భద్రతా రేటింగ్ ఉంది. ఈ వాహనం AK-47 తుపాకీ గుళ్లను, హ్యాండ్ గ్రెనేడ్లను తట్టుకోగలదు. వాహనం దగ్గర భారీ పేలుడు జరిగినా లోపల ఉన్న వ్యక్తికి రక్షణ కలిగేలా రూపొందించారు. గ్యాస్ దాడులు జరిగినా ప్రత్యేక ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఇది కేవలం కారు మాత్రమే కాదు.. ఒక మొబైల్ సెక్యూరిటీ బంకర్‌లా పనిచేస్తుంది.

56
జూమర్‌ కార్లు, డమ్మీ వాహనాల పని ఇదే
Image Credit : Doordarshan National/Youtube

జూమర్‌ కార్లు, డమ్మీ వాహనాల పని ఇదే

కాన్వాయ్‌లో అత్యంత కీలకమైన వాటిలో జూమర్ వాహనాలు ఒకటి. ఈ వాహనాలపై ప్రత్యేక యాంటెనాలు ఉంటాయి. వీటి పని చుట్టుపక్కల ఉన్న రేడియో సిగ్నళ్లను నిలిపివేయడం. దీనివల్ల రిమోట్‌తో పేల్చే బాంబులు పనిచేయకుండా అడ్డుకోవచ్చు. అలాగే కాన్వాయ్‌లో ఒకేలా కనిపించే రెండు లేదా మూడు కార్లు కూడా ఉంటాయి. వీటిని డమ్మీ కార్లు అంటారు. చివరి నిమిషం వరకు ప్రధాని ఏ కారులో ప్రయాణిస్తారో గోప్యంగా ఉంచుతారు. ఇది భద్రతా వ్యూహంలో కీలక భాగం. కాన్వాయ్‌లో రేంజ్ రోవ‌ర్ సెంటిటెల్‌, ట‌యోట ల్యాండ్ క్రూజ‌ర్‌, బీఎమ్‌డ‌బ్ల్యూ 7 సిరీస్ వంటి బలమైన భద్రతా వాహనాలు కూడా ఉంటాయి.

66
అత్యవసర పరిస్థితులకు ప్రత్యేక ఏర్పాట్లు
Image Credit : Narendra Modi/Youtube

అత్యవసర పరిస్థితులకు ప్రత్యేక ఏర్పాట్లు

ప్రధాని కాన్వాయ్‌తో పాటు ఎప్పుడూ ఒక అత్యాధునిక అంబులెన్స్ కూడా ప్రయాణిస్తుంది. ఇందులో ప్రాణరక్షక పరికరాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిన వెంటనే చికిత్స అందించేందుకు ఈ ఏర్పాటు ఉంటుంది. అలాగే ప్రధాని పార్లమెంట్‌కు వెళ్లేటప్పుడు మాత్రం కాన్వాయ్ కొంత చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ పరిసర ప్రాంతం ఇప్పటికే అత్యంత భద్రతా వలయంలో ఉంటుంది. అయినప్పటికీ అవసరమైన జూమ‌ర్‌ వాహనాలు, భద్రతా కార్లు మాత్రం తప్పనిసరిగా వెంట ఉంటాయి.

మొత్తానికి ప్రధాని కాన్వాయ్ అనేది కేవలం వాహనాల సమూహం కాదు. అత్యాధునిక సాంకేతికత, భద్రతా వ్యూహాలు, అత్యవసర సేవలు కలిసిన ఒక కదిలే రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నరేంద్ర మోదీ
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
ఫ్యాన్ క్లీన్ చేయ‌డానికి కుస్తీలు ప‌డుతున్నారా.? ఇదొక్క‌టి ఉంటే చాలు, మీ ప‌ని చాలా సులువు
Recommended image2
అన్నీ ఉన్నాయన్న అహంకారాన్ని పటాపంచలు చేసే పెట్టె.. ఈ కథ చదివితే ఆలోచన మారడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved