MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • LPG Price: దెబ్బ మీద దెబ్బ‌, సామాన్యుడి నెత్తిపై మ‌రో పిడుగు.. భారీగా పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు

LPG Price: దెబ్బ మీద దెబ్బ‌, సామాన్యుడి నెత్తిపై మ‌రో పిడుగు.. భారీగా పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు

LPG Price Hike: దేశంలో ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు మరో షాక్ తగిలింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మళ్లీ పెంచాయి. పెంచిన ధ‌ర‌లు జూన్ 7 నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 07 2026, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావమే ప్రధాన కారణం
Image Credit : Gemini AI

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావమే ప్రధాన కారణం

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముడి చమురు సరఫరాపై ఏర్పడిన అనిశ్చితి ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో గ్యాస్ దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో దేశీయ చమురు సంస్థలపై ఆర్థిక భారం అధికమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరల సవరణ తప్పనిసరి అయిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం నుంచి 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.29 అదనంగా వసూలు చేయనున్నట్లు ప్రకటించాయి. కొత్త ధరలు జూన్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. గత మూడు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా గ్యాస్ ధరలు
Image Credit : Asianet News

దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా గ్యాస్ ధరలు

కొత్త ధరల అమలుతో వివిధ నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

* హైదరాబాద్ – రూ.967 నుంచి రూ.996కి పెరిగింది.

* ఢిల్లీ – రూ.913 నుంచి రూ.942

* ముంబై – రూ.912.50 నుంచి రూ.941.40

* కోల్‌కతా – రూ.939 నుంచి రూ.968

* చెన్నై – రూ.928.50 నుంచి రూ.957.50

* బెంగళూరు – రూ.915.50 నుంచి రూ.944.50

* పాట్నా – రూ.1002.50 నుంచి రూ.1031.50

* లక్నో – రూ.951 నుంచి రూ.980

* జైపూర్ – రూ.916.50 నుంచి రూ.945.50. ప్ర‌స్తుతం దేశంలో అత్యధిక గ్యాస్ ధ‌ర పాట్నాలో ఉంది.

Related Articles

Related image1
Cockroach: ల‌క్ష‌లాది బొద్దింక‌ల‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Related image2
మీరు కూడా రైళ్ల‌లో సమోసాలను ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్ల‌రు
34
సబ్సిడీలు కొనసాగుతున్నా..
Image Credit : Getty

సబ్సిడీలు కొనసాగుతున్నా..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వల్ల కోట్లాది కుటుంబాలకు కొంత ఉపశమనం లభిస్తున్నప్పటికీ, గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. ఒక సిలిండర్‌ను వినియోగదారునికి అందించడానికి వాస్తవ వ్యయం మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగ గ్యాస్ విక్రయాల కారణంగా చమురు సంస్థలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర క్యాబినెట్ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కూడా మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు సబ్సిడీ నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది.

44
గ్యాస్‌తో పాటు ఇతర ఇంధనాల ధరలూ
Image Credit : Asianet News

గ్యాస్‌తో పాటు ఇతర ఇంధనాల ధరలూ

ఇటీవల కాలంలో గ్యాస్ మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. మే నెల మధ్య నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపించగా, సీఎన్‌జీ ధరలు కూడా పెరిగాయి. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో కూడా ఇటీవల వరుసగా పెంపులు చోటుచేసుకున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వంటగ్యాస్ ధరల తాజా పెంపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఇంధన ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Tamil Nadu: అందుకే విజ‌య్‌కి సపోర్ట్ చేశాం.. తొలిసారి ఓపెన్ అయిన స్టాలిన్
Recommended image2
మీరు కూడా రైళ్ల‌లో సమోసాలను ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్ల‌రు
Recommended image3
IRCTC Hyderabad to Kashmir Tour : కాశ్మీర్ కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఫ్లైట్ ప్యాకేజీ.. 6 రోజుల అద్భుతమైన టూర్
Related Stories
Recommended image1
Cockroach: ల‌క్ష‌లాది బొద్దింక‌ల‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image2
మీరు కూడా రైళ్ల‌లో సమోసాలను ఇష్టంగా తింటారా.? ఈ వీడియో చూస్తే జీవితంలో వాటి జోలికి వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved