ఫ్యాన్ క్లీన్ చేయడానికి కుస్తీలు పడుతున్నారా.? ఇదొక్కటి ఉంటే చాలు, మీ పని చాలా సులువు
Ceiling Fan Cleaning: ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయడం చాలా మందికి ఇబ్బందిగా అనిపించే పని. ఫ్యాన్‌పై పేరుకుపోయిన దుమ్ము కింద పడిపోవడం వల్ల బెడ్, సోఫా, నేల మొత్తం మురికిగా మారిపోతాయి. అయితే ఈ ఒక్క ప్రొడక్ట్‌తో మీ కష్టం మొత్తం పరార్ అవ్వాల్సిందే.

ఫ్యాన్ క్లీనింగ్ కోసం ప్రత్యేక డిజైన్
అమెజాన్‌లో అందుబాటులో ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ అటాచ్‌మెంట్ ఫ్యాన్ క్లీనింగ్ టూల్ (Vacuum Cleaner Attachment Fan Cleaning Tool). ఈ క్లీనింగ్ బ్రష్‌ను ప్రత్యేకంగా సీలింగ్ ఫ్యాన్లను శుభ్రం చేయడానికి రూపొందించారు. ఫ్యాన్ బ్లేడ్‌లపై పేరుకుపోయిన దుమ్మును సులభంగా తీసేయగలిగే విధంగా దీని ఆకారం ఉంటుంది. ఫ్యాన్‌ను తుడిచేటప్పుడు దుమ్ము ఎక్కువగా చెల్లాచెదురుగా పడకుండా ఇది సహాయపడుతుంది. ఇంట్లో మూలల్లో ఉండే దుమ్మును కూడా ఈ టూల్‌తో సులభంగా శుభ్రం చేయవచ్చు. దీంతో ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం మరింత ఈజీ అవుతుంది.

వాష్ చేసి మళ్లీ ఉపయోగించుకోవచ్చు
ఈ టూల్‌లో ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. కొన్ని ఫ్యాన్లు శుభ్రం చేసిన తర్వాత బ్రష్‌పై దుమ్ము పేరుకుపోతుంది. అప్పుడు దీన్ని సాధారణ సబ్బు నీటితో కడిగి, గాలి వచ్చే చోట ఆరబెడితే మళ్లీ కొత్తదిలా మారుతుంది. ప్రతి సారి కొత్త క్లీనింగ్ బ్రష్ కొనాల్సిన అవసరం లేకపోవడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంటి పనుల్లో డబ్బు ఆదా కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
తక్కువ సమయంలో క్లీనింగ్ పూర్తి
సాధారణంగా ఫ్యాన్ శుభ్రం చేయాలంటే కుర్చీ లేదా స్టూల్ ఎక్కాల్సి వస్తుంది. కొందరు లాడర్ కూడా ఉపయోగిస్తారు. కానీ ఈ టూల్‌తో అలాంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ఫ్యాన్‌ను వేగంగా శుభ్రం చేయగలిగే కారణంగా తక్కువ సమయంలో పని పూర్తవుతుంది. మహిళలు, వృద్ధులు, బిజీగా ఉండే కుటుంబాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంట్లో అన్ని గదుల్లో ఉపయోగించవచ్చు
ఈ క్లీనింగ్ టూల్‌ను కేవలం ఫ్యాన్లకే కాకుండా ఇంట్లోని ఇతర ప్రదేశాల్లో కూడా ఉపయోగించవచ్చు. కిచెన్‌లో ఉండే దుమ్ము, బెడ్‌రూమ్‌లో మూలల్లో పేరుకుపోయిన మురికి, హాల్ వంటి వాటిని కూడా సులభంగా శుభ్రం చేయొచ్చు. ఆఫీస్ గదుల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒకే టూల్‌తో ఇంట్లో అనేక క్లీనింగ్ పనులు చేయగలగడం దీని ప్రత్యేకత.
ఫ్యాన్‌కు గీతలు పడకుండా సేఫ్ క్లీనింగ్
ఈ బ్రష్‌లో సాఫ్ట్ మెటీరియల్ ఉపయోగించిన కారణంగా ఫ్యాన్ బ్లేడ్‌లపై గీతలు పడే ప్రమాదం ఉండదు. ఫ్యాన్ రంగు లేదా మెరుపు దెబ్బతినకుండా శుభ్రం చేయవచ్చు. ఫ్యాన్‌ను జాగ్రత్తగా చూసుకునే వారికి ఇది మంచి క్లీనింగ్ టూల్‌గా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్న ఖరీదైన ఫ్యాన్లను కూడా నమ్మకంగా శుభ్రం చేయవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ టూల్ ధర ఎక్కువ అనుకుంటే పొరబడినట్లే. అమెజాన్‌లో ఈ టూల్ అసలు ధర రూ. 1599 కాగా అమెజాన్‌లో 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 999కే అందుబాటులో ఉంది.

