MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Student Free Bus Pass: స్టూడెంట్స్ అందరికీ ఉచిత బస్ పాస్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ !

Student Free Bus Pass: స్టూడెంట్స్ అందరికీ ఉచిత బస్ పాస్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ !

Karnataka Student Free Bus Pass: కర్ణాటక 34వ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కేబినెట్ మీటింగ్‌లోనే విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్‌లు, ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు లాంటి కీలక నిర్ణయాలు ప్రకటించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 04 2026, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సీఎంగా డీకే శివకుమార్ సంచలన నిర్ణయాలు.. నిరుద్యోగులు, విద్యార్థులకు పండగే
Image Credit : X

సీఎంగా డీకే శివకుమార్ సంచలన నిర్ణయాలు.. నిరుద్యోగులు, విద్యార్థులకు పండగే

కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ బుధవారం లోక్ భవన్‌లో గ్రాండ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర, మరో 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలు, పలువురు మఠాధిపతులు, పూజారులు హాజరయ్యారు. పీఎం మోదీ కూడా డీకే శివకుమార్‌కు అభినందనలు తెలుపుతూ కేంద్రం నుంచి సపోర్ట్ ఉంటుందని అన్నారు.

పదవి చేపట్టిన కొన్ని గంటల్లోనే సీఎం డీకే శివకుమార్ ఫస్ట్ కేబినెట్ మీటింగ్ పెట్టారు. యువత, స్టూడెంట్స్ టార్గెట్‌గా సూపర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. రాష్ట్రంలోని స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఉచిత బస్ పాస్‌లు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నిరుద్యోగం పోగొట్టేందుకు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కూడా తీసుకురాబోతున్నట్లు చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అబ్బాయిలకు కూడా ఫ్రీ బస్ పాస్.. డీకే శివకుమార్ ఏమన్నారంటే?
Image Credit : Gemini

అబ్బాయిలకు కూడా ఫ్రీ బస్ పాస్.. డీకే శివకుమార్ ఏమన్నారంటే?

"ఇది యూత్ ట్రెండ్ నడుస్తున్న టైమ్. కేవలం అమ్మాయిలకే ఎందుకు ఫ్రీ బస్ అని చాలా మంది అడుగుతున్నారు. అందుకే స్కూల్, కాలేజ్ చదివే స్టూడెంట్స్ అందరికీ ఎలాంటి ఛార్జ్ లేకుండా ఫ్రీ బస్ పాస్ ఇవ్వాలని మా కేబినెట్ ఫస్ట్ డెసిషన్ తీసుకుంది" అని డీకే శివకుమార్ చెప్పారు. ఆల్రెడీ రాష్ట్రంలో శక్తి స్కీమ్ కింద మహిళలు, విద్యార్థినులకు ఫ్రీ ట్రావెల్ ఉంది. ఇప్పుడు దీన్ని బాయ్స్‌కు కూడా వర్తింపజేశారు. ఈ స్కీమ్ కోసం స్టూడెంట్స్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రవాణా శాఖతో మాట్లాడి దీని పూర్తి మెకానిజం సెట్ చేస్తామన్నారు.

ఈ సందర్భంగా డీకే శివకుమార్ ఎమోషనల్ అయ్యారు. "జనం నాపై ఎంతో నమ్మకం ఉంచారు. గతంలో నన్ను విమర్శించిన వాళ్లు ఉన్నారు, పొగిడిన వాళ్లు ఉన్నారు. చిన్న వయసులోనే పవర్ చూశాను, కష్టాలు, సంతోషాలు అన్నీ దాటుకుని వచ్చాను. అందుకే నా నమ్మకం ఎప్పుడూ ప్రజలే" అని చెప్పారు. ఒంటరిగా ఏ లీడర్ మార్పు తీసుకురాలేడని, అందరం కలిసికట్టుగా నవ కర్ణాటకను బిల్డ్ చేద్దామని పిలుపునిచ్చారు.

34
నిరుద్యోగుల కోసం ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్.. ఫార్మర్స్ కోసం కొత్త ప్లాన్
Image Credit : Getty

నిరుద్యోగుల కోసం ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్.. ఫార్మర్స్ కోసం కొత్త ప్లాన్

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించిన రూల్స్ వన్ మంత్‌లో ఫైనల్ అవుతాయి. జాబ్స్ కావాల్సిన వాళ్లు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వం స్వయంగా కంపెనీలతో మాట్లాడి జాబ్ ప్లేస్‌మెంట్స్ ఇప్పిస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్‌మెంట్ కోసం త్వరలోనే ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ రిలీజ్ చేస్తామన్నారు.

రైతులు సిటీలకు వలసపోకుండా ఆపేందుకు గట్టి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు కర్ణాటక అంతటా అన్‌అథరైజ్డ్ బిల్డింగ్స్‌కు ఏ-ఖాతా డాక్యుమెంట్స్ ఇచ్చే డ్రైవ్‌ను ఎక్స్‌టెండ్ చేస్తున్నట్లు చెప్పారు. యూత్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంచడానికి, సోషల్ హార్మొనీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువ సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విలేజ్ పంచాయతీలోని సంఘానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

44
బస్ పాస్ ఎలా అప్లై చేయాలి? పూర్తి డిటెయిల్స్ ఇవే
Image Credit : Getty

బస్ పాస్ ఎలా అప్లై చేయాలి? పూర్తి డిటెయిల్స్ ఇవే

2026-27 సంవత్సరానికి గానూ స్టూడెంట్స్ ఉచిత బస్ పాస్ కోసం పూర్తిగా కంప్యూటరైజ్డ్ విధానంలో సేవాసింధు పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రాసెస్: స్టూడెంట్స్ https://sevasindhuservices.karnataka.gov.in/buspassservices/ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. మే 29, 2026 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. పోర్టల్‌లో అప్లై చేయడం ఫ్రీ.

సెంటర్లలో అప్లై చేస్తే: కర్ణాటక-వన్, గ్రామ్-వన్, బెంగళూరు-వన్ సెంటర్లలో కూడా అప్లై చేయొచ్చు. కానీ అక్కడ రూ.30 సర్వీస్ ఛార్జ్ కట్టాలి.

డిక్లరేషన్ ఫామ్: సేవాసింధు లేదా KSRTC వెబ్‌సైట్ నుంచి డిక్లరేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని, అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేయాలి. పాస్ కలెక్ట్ చేసుకోవడానికి నచ్చిన కౌంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

పాస్ జారీ: అప్లికేషన్ అప్రూవ్ అయ్యాక మొబైల్‌కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. జూన్ 1, 2026 నుంచి నిర్దేశిత కౌంటర్లలో క్యాష్, యూపీఐ లేదా కార్డు ద్వారా ప్రిస్క్రిప్షన్ ఫీజు కట్టి పాస్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. బోర్డర్ స్టేట్స్‌లో ఉంటూ కర్ణాటకలో చదివే వారు కూడా దీనికి అప్లై చేసుకోవాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
బెంగళూరు
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Protest : సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్.. రాహుల్, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
Recommended image2
Rahul Gandhi: సీఈసీకి మోదీ రక్షణ.. ఢిల్లీని జైలుగా మార్చేశారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
INDIA Bloc Protest: సీజేఐ నో చెప్పినా ఆగని ఇండియా కూటమి నిరసనలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
RBI: ఇకపై ప్లాస్టిక్ నోట్లు.. 50, 100, 200, 500 నోట్లు రద్దవుతాయా? ఆర్బీఐ ప్లానేంటి?
Recommended image2
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved